
ఆవేదనతో.. అగ్నిహోత్రాలై
వేల ఏళ్ల అనుబంధాన్ని విచక్షణారహితంగా తెగగొడుతున్నందుకు ప్రతి హృదయం వేదనతో విలవిలలాడుతోంది. కలిసి ‘కలిమి’నీ, ఖ్యాతినీ ఇనుమడింపజేసుకుంటున్న తెలుగుజాతిని చూసి కన్ను కుట్టి, విభజన చిచ్చు పెట్టిన ; దానికి ఆజ్యం పోసిన వారి కుతంత్రంపై ఆగ్రహంతో ప్రతి కన్నూ అగ్నిహోత్రమవుతోంది. సమకాలీన చరిత్రలో.. ప్రజాస్వామిక వ్యవస్థలో నమోదవుతున్న పరమ విద్రోహంపై ప్రతి గొంతూ రణగర్జన అవుతోంది.
సాక్షి, రాజమండ్రి :
లోక్‌సభను కాంగ్రెస్ అడ్డాలా మార్చేసి, రాజ్యాంగ నిబంధనల్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసి రాష్ట్ర వి భజన బిల్లును ఆమోదింప చేసుకున్న యూపీఏ ప్రభుత్వపు కు టిలనీతిపై సమైక్యవాదులు నిప్పులు కక్కుతూనే ఉన్నారు. సౌ భ్రాతృత్వాన్ని సహించలేని కుతంత్రంపై కన్నెర్రజేస్తూనే ఉ న్నారు. తరతరాల అనుబంధం తెగిపోతోందన్న ఆవేదనతో వీ ధుల్లోకి వస్తూనే ఉన్నారు. ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నా రు. లోక్‌సభలో ప్రజాస్వామ్యానికి ఎదురైన పరాభవానికి నిరసనగా జనసేనాని, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు జిల్లాలో బుధవారం బంద్‌ను విజయవంతం చేశారు. ర్యాలీలు, ధర్నాలతో రూవాడా మార్మోగాయి. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రామచంద్రపురంలో ఆందోళనకు ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య చరిత్రలో మంగళవారం ఓ దుర్దినం అన్నారు.
చెత్తబుట్టలో బీజేపీ జెండాలు..
రాజమండ్రిలో వైఎస్సార్ సీపీ శ్రేణులు అర్బన్ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్లో ర్యాలీ జరిపి, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. కోటగుమ్మంలో ఉన్న బీజేపీ జెండాను విరగ్గొట్టి చెత్తబుట్టలో పారేశారు. మూలగొయ్యి వద్ద పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు చంద్ర బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గాంధీ, ఎన్‌టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో యువకులు మోటార్‌సైకిల్ ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూయించారు. బొమ్మన, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యద ర్శి సుంకర చిన్ని, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ పరిధిలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. బొమ్మూరులో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫ్లెక్సీలు దహనం చేసి, జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు.
సోనియా ఫ్లెక్సీకి కోడిగుడ్ల దెబ్బలు..
పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కంబాలచెరువు వద్ద ఆ పార్టీ జెండాలను తగుల బెట్టారు. సోనియా ఫ్లెక్సీని కుళ్లిన కోడి గుడ్లు, టమాటాలతో కొట్టారు. కాకినాడలో వైఎస్సార్ సీపీ అర్బన్ అధ్యక్షులు ఫ్రూటీ కుమార్ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. మెయిన్ రోడ్డులో ర్యాలీ జరిపి, కాంగ్రెస్. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. సోనియాగాంధీ, హోం మంత్రి షిండేల దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాకినాడ రూరల్ పరిధిలో కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్‌లో రాస్తారోకో చేశారు.
రగిలిన కోనసీమ
పాయకరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అమలాపురం కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో అమలాపురంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేసి బంద్ చేయించారు. హైస్కూల్ సెంటర్‌లో రాహుల్‌గాంధీ ఫ్లెక్సీని దహనం చేశారు. ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తులసాయి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అన్ని వర్గాలతో బంద్ పాటింప జేశారు. రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే, కొత్తపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో 16వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రామచంద్రపురంలో పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ భవనం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకూ ర్యాలీ చేసి మున్సిపల్ కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పి.గన్నవరంలో పార్టీ కార్యకర్తలు మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహం ఎదురుగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నగరంలో, అంబాజీపేటలో సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. కొమరాడలో వై ఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మానవహా రంగా ఏర్పడి నిరసన తెలిపారు. రైతు విభాగం రాష్ట్ర క మిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ, జిల్లా అధికార ప్ర తి నిధి పి.కె.రావు, మరో నేత విప్పర్తి వేణుగోపాలరావు పా ల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు మలికిపురం, సఖినేటిపల్లి, రా జోలు సెంటర్లలో ర్యాలీలు జరిపి, బంద్ చేయించారు.
‘కోట’ మున్సిపల్ కార్యాలయంపై నల్లజెండా
సామర్లకోటలో మున్సిపల్ కార్యాలయంపైన పార్టీ నేతలు నల్లజెండా ఎగురవేసి బ్లాక్‌డే పాటించారు. సోనియా, మన్మోహన్, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ ఫ్లెక్సీని చించి, తగులబెట్టారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో కార్యకర్తలు రాస్తారోకో చేశారు. నియోజక వర్గ కో ఆర్డినేటర్ సుబ్బారా వు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఏలేశ్వరంలో పార్టీ నేతలు సోనియా దిష్టిబొమ్మను దహ నం చేశారు. శంఖవరం, ప్రతిపాడుల్లో టీడీపీ శ్రేణులతో కలిసి బంద్ చేయించారు. జగ్గంపేటలో సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి దుకాణాలు మూయించారు. నియోజకవర్గంలోని నా లుగు మండలాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. మండపేటలో పార్టీ శ్రేణులు కలువపువ్వు సెంటర్లో రాస్తారోకో చేశారు. ర్యాలీ నిర్వహించి, బంద్ జరిపించారు. జిల్లా రైతు విభాగం కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు పాల్గొన్నారు. రాజానగరంలో పార్టీ నేతలు పాత టీవీలు దహనం చేశారు. కోరుకొండ, సీతానగరం మండల కమిటీల నేతలు బంద్‌ను విజయవంతం చేశారు. రంపచోడవరంలో కార్యకర్తలు ధర్నా చేశారు. గంగవరం, రాజవొమ్మంగి, మారేడుమిల్లిల్లో ర్యాలీలు జ రిగాయి. తుని నియోజక వర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, బంద్ జరిపించారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. తొలుత బైక్ ర్యాలీ చేసి దుకాణాలు మూయిం చారు. అనపర్తి నియోజకవర్గంలో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది.
టీడీపీ ఆధ్వర్యంలో..
రాజమండ్రిలో టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ నేత మురళీమోహన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేని నివాళులర్పించారు. కాకినాడ సర్పవరం సెంటర్లో టీడీపీ నేతలు మానవహారంగా ఏర్పడి, బంద్ పాటింపచేశారు. తెలుగుయువత ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్లో ర్యాలీ చేశారు. కడియంలో టీడీపీ బంద్ నిర్వహించింది. తునిలో టీడీపీ నేతలు బైక్ ర్యాలీ చేశారు.