కాంగ్రెస్లో కొనసాగాలా.. వద్దా?: కావూరి | Kavuri Sambasiva Rao dilemma on congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్లో కొనసాగాలా.. వద్దా?: కావూరి

Published Sun, Mar 2 2014 9:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్లో కొనసాగాలా.. వద్దా?: కావూరి - Sakshi

కాంగ్రెస్లో కొనసాగాలా.. వద్దా?: కావూరి

ఏలూరు: కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్నానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కేడర్‌, ప్రజలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేస్తానని కావూరి స్పష్టం చేశారు. 1984 కంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి అద్వాన్నంగా ఉందని అన్నారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కావూరి సమర్థించారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పార్టమెంట్‌లో టీబిల్లు అమోదించిన విధానం అవమానకరమని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బలిపెట్టి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడానికి విభజన చేయడం దురదృష్టకరమని అన్నారు. నేటి కేబినెట్‌ భేటీలో పోలవరంపై ఆర్డినెన్స్‌ తీసుకువస్తామని, భద్రాచలం గుడి గ్రామం తప్పితే డివిజన్‌లోని అన్ని గ్రామాలు ఆంధ్రాలో కలిసే విధంగా కృషిచేస్తానని కావూరి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement