united andhra supporters
-
ఆవేదనతో.. అగ్నిహోత్రాలై
వేల ఏళ్ల అనుబంధాన్ని విచక్షణారహితంగా తెగగొడుతున్నందుకు ప్రతి హృదయం వేదనతో విలవిలలాడుతోంది. కలిసి ‘కలిమి’నీ, ఖ్యాతినీ ఇనుమడింపజేసుకుంటున్న తెలుగుజాతిని చూసి కన్ను కుట్టి, విభజన చిచ్చు పెట్టిన ; దానికి ఆజ్యం పోసిన వారి కుతంత్రంపై ఆగ్రహంతో ప్రతి కన్నూ అగ్నిహోత్రమవుతోంది. సమకాలీన చరిత్రలో.. ప్రజాస్వామిక వ్యవస్థలో నమోదవుతున్న పరమ విద్రోహంపై ప్రతి గొంతూ రణగర్జన అవుతోంది. సాక్షి, రాజమండ్రి : లోక్‌సభను కాంగ్రెస్ అడ్డాలా మార్చేసి, రాజ్యాంగ నిబంధనల్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసి రాష్ట్ర వి భజన బిల్లును ఆమోదింప చేసుకున్న యూపీఏ ప్రభుత్వపు కు టిలనీతిపై సమైక్యవాదులు నిప్పులు కక్కుతూనే ఉన్నారు. సౌ భ్రాతృత్వాన్ని సహించలేని కుతంత్రంపై కన్నెర్రజేస్తూనే ఉ న్నారు. తరతరాల అనుబంధం తెగిపోతోందన్న ఆవేదనతో వీ ధుల్లోకి వస్తూనే ఉన్నారు. ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నా రు. లోక్‌సభలో ప్రజాస్వామ్యానికి ఎదురైన పరాభవానికి నిరసనగా జనసేనాని, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు జిల్లాలో బుధవారం బంద్‌ను విజయవంతం చేశారు. ర్యాలీలు, ధర్నాలతో రూవాడా మార్మోగాయి. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రామచంద్రపురంలో ఆందోళనకు ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య చరిత్రలో మంగళవారం ఓ దుర్దినం అన్నారు. చెత్తబుట్టలో బీజేపీ జెండాలు.. రాజమండ్రిలో వైఎస్సార్ సీపీ శ్రేణులు అర్బన్ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మెయిన్రోడ్లో ర్యాలీ జరిపి, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. కోటగుమ్మంలో ఉన్న బీజేపీ జెండాను విరగ్గొట్టి చెత్తబుట్టలో పారేశారు. మూలగొయ్యి వద్ద పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు చంద్ర బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో యువకులు మోటార్‌సైకిల్ ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూయించారు. బొమ్మన, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యద ర్శి సుంకర చిన్ని, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ పరిధిలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. బొమ్మూరులో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫ్లెక్సీలు దహనం చేసి, జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. సోనియా ఫ్లెక్సీకి కోడిగుడ్ల దెబ్బలు.. పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కంబాలచెరువు వద్ద ఆ పార్టీ జెండాలను తగుల బెట్టారు. సోనియా ఫ్లెక్సీని కుళ్లిన కోడి గుడ్లు, టమాటాలతో కొట్టారు. కాకినాడలో వైఎస్సార్ సీపీ అర్బన్ అధ్యక్షులు ఫ్రూటీ కుమార్ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. మెయిన్ రోడ్డులో ర్యాలీ జరిపి, కాంగ్రెస్. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. సోనియాగాంధీ, హోం మంత్రి షిండేల దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాకినాడ రూరల్ పరిధిలో కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్లో రాస్తారోకో చేశారు. రగిలిన కోనసీమ పాయకరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అమలాపురం కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో అమలాపురంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేసి బంద్ చేయించారు. హైస్కూల్ సెంటర్లో రాహుల్‌గాంధీ ఫ్లెక్సీని దహనం చేశారు. ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తులసాయి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అన్ని వర్గాలతో బంద్ పాటింప జేశారు. రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే, కొత్తపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో 16వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రామచంద్రపురంలో పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఎల్ఐసీ భవనం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకూ ర్యాలీ చేసి మున్సిపల్ కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పి.గన్నవరంలో పార్టీ కార్యకర్తలు మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహం ఎదురుగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నగరంలో, అంబాజీపేటలో సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. కొమరాడలో వై ఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మానవహా రంగా ఏర్పడి నిరసన తెలిపారు. రైతు విభాగం రాష్ట్ర క మిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ, జిల్లా అధికార ప్ర తి నిధి పి.కె.రావు, మరో నేత విప్పర్తి వేణుగోపాలరావు పా ల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు మలికిపురం, సఖినేటిపల్లి, రా జోలు సెంటర్లలో ర్యాలీలు జరిపి, బంద్ చేయించారు. ‘కోట’ మున్సిపల్ కార్యాలయంపై నల్లజెండా సామర్లకోటలో మున్సిపల్ కార్యాలయంపైన పార్టీ నేతలు నల్లజెండా ఎగురవేసి బ్లాక్‌డే పాటించారు. సోనియా, మన్మోహన్, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ ఫ్లెక్సీని చించి, తగులబెట్టారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో కార్యకర్తలు రాస్తారోకో చేశారు. నియోజక వర్గ కో ఆర్డినేటర్ సుబ్బారా వు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఏలేశ్వరంలో పార్టీ నేతలు సోనియా దిష్టిబొమ్మను దహ నం చేశారు. శంఖవరం, ప్రతిపాడుల్లో టీడీపీ శ్రేణులతో కలిసి బంద్ చేయించారు. జగ్గంపేటలో సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి దుకాణాలు మూయించారు. నియోజకవర్గంలోని నా లుగు మండలాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. మండపేటలో పార్టీ శ్రేణులు కలువపువ్వు సెంటర్లో రాస్తారోకో చేశారు. ర్యాలీ నిర్వహించి, బంద్ జరిపించారు. జిల్లా రైతు విభాగం కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు పాల్గొన్నారు. రాజానగరంలో పార్టీ నేతలు పాత టీవీలు దహనం చేశారు. కోరుకొండ, సీతానగరం మండల కమిటీల నేతలు బంద్‌ను విజయవంతం చేశారు. రంపచోడవరంలో కార్యకర్తలు ధర్నా చేశారు. గంగవరం, రాజవొమ్మంగి, మారేడుమిల్లిల్లో ర్యాలీలు జ రిగాయి. తుని నియోజక వర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, బంద్ జరిపించారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. తొలుత బైక్ ర్యాలీ చేసి దుకాణాలు మూయిం చారు. అనపర్తి నియోజకవర్గంలో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. టీడీపీ ఆధ్వర్యంలో.. రాజమండ్రిలో టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ నేత మురళీమోహన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేని నివాళులర్పించారు. కాకినాడ సర్పవరం సెంటర్లో టీడీపీ నేతలు మానవహారంగా ఏర్పడి, బంద్ పాటింపచేశారు. తెలుగుయువత ఆధ్వర్యంలో మెయిన్రోడ్లో ర్యాలీ చేశారు. కడియంలో టీడీపీ బంద్ నిర్వహించింది. తునిలో టీడీపీ నేతలు బైక్ ర్యాలీ చేశారు. -
సమైక్యవాదుల నిర్బంధం
పాలకొల్లు, న్యూస్‌లైన్: కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు పర్యటన నేపథ్యంలో గురువారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్యవాదులను పోలీసులు ముందు జాగ్రత్తగా నిర్బంధించారు. కావూరి పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటనకు రావడంతో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైసీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు, జేఏసీ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, ఉద్యోగు జేఏసీ కన్వీనర్ గుడాల హరిబాబు తదితరులతోపాటు మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కావూరిని సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుకుంటున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వారందరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. సాయంత్రం వీరందరినీ సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. -
కావూరికి సమైక్య కాక
కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి, గోబ్యాక్ అంటూ నినాదాలు చేతకాని, సన్నాసి వెధవలంటూ మంత్రి ఆగ్రహం చింతలపూడి, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు తన సొంత నియోజకవర్గంలోనే చేదుఅనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌పై మంగళవారం సమైక్యవాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కావూరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, కావూరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన్ను కారు దిగనివ్వకుండా కోడిగుడ్లతో దాడికి దిగారు. పోలీసులతో పాటు తనకూ కోడిగుడ్లు తగలడంతో ఆయన కోపంతో ఊగిపోయారు. ‘ఎవడు డబ్బులిస్తే వచ్చార్రా సన్నాసుల్లారా, చేతకాని వెధవల్లారా’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. కాన్వాయ్‌కు అడ్డంగా పడుకున్న నిరసన కారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
ఆరని మంటలు
అసెంబ్లీలో కిరణ్, బాబుల గైర్హాజరుపై నిరసన కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్ విశాఖలో అశోక్‌బాబు దిష్టిబొమ్మ దహనం ‘అనంత’లో 72గంటలపాటు రహదారుల దిగ్బంధం సాక్షి నెట్వర్క్: అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. సమైక్యవాదులు మంగళవారం ఎక్కడికక్కడ ముసాయిదా బిల్లు ప్రతులను దహనం చేశారు. అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్కేయూ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం-చెన్నై జాతీయ రహదారిని 72గంటల పాటు రహదారి దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాయదుర్గం, పెనుకొండలో విద్యార్థులు స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. తిరుపతిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో నిర్వహించారు. ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సీఎం కిరణ్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్ధి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చినా సీఎం ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలంటూ రాజకీయ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జె.టి.రామారావు ప్రశ్నించారు. విశాఖలో న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్యవాదులు, ఏలూరులో న్యాయవాదులు ముసారుుదా బిల్లు ప్రతులను తగులబెట్టారు. భీమవరంలో ఆంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అన్ ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్ (రూకా) ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యార్థి గర్జన నిర్వహించారు. కాకినాడలో ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించి, టి.బిల్లు ముసాయిదా ప్రతులను, సోనియా, దిగ్విజయసింగ్ ఫ్లెక్సీలను దహనం చేశారు. కాకినాడ జేఎన్టీయూకే పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మామిడికుదురులో విద్యార్థులు 216 జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులతోపాటు, సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ ఫోటోలను తగుల పెట్టారు. అనంతరం బందర్‌రోడ్డుపై ధర్నా చేశారు. తెలంగాణ బిల్లు కలతతో గుండెపోటు, ఒకరి మృతి తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో కలత చెంది పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు దళిత వాడకు చెందిన గొటికల లూర్ధురాజు(55) సోమవారం రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మరణించాడు. -
సడలని సంకల్పం
సాక్షి, కడప : ‘టీ’నోట్ మంటలు జిల్లాలో రగులుతునే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కేంద్రంపై సమైక్యవాదులు నిప్పులు చెరుగుతునే ఉన్నారు. జిల్లాలో 69వ రోజు సోమవారం సైతం ఆందోళనలు మిన్నంటాయి. అడుగడుగునా సోనియా, కేసీఆర్, రాష్ర్ట, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు అన్ని వర్గాల ప్రజల రోడ్లపైకి చేరి కదం తొక్కారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ సబ్స్టేషన్లను ఉద్యోగులే ట్రిప్ చేయడంతో జిల్లా వాసులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో రెండవరోజూ విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. కడప నగరంలో ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఇంటిని ముట్టడించారు. న్యాయవాదులు,న్యాయశాఖఉద్యోగులు, సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక, ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు శిబిరం వద్ద నిరసన చేపట్టారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. రాజంపేటలో రాష్ట్రాన్ని విభజించడాన్ని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు సర్వేయర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. బద్వేలులో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో ఉన్న విజయ లాడ్జిపైకి ఉపాధ్యాయులు ఎక్కి రాష్ర్టం విడిపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆందోళన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. పోరుమామిళ్ల పట్టణంలో సెయింట్ ఆంతోనీస్ స్కూలు కరస్పాండెంట్ విజయప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదులు గుండు గీయించుకుని సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు. పులివెందులలో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు పాత బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలకు సాంప్రదాయబద్దంగా పిండ ప్రదానం చేశారు. యురేనియం ప్రాజెక్టు పనులు మూడోరోజూ ఆగిపోయాయి. మైదుకూరులో సోనియా ఫ్లెక్సీని ఊరేగిస్తూ చుట్టూ కేంద్ర మంత్రుల మాదిరి భజన చేస్తూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరులో తొండలదిన్నె గ్రామానికి చెందిన రైతులు స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ చేపట్టి దీక్షల్లో పాల్గొన్నారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యుల రిలే దీక్షలు కొనసాగాయి. రాయచోటిలో ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బస్సును తాడుతో పురవీధుల్లో లాగుతూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, న్యాయసమాఖ్య, క్రైస్తవ సమాఖ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. జమ్మలమడుగులో 15 ప్రైవేటు పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీపీపీలో రెండవరోజూ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగులు వేంపల్లె రోడ్డులో ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. -
రెండోరోజూ బంద్ సంపూర్ణం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ 72 గంటల, ఏపీ ఎన్జీవోల 48 గంటల బంద్ పిలుపులో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై పాత టైర్లను వేసి తగులబెట్టారు. సీమాంధ్రలో ప్రైవేటు ఆస్పత్రుల బంద్ నిర్వహించారు. వైద్యులు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర ఠ నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు, రైతులు, మహిళలు రహదారులపైకొచ్చి ఆందోళన నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో జాతీయ రహదారి దిగ్బంధం.. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్యయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకుని కొద్దిదూరం తీసుకువెళ్లి వదలివేశారు. ఎన్టీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు, కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. పెదప్రోలు, మాజేరులో చల్లపల్లిలో వంటావార్పు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రహదారులపై టైర్లు కాల్చి, వాహనాలను అడ్డుపెట్టి సంపూర్ణ బంద్ పాటించారు. నూజివీడులో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జంక్షన్ రోడ్డులో తారురోడ్డుపై ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఉయ్యూరు మండలం చిన ఓగిరాల గ్రామస్తులు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై చెట్లను అడ్డుగా వేసి తగలబెడుతూ వంటావార్పుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉయ్యూరులో సోనియా, షిండే, దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు జోరువానలోనూ అంతిమ యాత్ర చేసి, దహన సంస్కారాలు పూర్తి చేశారు. కంచికచర్ల ప్రాంత ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో టీ నోట్‌కు నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కైకలూరులో టీడీపీ నేతలు రైలురోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కృత్తివెన్నులో వందలాది మంది సమైక్యవాదులు 216 జాతీయ రహదారిపై కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు వారధిపై ఉదయం నుంచే పెద్దసంఖ్యలో చేరి రాస్తారోకో చేశారు. వారధిపైనే సమైక్యవాదులు షిండే, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాద్, డాక్టర్ వాకా వాసుదేవరావుల నేతృత్వంలో బందరుకు వెళ్లే బైపాస్ రోడ్డుపై జేఏసీ నాయకులు, వీవీఆర్, ఉప్పాల వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ మహిళా నేత సామినేని విమలాభాను ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలతో నిరసన తెలిపారు. చిల్లకల్లు-వైరా రహదారి దిగ్బంధం.. జిల్లా సరిహద్దు, ఖమ్మం జిల్లా ప్రవేశం వద్ద చిల్లకల్లు-వైరా రహదారిని దిగ్బంధం చేశారు. సుమారు గంటపాటు చేసిన ఆందోళనలో రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైకలూరు మండలంలోని ఆటపాక, జాన్‌పేట, గోనెపాడు గ్రామాల రహదారులపై ప్రజలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. స్థానిక టౌన్‌హాల్ వద్ద జాతీయ రహదారిపై అడ్డంగా రాళ్లతో గోడను కట్టి వంటావార్పు చేపట్టారు. మచిలీపట్నంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది శనివారం ఓపీని బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో సోనియా, ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు, కేసీఆర్ చిత్రాలను తగులబెట్టారు. నందిగామ జాతీయ రహదారిపై అంబారుపేట బైపాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. గుడివాడలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. జనార్థనపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కొండపల్లి కుమార్‌రెడ్డి 48 గంటల రిలేదీక్షను ప్రారంభించారు. -
72 గంటలు బంద్
రెండు నెలల ఉద్యమాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా టీనోట్‌ను ఆమోదించడం పట్ల జిల్లా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. గురువారం ఉదయం నుంచే టీనోట్ కేబినెట్ ముందుకు రాబోతుందన్న విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమైక్యవాదులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. కర్నూలులో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆత్మకూరులో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇళ్లను ముట్టడించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేబినెట్ టీనోట్‌కు ఆమోదముద్ర వేసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా అన్ని జేఏసీల ప్రతినిధులు ఉద్యమ తీవ్రతకు నిర్ణయించాయి. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. విభజనపై మొదటి నుంచి ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ బంద్ చేపడుతున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి నేతృత్వంలో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఎమ్మిగనూరులో కాంగ్రెస్, టీడీపీ దీక్షా శిబిరాలను సమైక్యవాదులు తొలగించేశారు. డోన్‌లో రైల్వే పట్టాలపై టైర్లకు నిప్పంటించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వెల్దుర్తి వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. కర్నూలు కలెక్టరేట్ కూడలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించి టైర్లకు నిప్పు పెట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తును పటిష్టం చేశారు. - సాక్షి ప్రతినిధి, కర్నూలు -
ఆగిన సమైక్య గుండెలు
రుద్రవరం/కర్నూలు రూరల్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు సమైక్య వాదులు మృతి చెందాడు. రుద్రవరం ఎస్సీ కాలనీకి చెందిన చిటికెల సంతోషమ్మ(55) సోమవారం రాత్రి టివీలో రాష్ట్ర విభజన వార్తలను చూసూ భావోద్వేగానికి గురై కుప్పకూలిపోయింది. కుటుంబీకులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అలాగే కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన కురువ నాగేశ్వరరావు(42) లారీ డ్రైవర్‌గా పని చేసేవారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి రోజు పనికి పోకుండా కర్నూలులో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. 60 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్యమాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీరులో మార్పు రాదని, సోమవారం రాత్రి 9 గంటల సమయంలో టీవీలో సమైక్యాంధ్ర ఉద్యమంపై వస్తున్న వార్తలు చూస్తూ అక్కడే కుప్ప కూలిపోయారు. గమనించిన భార్య మంజుల, కాలనీ వాసులు హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నంలోనే మార్గమధ్యంలోనే మరణించాడు.