
కావూరికి సమైక్య కాక
కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి, గోబ్యాక్ అంటూ నినాదాలు
చేతకాని, సన్నాసి వెధవలంటూ మంత్రి ఆగ్రహం
చింతలపూడి, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు తన సొంత నియోజకవర్గంలోనే చేదుఅనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌పై మంగళవారం సమైక్యవాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కావూరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, కావూరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన్ను కారు దిగనివ్వకుండా కోడిగుడ్లతో దాడికి దిగారు. పోలీసులతో పాటు తనకూ కోడిగుడ్లు తగలడంతో ఆయన కోపంతో ఊగిపోయారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, చేతకాని వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. కాన్వాయ్‌కు అడ్డంగా పడుకున్న నిరసన కారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.