ఆగిన సమైక్య గుండెలు | two peoples died for united andhra | Sakshi
Sakshi News home page

ఆగిన సమైక్య గుండెలు

Published Wed, Oct 2 2013 2:28 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

two peoples died for united andhra

రుద్రవరం/కర్నూలు రూరల్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు సమైక్య వాదులు మృతి చెందాడు. రుద్రవరం ఎస్సీ కాలనీకి చెందిన చిటికెల సంతోషమ్మ(55) సోమవారం రాత్రి టివీలో రాష్ట్ర విభజన వార్తలను చూసూ భావోద్వేగానికి గురై కుప్పకూలిపోయింది. కుటుంబీకులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అలాగే కర్నూలు మండలం  నిడ్జూరు గ్రామానికి చెందిన కురువ నాగేశ్వరరావు(42) లారీ డ్రైవర్‌గా పని చేసేవారు.
 
  రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి రోజు పనికి పోకుండా కర్నూలులో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. 60 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్యమాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీరులో మార్పు రాదని, సోమవారం రాత్రి 9 గంటల సమయంలో టీవీలో సమైక్యాంధ్ర ఉద్యమంపై వస్తున్న వార్తలు చూస్తూ అక్కడే కుప్ప కూలిపోయారు. గమనించిన భార్య మంజుల, కాలనీ వాసులు హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నంలోనే మార్గమధ్యంలోనే మరణించాడు.   
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement