టీడీపీ అధికారం బీజేపీ భిక్షే
ఎమ్మెల్యేలూ ఖబడ్దార్
తెలుగు తమ్ముళ్ల తీరుపై బీజేపీ నేతలు కావూరి, శ్రీనివాసవర్మ ఫైర్
తెలుగు తమ్ముళ్ల తీరుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మండిపడ్డారు. బీజేపీ భిక్షతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ శ్రేణులపై జులుం ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు.
కొయ్యలగూడెం : టీడీపీ నాయకుల వ్యవహార శైలి, హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు ప్రజలను మోసగిస్తున్న తీరుపై బీజేపీ నాయకులు కావూరి సాంబశివరావు, భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్రస్థారుులో ధ్వజమెత్తారు. పోలవరం నియోజకవర్గ బీజేపీ శ్రేణుల సమావేశాన్ని కొయ్యలగూడెంలో సోమవారం నిర్వహించారు. పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బీజేపీ భిక్షతోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టిందని పేర్కొన్నారు. అరుునా, బీజేపీని అణగదొక్కటానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
తమ వల్లే అధికారం వచ్చిందన్న విషయూన్ని టీడీపీ నేతలు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. చాలాకాలంగా టీడీపీలో ఉంటూ అన్యాయూనికి గురవుతున్న నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీని పటిష్టం చేయూలని శ్రేణులకు సూచించారు.
ఈ నెల 31న ఏలూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున జనసమీకరణ జరపాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చావా రామకృష్ణ వంటి నాయకులు బీజేపీలో చేరడంతో పార్టీ పటిష్టంగా తయూరవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల పాలకమండళ్లలో బీజేపీ నాయకులకే ఆగ్రస్థానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలూ ఖబడ్దార్
కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ శ్రేణులపై జులం ప్రదర్శిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొల్లేరులో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, సానుభూతిపరులపై టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తనను నమ్ముకున్న అనుచర గణానికి రక్షణ తాను కవచంలా నిలబడతానని, రక్తం చిందించైనా కాపాడుకుంటానని కావూరి పేర్కొన్నారు.
భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం కల్ల అని, బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆ పాపం శాపంలా వెంటాడుతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా భవిష్యత్‌లో ఆ పార్టీని వీడి దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించగల బీజేపీలో చేరి చరితార్థులు కావాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు అర్జుల మురళి, కోడూరి లక్ష్మీనారాయణ, బొల్లిన నిర్మల, లక్కరాజు సుజాత, సురేంద్రనాథ్‌బెనర్జీ, కట్టా సత్యనారాయణ, గొలిశెట్టి గంగాధరరావు, మోడేపల్లి నాగు, సరియం రామలక్ష్మి, కొండేపాటి రామకృష్ణ, బొప్పిన నాగేశ్వరరావు, మద్దిబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.