DILEMMA
-
జనసేనకు డ్యామేజ్.. పవన్ వీరభక్తులు ఏం చేయబోతున్నారు?
తన రాజకీయాలన్నీ చంద్రబాబు కోసమే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేయడంతో జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ నిర్మాణం జరగకపోయినా పవన్ మీది అభిమానంతో కొనసాగుతున్న కేడర్‌లో తాజా ప్రకటన అసహనం కలిగిస్తోందా? చంద్రబాబుతోనే తన ప్రయాణం అంటున్న పవన్‌కల్యాణ్ వీరభక్తులు ఏం చేయబోతున్నారు? ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో పవన్ కళ్యాణ్‌కి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. వీరంతా పవన్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే నాయకుడే తమ ఆశలను తుంచేశారని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్సీపీని అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలనే అభిప్రాయాన్ని పవన్ వెల్లడించారు. ఇదే ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ చాలామంది టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీకి నిర్మాణం లేకపోయినా, కార్యకర్తల గురించి పవన్ ఏనాడు పట్టించుకోకపోయినా.. తమకోసం పవన్ కోసం ఏదో సాధిస్తాడని పరితపించారు. చంద్రబాబుతో కలసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ నిర్ణయించుకోవడాన్ని చాలామంది జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని విడిచిపెట్టడమే మార్గంగా భావించి బయటకు వెళ్లిపోతున్నారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, నేతలను టార్గెట్ చేసి మాట్లాడటం, చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం నడుచుకోవడం జరుగుతోంది. ఇద్దరి మధ్య ప్రగాఢమైన అనుబంధం ఉన్నా, ఎక్కడా బయట పడకుండా ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ముసుగు రాజకీయాన్ని బట్టబయలు చేసి, చంద్రబాబుకు తనకు మధ్య ఉన్న బంధాన్ని బాహ్య ప్రవంచానికి తెలియజేయడంతో.. జనసేన పార్టీని చాలా వరకూ డ్యామేజ్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య తాజా పరిణామాలు విభేదాలు సృష్టించాయి. పొత్తు కుదిరితే తమ సీటు ఎక్కడ పోతుందో అనే ఆందోళన మొదలైంది. దీంతో ఇరు పార్టీల నేతలు ఒకరిని చూసి ఒకరు భయపడే పరిస్థితి ఏర్పడింది. చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా? మరో వైపు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే పవన్ అభిమానులు, కార్యకర్తలు పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం జనసేనలో ముసలం పుట్టింది. ఇక్కడ పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేనకు గుడ్‌బై చెబుతున్నారు. మండపేట నుంచి గత మూడు సార్లుగా టీడీపీ నేత వేగుళ్ళ జోగేశ్వరరావు వరుసగా ఎన్నికవుతున్నారు. అందువల్ల టీడీపీజనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినా ఇక్కడ జనసేన పోటీ చేయడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. ఈ పరిణామాల నేపథ్యంలో తమకిష్టం లేని పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడాన్ని సహించలేకపోతున్న అనేక మంది జనసేన కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై బీజేపీ పునరాలోచన
-
కరోనా చదువులు!
కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. స్కూళ్లు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యార్థుల సంగతి ఏమిటన్న దానిపై విద్యాశాఖ ఎటూ తేల్చలేకపోతోంది. ఈలోగా కార్పొరేట్, సెమీ కార్పొరేట్ స్కూళ్లు ఆన్లైన్ బోధన అంటూ తరగతులను ప్రారంభిం చేశాయి. జీహెచ్ఎంసీలో ఆన్లైన్ తరగతులు జోరందుకోవడంతో యాజ మాన్యాలు ఫీజు వసూళ్లపై దృష్టి పెట్టాయి. మరోవైపు కొన్ని జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర ప్రముఖ పాఠశాలలు, సాధారణ ప్రైవేటు స్కూళ్లు ఇంకా ఆన్లైన్ తరగతులను ప్రారంభించలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటన్న దానిపై ఇంతవరకు ఏ నిర్ణయమూ లేదు. ఈ పరిస్థితుల్లో వీడియో పాఠాలతో ప్రత్యామ్నాయ విద్యా బోధన సాధ్యం అవుతుందా? దాంతో ఎంతమేరకు ప్రయోజనం చేకూరుతుంది. ఆన్లైన్ బోధన, ప్రత్యక్ష బోధన లోటును పూడ్చగలుగుతుందా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఆన్లైన్ బోధనకు ఆటంకంగా మారుతుండటంతో విద్యా బోధన ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. వానాకాలం చదువుల్లా తయారైన కరోనా చదువులు, విలవిల్లాడుతున్న పాఠశాల విద్యపై సాక్షి ప్రత్యేక కథనాలు. సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారంతా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. రోజూ పని చేసుకుంటే తప్ప జీవనం సాగించలేని ఈ కుటుంబాలకు తమ ఇళ్లలో కరెంటు వినియోగించుకున్నం దుకు వచ్చే బిల్లు, సాధారణ ఫోన్ వినియోగానికి నెలకు అయ్యే ఖర్చు భరించడమూ గగనమే. కరోనా ఆడుతున్న వికృత క్రీడ నేపథ్యంలో పాఠశాలలు తెరిచే పరిస్థితి లేనందున వారి పిల్లలు ఆన్లైన్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా పుణ్యమాని అలాంటి కుటుంబాల్లో ఇప్పుడు ఎల్ఈడీ టీవీలు, కంప్యూ టర్లు, స్మార్ట్ఫోన్లు అవసరమవుతున్నాయి. వేలాది రూపాయలు ఖర్చయ్యే ఈ పరికరాలను కొనుగోలు చేయడం ఈ పేద, మధ్య తరగతి కుటుంబాలకు కరోనా తెచ్చిపెట్టిన మోయలేని భారం. మరోవైపు 10,756 ప్రైవేటు పాఠశాలల్లో చదివే 31 లక్షల మంది విద్యార్థు ల్లోనూ 70% మంది సాధారణ, మధ్యతరగతి కుటుంబా లకు చెందిన పిల్లలే. సాధారణ, ప్రైవేటు ఉద్యోగుల పిల్లలూ ఉన్నారు. పిల్లలకు ఏదోలా మంచి చదువులు చెప్పించాలనే ఆలోచనతో పైసాపైసా కూడబెట్టుకుని, అవసరమైతే అప్పులు చేసి మరీ వేల రూపాయల స్కూల్ ఫీజులు చెల్లిస్తున్న వీరిపై ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ పాఠాలంటూ భారం మోపాయి. విద్యార్థులు విన్నా వినకపోయినా పాఠాలు చెబుతామంటూ ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకూ కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్ పాఠాల కోసం కొత్త ఫోన్లు, కంప్యూటర్లు కొనుగోలు చేయలేక, ప్రైవేటు విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించలేక వారు అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల బాధలు అలా ఉంటే... అసలు విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభించాలో కూడా ప్రభుత్వం ఇదమిత్థంగా నిర్ణయించుకోలేకపోతోంది. ఈ విద్యా సంవత్సరంలో అసలు పాఠశాలలు తెరుస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కీ ఎక్కని వీడియో పాఠాలు, వాటి కోసం తల్లిదండ్రుల తిప్పలు, ఏం చేయాలో పాలుపోని ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలకు పూర్తిగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పామో లేదో అర్థం కాక టీచర్లు... ఇలా అంతటా అయోమయం... గందరగోళం. కరోనా మహమ్మారి రాష్ట్ర విద్యారంగాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పాఠశాల విద్యను మరింత గందరగోళంలో పడేసింది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల మధ్య అనివార్య అంతరాలనూ సృష్టిస్తోంది. ఫీజుల కోసం పాఠాలు కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకంటూ తెరపైకి వచ్చిన ఆన్లైన్ తరగతుల గురించే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. గతంలో వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే పరిమితమైన ఈ ఆన్లైన్ తరగతులు పూర్వ ప్రాథమిక విద్యలోని ఎల్కేజీ వరకు వచ్చేశాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, సెమీ కార్పొరేట్ స్కూళ్లు ఈ ఆన్లైన్ క్లాసుల విషయంలో దూసుకుపోతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేసుకునేందుకు జూన్ నుంచే తరగతులు ప్రారంభించాయి. ఈ క్లాసులు యాక్సెస్ అయ్యేందుకు పాస్వర్డ్ ఇవ్వాలన్నా వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు అసలు ఆ పాఠాలు అర్థం అవుతున్నాయా? లేదా? అన్నది ఓ పెద్ద ప్రశ్న. అయినప్పటికీ ఆన్లైన్ తరగతులను ప్రారంభించాం కాబట్టి ఫీజులు చెల్లించడంటూ తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన కార్పొరేట్, సెమీ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలైతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లకు వచ్చి ఫీజు అగ్రిమెంట్ చేసుకొని మొదటి టర్మ్ ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచాయి. అంతేకాదు యాజమాన్యాలు ఆ ఫీజల వసూలుకు ప్రిన్సిపాళ్లు, క్లాస్ టీచర్లకు టార్గెట్లను విధించాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఫీజులను చెల్లించేలా చూడాలని, అప్పుడే ఇప్పుడు ఇస్తున్న సగం జీతం ఇస్తామంటుండటంతో టీచర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. లేకపోతే జీతం ఇవ్వమని తెగేసి చెబుతుండటంతో టీచర్లు ఆవేదన చెందుతున్నారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సార్.. కొంత ఫీజైనా చెల్లించండి.. అంటూ రోజూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బతిమిలాడుకోవాల్సిన దుస్థితిలో పడ్డారు. కాగా జీహెచ్ఎంసీయేతర పట్టణాల్లో కొన్ని ప్రముఖ పాఠశాలలు, సాధారణ పాఠశాలలు ఇంకా ఆన్లైన్ తరగతులను ప్రారంభించలేదు. సర్కారు బడుల్లో చదువులు ఎలా చెప్పాలన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని తాము ఎవరికీ చెప్పలేదని చెపుతోంది. కానీ, కొన్ని పాఠశాలల్లో ప్రారంభమయిన ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థుల మధ్య అంతరాలు ఏర్పడే ప్రమాదం నెలకొంది. మరోవైపు ఆన్లైన్ పాఠాల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదని విద్యావేత్తలంటున్నారు. విద్యార్థులు ఇంట్లో శ్రద్ధగా ఆన్లైన్ పాఠాలు వినడం లేదని, ముఖ్యంగా ఎల్కేజీ నుంచి ఐదో తరగతి లోపు పిల్లలకు అసలు ఆన్లైన్ అంటేనే తెలియడం లేదని, వారు ల్యాప్‌టాప్‌లు ముందు పెట్టుకుని, స్మార్ట్ ఫోన్లలో చూస్తూ పాఠాలు నేర్చుకోలేకపోతున్నారని ఇప్పటికే కొన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. రికార్డెడ్ వీడియో పాఠాలు పెద్దగా విద్యార్థులకు ఉపయోగపడడం లేదని, లైవ్ తరగతులను విద్యార్థులు సరిగా వినడం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆన్లైన్ పాఠాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఆన్లైన్ తరగతుల వల్ల చిన్న పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్) సంస్థ ఇదివరకే పేర్కొంది. దీంతో కర్నాటక ప్రభుత్వం కేజీ నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్ పాఠాలను నిషేధించింది కూడా. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్, వీడియో, టీవీ పాఠాల విషయంలో ఏం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతుపట్టడం లేదు. మరేం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఓవైపు విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉండడం, మరోవైపు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాష్ట్రంలోని ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇప్పటికే నెల రోజులు నష్టపోగా, అసలు పరిస్థితి ఎప్పుడు గాడిలో పడుతుందనేది ఊహించడం కూడా కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ముందు కూడా ఆన్లైన్ లేదా టీవీ పాఠాలే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ పాఠాలు బోధించే వ్యవస్థ సక్రమంగా లేదు. మరోవైపు ఆ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కుటుంబాలకు కూడా స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో టీశాట్, డీడీ యాదగిరి, నిఫుణ వంటి చానెళ్ల ద్వారా రాష్ట్రంలోని అందరు విద్యార్థులకు పాఠాలు బోధించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కానీ టీవీ పాఠాలు విద్యార్థుల మస్తిష్కాల్లోకి ఏ మేరకు వెళతాయన్నది సందేహాస్పదమే. ఇప్పుడు కొన్ని పాఠశాలలు ప్రారంభించిన ఆన్లైన్ పాఠాలతో పెద్దగా ప్రయోజనం లేదని సర్వేలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఎదురుగా కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పడమే మంచిదని, వేరే మార్గమే లేదని, ఏ మార్గంలో వెళ్లినా విద్యార్థులకు ఉపయోగం ఉండదని విద్యావేత్తలు పేర్కొంటుంటడంతో రాష్ట్రంలో విద్యారంగం ‘ఆన్లైన్’కూడలిలో నిలిచిపోయింది. నిఫుణులు ఏమంటున్నారంటే.. ప్రత్యక్ష బోధనతోనే ప్రయోజనం ఆన్లైన్ పాఠాలు, వీడియో పాఠాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. విద్యార్థులు శ్రద్ధ పెట్టి వినలేరు. చిన్న పిల్లలైతే ఆ పాఠాలను సొంతంగా అర్థం చేసుకునే స్థాయి ఉండదు. మనది పిల్లల ముఖం చూస్తూ బోధించే విద్యా విధానం. అతని ముఖం చూస్తూ అర్థం అవుతోందా? లేదా? అని పరిశీలించి బోధన స్వరూపాన్ని మార్చి చెప్పే పద్ధతి. వీడియో పాఠాలతో అది సాధ్యం కాదు. ఆన్లైన్ బోధనలో కూడా కష్టమే. పాఠశాల స్థాయిలో విద్యార్థులను విభజించి బ్యాచ్‌లుగా చేసి, భౌతిక దూరం పాటిస్తూ దూరం దూరంగా కూర్చోబట్టి బోధిస్తే ప్రయోజనం ఉంటుంది. – విద్యావేత్త చుక్కా రామయ్య ఆన్లైన్ బోధనను ఎక్కువ సమయం వినలేరు ప్రాథమిక స్థాయిలో ఆన్లైన్ బోధన అమలు చేయాలంటే ఒకటి నుంచి రెండు గంటలు మాత్రమే ఉండాలి. చిన్న పిల్లల సైకాలజీ ప్రకారం తరగతి గదిలోనూ 45 నిమిషాల పీరియడ్‌లో కేవలం 10 నుంచి 14 నిమిషాలు మాత్రమే శ్రద్ధ పెడతారు. అంతకుమించి ఎక్కువ సమయం శ్రద్ధతో పాఠం వినలేరు. ప్రాథమిక స్థాయిలో పాఠాలను ఆటలు, పాటలు, సంభాషణ రూపంలోకి మార్చి చెబితేనే ఉపయోగం ఉంటుంది. 6 నుంచి 10వ తరగతి వారికి ఇంటరాక్షన్ విధానంలో బోధన లేకపోతే ఉపయోగం పెద్దగా ఉండదు. – ఆనందకిషోర్, ఎస్సీఈఆర్టీ రిటైర్డ్ డైరెక్టర్ ఒకటీ రెండు నెలల తరువాత షిఫ్ట్ పద్దతి మేలు ఒకటో తరగతి నుంచి 5 తరగతులకు ఇప్పుడే బోధన అవసరం లేదు. 6 నుంచి 10 తరగతుల ప్రభుత్వ విద్యార్థులకు టీవీల ద్వారా లేదా ట్యాబ్‌లు ఇచ్చి ఆన్లైన్ ద్వారా బోధించాలి. ఒకటీ రెండు నెలల తరువాత విద్యార్థులను బ్యాచ్‌లుగా ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ పద్ధతిలో అదీ 6 నుంచి 10 తరగతులకే బోధన చేపట్టాలి. వీలైతే మండల యూనిట్‌గా మండలంలోని టీచర్లను విభజించి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోనే 6 –10 తరగతుల విద్యార్థులకు బోధన చేపట్టేలా చేయాలి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి విద్యా సంవత్సరం అలస్యమైంది. విద్యా వి«ధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యక్ష బోధన వద్దనుకుంటే ముందుగా వర్క్షీట్లను రూపొందించి విద్యార్థులకు అందించాలి. వాటిపై టీవీల ద్వారా వీడియో పాఠాలను అందించడం ఉత్తమం. ఉన్నత తరగతులకు వీలైతే ఆన్లైన్ పాఠాలను బోధించాలి. టీచర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలి. – సదానంద్‌గౌడ్, ఎస్టీయూ అధ్యక్షుడు సిలబస్ తగ్గింపు ప్రధానమే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులపై భారం తగ్గించేలా సిలబస్‌ను కుదించాలి. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలి. 6 నుంచి 10 తరగతులకు ఆ¯Œన్‌లైన్ బోధనను చేపట్టాలి. ట్యాబ్‌లు ఇవ్వడం ఆర్థిక భారం అనుకుంటే వీడియో పాఠాలనైనా టీశాట్, డీడీ యాదగిరి వంటి ఛానెళ్ల ద్వారా ప్రసారం చేయాలి. విద్యార్థులు పూర్తిగా ఖాళీగా ఉండకుండా చూడాలి. –శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు టీవీల ద్వారా పాఠాలను బోధించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్లు ప్రారంభించడం కష్టమే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీలైతే స్కూళ్లు ప్రారంభింవచ్చు. లేదంటే టీవీల ద్వారా వీడియో పాఠాలు అందిస్తే ఉపయోగం ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో టీవీలను ఏర్పాటు చేసి పాఠాలను ప్రారంభించాలి. పట్టణ ప్రాంతాల్లో స్కూళ్లలో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చిన బోధనను చేపట్టాలి. – చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
ఆంగ్ల మాధ్యమంపై ఊగిసలాట
భీమవరం టౌన్ : మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన ఊగిసలాటలో పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో మంత్రులు, అధి కారుల వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ఉంటుం దని పేర్కొనగా.. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉంటాయని ప్రకటించారు. ఈ పాఠశాలల్లో జూన్ 11 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏ మాధ్యమంలో విద్యాబోధన చేస్తారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత మాత్రం రాలేదు. తొలుత తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల కోసం ఇండెంట్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలొచ్చాయి. అందుకు అనుగుణంగానే జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టారు. అనంతరం కేవలం ఆంగ్లమాధ్యమ పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఇండెంట్ ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక జిల్లా అధికారులు ఇండెంట్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. మెప్మా సహకారంతో.. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన దిశగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్నద్ధం చేసేం దుకు ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల మహిళలతో మున్సిపాలిటీల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలు చేస్తున్నామని, పిల్ల లందరినీ ఆ పాఠశాలల్లో చేర్పించాలంటూ ఇంటింటా ప్రచారం చేయించారు. ఆంగ్ల మాధ్యమంపై మక్కువతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారన్నది ప్రభుత్వ భావన. ఈ నేపథ్యంలోనే ఆంగ్లంలో బోధనతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 6 నుంచి 10వ తరగతి వరకు కెరీర్ ఫౌండేషన్ కోర్సుల ద్వారా విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే, ఆంగ్లమాధ్యమ బోధనకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేవు. మరోవైపు ఆంగ్లమాధ్యమ బోధనకు ఉపాధ్యాయులు సైతం సన్నద్ధంగా లేదు. ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. ఆంగ్లంలో బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. పట్టణాల వారీగా పాఠశాలల సంఖ్య ఇలా.. పట్టణం ప్రాథవిుక ప్రాథవిు ఉన్నత కోన్నత పాఠశాలలు భీమవరం 35 01 06 ఏలూరు 38 04 07 నరసాపురం 20 05 06 నిడదవోలు 11 01 03 పాలకొల్లు 22 00 06 తాడేపల్లిగూడెం 19 01 06 తణుకు 14 02 01 మొత్తం 159 14 35 మాతృభాషలో బోధనే మంచిది ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషలో బోధన అవసరం. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుంది. తొలుత మాతృభాష, తరువాత హిందీ, ఆ తరువాత అంతర్జాతీయ భాషలో బోధన అవసరమని కొఠారి కమిషన్ సూచించింది. – ఎంఐ విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రెండు మాధ్యమాలూ ఉండాలి మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం బోధన ఒక్కటే పెడతామనడం సరికాదు. తెలుగులోనూ బోధన ఉండి తీరాలి. రెండూ ఉంటేనే విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమంలో చేరతారు. – టి.సత్యనారాయణమూర్తి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ కార్యదర్శి పిల్లలు బడికి దూరమవుతారు బలవంతంగా ఆంగ్లమాధ్యమాన్ని రుద్దితే అర్థంకాక పిల్లలు స్కూలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంది. మాతృభాషతోపాటు ఆంగ్ల మాధ్యమ బోధన కూడా అవసరమే. పూర్తిగా ఆంగ్లమాధ్యమ బోధన సరికాదు. – షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతృభాష బోధన అవసరం విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషలోనే బోధన ఉండాలి. 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తే బాగుంటుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉండి తీరాలి. – కోడి వెంకట్రావు, ప్రధానోపా«ధ్యాయుడు, భీమవరం -
ప్చ్.. తప్పుచేశాం..!
‘రాజధాని’ రైతుల్లో అంతర్మథనం సగానికి పడిపోయిన భూ సమీకరణ లక్ష్యం పరిహారం తీసుకోని రైతుల భూమి విస్తీర్ణం 4,430 ఎకరాలు కోర్టు వివాదాల్లో ఐదు వేల ఎకరాలు సీఎం ఆర్భాటపు ప్రకటనలకు భిన్నంగా పరిస్థితులు వైఖరి మారకుంటే సహాయనిరాకరణ చేస్తామంటున్న రైతులు రాజధాని రైతులు అంతర్మథనంలో పడుతున్నారు.. భూములిచ్చి తప్పుచేశామన్న భావనకు వస్తున్నారు.. సీఎం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం.. తమ ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణం. భూములిస్తూ అంగీకార పత్రాలు ఇచ్చిన కొందరు రైతులు నష్టపరిహారం తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.. మరికొందరు భూ సమీకరణ, రోడ్ గ్రిడ్, మాస్టర్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. గుంటూరు : రాజధానికి భూములిచ్చిన రైతుల సంఖ్య, భూమి విస్తీర్ణం సీఎం ప్రకటనలకు భిన్నంగా ఉంది. ‘నాపై నమ్మకం ఉంచి రాజధాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు.. ఒక పిలుపునకు స్పందించి రైతులు కోట్లాది రూపాయల విలువ చేసే భూములు తృణప్రాయంగా ఇవ్వడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు..’ అని ప్రతి కార్యక్రమం, సభల్లోనూ సీఎం గొప్పలు చెప్పుకొంటున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా లేవు. మొత్తం 47 వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకూ 21 వేల ఎకరాలకు మాత్రమే రైతులు పూర్తిగా అగ్రిమెంట్లు ఇచ్చి నష్టపరిహారం పొందారు. లాబీయింగ్లతోనే... రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 36 వేల ఎకరాల పట్టా భూములు, 11వేల ఎకరాలు అసైన్డ్, లంక, చెరువు, పోరంబోకు, ప్రభుత్వ భూములను సమీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆశలు కల్పించటం, తమ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక సామాజికవర్గం పట్టుదలతో తుళ్లూరు మండలంలోని రైతులు మొదట్లో భూసమీకరణను ప్రోత్సహించారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో భూ సమీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. రంగంలోకి దిగిన మంత్రులు, అధికార పార్టీ నేతలు సామాజిక వర్గాలు, పార్టీ నేతలకు పదవుల ఎర, లాబీయింగ్‌లతో కొన్ని గ్రామాల్లో సమీకరణ చేయగలిగారు. భయపెట్టినా భంగపాటు.. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలు, వైఎస్సార్ సీపీకి బలంగా ఉన్న గ్రామాల్లో సమీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆళ్ల రామక ృష్ణారెడ్డి పోరాటం ప్రారంభించారు. దీంతో ఆందోళన చెందిన ప్రభుత్వ పెద్దలు ఆయా గ్రామాలపై ప్రత్యేక ద ృష్టి సారించి రాత్రి వేళల్లో వ్యవసాయ పరికరాలు తగులబెట్టించడంతో పాటు కొందరిపై కేసులు బనాయించారు. చివరకు భూసేకరణ తంత్రాన్ని ప్రయోగిస్తామని ప్రకటనలు చేయడంతో కొందరు రైతులు భయపడి అంగీకార పత్రాలిచ్చారు. భూ సమీకరణను విజయవంతంగా పూర్తి చేశామని ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు చెబుతున్నా ఇంకా 29 గ్రామాల్లో ఇప్పటికీ 11,569 ఎకరాలు సమీకరించాల్సి ఉంది. మరో 5200 ఎకరాలపై రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇక అసైన్డ, లంక భూములు 4300 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. అవును.. తప్పు చేశాం రైతుల అభిప్రాయాలకు భిన్నంగా సీఎం ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజధాని గ్రామాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. టీడీపీకి మద్దతుగా నిలిచిన తుళ్లూరు మండల రైతులు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. తప్పు చేశామనే భావనకు వస్తున్నారు. సీఎం వైఖరిలో మార్పు రాకపోతే రాజధాని నిర్మాణానికి సహకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మాయ.. సింగపూర్ సంస్థలు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లోని మాయను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న రైతులు, బిల్డర్లు , గ్రీన్ బెల్ట్ పరిధిలోని రైతులు ఆ ప్లాన్‌ను మార్చాల్సిందేనంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్న బిల్డర్లు రాజధాని పరిధిలోని పక్కా భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలకు మాస్టర్ ప్లాన్‌లోని నిబంధనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. స్థలం విస్తీర్ణాన్ని బట్టి సెట్‌బ్యాక్‌లకు ఎక్కువ స్థలాన్ని కేటాయించాలని ఆ నిబంధనలు వివరిస్తున్నాయి. ఇలా నిర్మిస్తే అపార్టుమెంట్ల ధరలు సామాన్యులకు అందని రీతిలో ఉంటాయని బిల్డర్లు చెబుతున్నారు. రోడ్‌గ్రిడ్ ఏర్పాటుతో గ్రామాలు పూర్తిగా కనుమరగయ్యే ప్రమాదం ఉండటంతో వాటి నిర్మాణం అవసరం లేదని రైతులు చెబుతున్నారు. -
ఒక్క చోటైనా ఓకేనా?
- ఎమ్మెల్సీ ఎన్నికలపై టీటీడీపీలో మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక కోటా ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసినట్టే కన్పిస్తోంది. మండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఒక స్థానానికి పోటీపడి చేతు లు కాల్చుకున్న టీటీడీపీ ‘ఓటుకు కోట్లు’ కేసు లో పీకల్లోతు కూరుకుపోయింది. పాత అనుభవాల దృష్ట్యా ఏ నాయకుడూ స్థానిక కోటా ఎన్నికలను భుజాన వేసుకోవడం లేదు. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే టీటీడీపీ స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నా, ఎక్కడా ఒంటరిగా బరిలోకి దిగి, కనీస ప్రాబల్యం చూపించే పరిస్థితిలో లేదు. మొత్తం 12 స్థానాల్లో కనీసం ఒక్కచోట పోటీచేసినా గగనమేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. ఎసరు పెట్టిన వలసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీడీపీ మెరుగైన స్థానాలు దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పార్టీ శిబిరం సగానికిపైగా ఖాళీ అయింది. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని వెన క్కి తీసుకురావడం మాట అటుంచి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి ఓట్లు కొనుగోలు చేయడం సవా లే అంటున్నారు. టీడీపీ నుంచి గెలిచి, పార్టీని వీడింది, ఉన్నదెంతమందనే దానిపై స్పష్టత ఉన్న నాయకత్వం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనకా ముందాడుతోంది. పార్టీకి 4 జిల్లాల్లో చెప్పుకోదగిన ఓట్లున్నాయని, బీజేపీ మద్దతు అదనపు బలమవుతుందని, కనీసం మూడు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించినట్టు సమాచారం. దీన్లో భాగంగానే మహబూబ్‌నగర్‌లో ఒక స్థానానికి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డిని ఖరారు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏదో ఒకచోట నుంచి ఒక స్థానంలో పోటీచేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనపై పార్టీ నాయకులు ఇంకా ఎటూ తేల్చుకోలేదు. ఒకచోట మద్దతు ఇచ్చి, మరోచోట మద్దతు తీసుకుని అవగాహనతో ఓట్లను పంపిణీ చేసుకుని బయట పడాలన్న వ్యూహంలో టీటీడీపీ ఉన్నట్లు సమాచారం. -
ఏదీ అనుసం‘దానం?’
హైదరాబాద్ నగర కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం పార్టీని నడిపించే నాయకుల కోసం ఎదురుచూపు హైదరాబాద్: ఓ వైపు ముంచుకొస్తున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు.. మరో వైపు అంటీ ముట్టనట్లుగా పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ వ్యవహారంతో నగర కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంతో నగరమంతటా విజయం సాధించిన పార్టీ 2014 ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మెజారిటీ చోట్ల మూడోస్థానానికి పడిపోయింది. పోయిన పరువుతో పాటు మళ్లీ విజయతీరం చేర్చే నాయకుల కోసం పార్టీ వెతుకుతోంది. అధికారంలో ఉన్న సమయంలో అన్నీ తామై వ్యవహరించిన మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్‌గౌడ్‌లు ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరమై సొంత పనుల్లో బిజీ అయ్యారు. దానం అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటూ... అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న తీరు పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. దీంతో త్వరలోనే పీసీసీ, సీఎల్పీ నాయకులను కలిసి గ్రేటర్‌కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేసే అవకాశం ఉంది. దానం..అయోమయం టీఆర్ఎస్ నుంచి రాని క్లియరెన్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్ ఒకింత అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా క్రియాశీలకంగా వ్యవహరించలేక... మరో వైపు టీఆర్ఎస్లోకి వెళ్లే ముహూర్తం ఖరారు కాక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నగర మంత్రులు తలసాని, పద్మారావులతో పాటు టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న హరీష్‌రావు, కేటీఆర్‌లతో దానం పలుమార్లు భేటీ అయినట్లు తెలిసింది. పార్టీలోకి తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీరించినప్పటికీ... ఏ హోదా కల్పించాలన్న అంశం అధినేత కేసీఆర్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పడంతో ఆయన అటూ ఇటూ కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. నగర మేయర్ లేదా ఎంఎల్సీ పోస్టుల్లో ఏదైనా ఒకటి తనకు కేటాయిస్తే గౌరవప్రదంగా ఉంటుందన్న ప్రతిపాదనను టీఆర్ఎస్ ముఖ్య నేతల ముందుంచినట్లు సమాచారం. బీజేపీ వైపు.. ముఖేష్ చూపు నగర కాంగ్రెస్‌లో మరో ముఖ్య నాయకుడు మూల ముఖేష్ గౌడ్ బీజేపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటి వరకూ ప్రకటించనప్పటికీ... సనత్‌నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో విజ్ఞప్తి చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరే అంశాన్ని కూడా ముఖేష్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తన సోదరుడు, మాజీ కార్పొరేటర్ మధుగౌడ్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన చేరికను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించినప్పటికీ పార్టీ ఖాతరు చేయలేదు. అదే దారిలో ముఖేష్‌గౌడ్ బీజేపీలో చేరేందుకు సంకేతాలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
'24 గంటల్లో ఆ ఎంపీలు రాజీనామా చేయాలి'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రైల్వేకి ప్రత్యేక జోన్ ఇప్పట్లో వచ్చేట్లు కనిపించడం లేదు. బీజేపీ నేతలు విశాఖ వాసుల ఆశలపై నీళ్లు చల్లారు. మే 27 న విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి ప్రకటన విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు. 24 గంటల్లో విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ ఇద్దరు ఎంపీల ఇళ్లు, కార్యాలయాలు ముట్టడిస్తామని ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఫోరం సభ్యుడు చలసాని గాంధీ ప్రశ్నించారు. -
విశాఖ వాసుల ఆశలపై నీళ్లు!
-
'డయల్ 100పై డైలమా'
డయల్ 100 కొనసాగించాలా? లేదా అన్న డైలమాలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడు చెప్పారు. డయల్ 100 కు 95 శాతం వరకు తప్పుడు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. అభయం, ఐక్లిక్లు రెండూ పైలట్ ప్రాజెక్టులే అని డీజీపీ జేవీ రాముడు అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు రియల్ కాల్స్ వస్తేనే ఈ సేవలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. లేని పక్షంలో వాటి గురించి కూడా పునరాలోచించాల్సి వస్తుందన్నారు. -
ఇరకాటంలో బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ (డొమెస్టిక్) టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు అంశంలో బీజేపీ తెలంగాణ నేతలు ఇరకాటంలో పడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం ముందు నుంచీ ఉద్యమించామని తరచూ ప్రకటించుకునే ఆ పార్టీ తెలంగాణ నేతలకు దీనిపై ఎలా స్పందించాలనే దానిపై అయోమయ పరిస్థితి ఎదురైంది. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఢిల్లీ నేతలతో దీనిపై చర్చించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచన సరికాదని ఢిల్లీ పెద్దల దృష్టికి తెచ్చారు. ఆ తర్వాతే కిషన్‌రెడ్డి, బీ జేఎల్పీ నేత లక్ష్మణ్ సభలో మాట్లాడారు. -
వరుస ప్లాపులతో యంగ్ హీరో
-
ముహూర్తం ఆలస్యం?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చుక్కెదురైంది. దసరా రోజున గులాబీ గూటికి చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న తీగల.. లాంఛనప్రాయంగా పార్టీ ముఖ్యుల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పార్టీ మారాలనే నిర్ణయం సరికాదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్లో చేరాలనే అంశంపై ముఖ్య నేతల నుంచి ప్రతిఘటన ఎదురుకావడం... మీరెళ్లినా పార్టీకెలాంటి నష్టంలేదని మెజార్టీవర్గం తెగేసి చెప్పడంతో డైల మాలో పడ్డ కృష్ణారెడ్డి... కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా అభిప్రాయసేకరణ జరిపిన తీగల... టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయంలో తనను వెన్నంటి నిలబడాలని అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అవసరమని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా సమృద్ధిగా నిధులు రాబట్టలేమని, అధికారపార్టీలో చేరితే ఈ సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. అయితే, ఎమ్మెల్యే అభిప్రాయంతో ఏకీభవించని తమ్ముళ్లు... గతంలో దేవేందర్‌గౌడ్ పార్టీని వీడినా ఆయన వెంట తాము వెళ్లలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘మీకిష్టమైతే పార్టీ మారండి... మేం మాత్రం ఇదే పార్టీలో కొనసాగుతాం’ అని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న తీగల కృష్ణారెడ్డి ఈ అంశంపై మరోసారి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ప్రస్తుతానికి టీడీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. మారడం ఖాయం..! సన్నిహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తీగల కృష్ణారెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగే అవకాశాలు స్వల్పంగానే ఉన్నట్లు మంగళవారం జరిగిన పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. పార్టీ మారుతారనే ఊహాగానాలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీగలకు కబురుపంపారు. ఈ మేరకు చంద్రబాబును కలిసిన కృష్ణారెడ్డి పార్టీ మారే అంశంపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. అక్కడి నుంచి నేరుగా మీర్‌పేటలోని తన కళాశాలలో పార్టీ సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందే టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయంపై కొందరు నేతలను ఒప్పించారు. తన అనుకూలవర్గీయులతో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆయన... టీఆర్ఎస్లో చేరితే కలిగే లాభనష్టాలను వివరించారు. ఈ మేరకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు చేసుకున్నారు. అయినప్పటికీ, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండా పార్టీ మారారనే ఆరోపణలు రాకుండా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో ఊహించనిస్థాయిలో ప్రతికూలత రావడంతో సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ వీడబోనని ‘జై తెలుగుదేశం’ నినాదం చేస్తూ సమావేశాన్ని ముగించిన ఆయన... రాత్రి పొద్దుపోయేవరకు కూడా ముఖ్య నేతలను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అయి, టీఆర్ఎస్లో చేరే అంశంపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ తాజా పరిణామాలను గమనిస్తే... కారెక్కడం ఖాయంగానే కనిపిస్తున్నా... ముహూర్తం మాత్ర ం ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. హెచ్ఎండీఏ చైర్మన్ పదవి కట్టబెడుతామనే ఆఫర్‌తోనే తీగలకు వల వేశారని ప్రచారం జరుగుతుండగా, కేవలం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన కార్యకర్తలకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. -
గాసిప్స్ తో డైలామాలో పడ్డ డైరెక్టర్
-
ఉద్యోగుల పంపిణీపై 23న వీడనున్న సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఏర్పడిన సందిగ్ధం ఈ నెల 23న తొలగనుంది. ఆ రోజు ఢిల్లీల్లో కమలనాథన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కేంద్ర సిబ్బంది-శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనావర్మతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు పీవీ రమేశ్, నాగిరెడ్డి పాల్గొంటారు. రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారికి ఆప్షన్లు ఇవ్వటంపై అభిప్రాయాన్ని తరువాత చెబుతామని ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముసాయిదా మార్గదర్శకాల్లోనే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. -
ఏపీ అసెంబ్లీ రద్దుపై కేంద్రం డైలమా
-
ఏపీ అసెంబ్లీ రద్దుపై కేంద్రం డైలమా
కేబినెట్లో తేలని నిర్ణయం హోంశాఖ తర్జన భర్జన సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దుపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గురువారం ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్, న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, రక్షణమంత్రి ఏకే ఆంటోనీ, మరో ఇద్దరు మంత్రులతోపాటు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయాలపై చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. కేంద్రం ఆర్టికల్ 356(1) ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిపాలన అమలైన తేదీ నుంచి రెండు నెలలలోపు పార్లమెంటు దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అంటే మార్చి 1న విధించిన రాష్ట్రపతి పాలనకు ఏప్రిల్ 30లోగా ఆమోదం పొందాలి. కానీ ప్రస్తుతం పార్లమెంటును సమావేశపరచడం సాధ్యం కాదు. ఎంపీలంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఏప్రిల్ 30 లోగా ఆమోదం పొందకుంటే, ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీ మళ్లీ క్రియాశీలమవుతుంది. అయితే, ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని గవర్నర్ ఇటీవలే రెండో నివేదిక ఇవ్వడంతో, కేంద్ర హోంశాఖ తర్జనభర్జన పడుతోంది. ఇందుకు రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఒకటి.. రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయడం, లేదా రెండోసారి రాష్ట్రపతి పాలన విధిస్తూ.. అసెంబ్లీని తిరిగి సుప్తచేతనావస్థలో ఉంచడం. అయితే, అసెంబ్లీని రద్దు చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. గతంలో సర్కారియా కమిషన్ ఇదే విషయాన్ని తెలిపింది. రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం పొందనంతవరకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలే తప్ప.. రద్దు చేయడం తగదని కమిషన్ సిఫారసు చేసింది. కాగా, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నందున అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండవని యోచిస్తోంది. సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ కూడా హోంశాఖకు ఇదే సలహా ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో హోంశాఖ కార్యదర్శి గోస్వామిని ప్రశ్నించగా, ‘ఇంకా సమయం ఉంది. తొందరెందుకు’ అని బదులిచ్చారు. ఏప్రిల్ 30లోపు పార్లమెంటు ఆమోదం పొందకపోతే, తిరిగి రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
కాంగ్రెస్‌లో కొనసాగాలా.. వద్దా?: కావూరి
ఏలూరు: కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్నానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కేడర్, ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేస్తానని కావూరి స్పష్టం చేశారు. 1984 కంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అద్వాన్నంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కావూరి సమర్థించారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పార్టమెంట్‌లో టీబిల్లు అమోదించిన విధానం అవమానకరమని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బలిపెట్టి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడానికి విభజన చేయడం దురదృష్టకరమని అన్నారు. నేటి కేబినెట్ భేటీలో పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకువస్తామని, భద్రాచలం గుడి గ్రామం తప్పితే డివిజన్లోని అన్ని గ్రామాలు ఆంధ్రాలో కలిసే విధంగా కృషిచేస్తానని కావూరి చెప్పారు. -
ప్రభుత్వ ఏర్పాటా? రాష్ట్రపతి పాలనా?
-
కాంగ్రెస్ డైలమా
ప్రభుత్వ ఏర్పాటా? రాష్ట్రపతి పాలనా? రెండు రాష్ట్రాలకూ పీసీసీలు ఖరారు... నేడో రేపో ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ.. రాజకీయ ప్రయోజనాల బేరీజుపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించిన అనంతర పరిణామాల్లో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ పెద్దలు పార్టీకి చెందిన తెలంగాణ, సీమాంధ్ర నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. బుధవారంతో అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన హైకమాండ్ నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? లేక రాష్ట్రపతి పాలనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలా? అన్న అంశంపై తర్జనభర్జన పడ్డారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నేతల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోవడానికి కారణంగా చెప్తున్నారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో సీమాంధ్రకు చెందిన నేతలు చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణల్లో ఒకరిని సీఎం చేయాలన్న ప్రతిపాదనను హైకమాండ్ పరిశీలించినప్పుడు స్థానిక నేతలు కొందరు వ్యతిరేకించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో సీమాంధ్ర నేతల మధ్య సమన్వయం లేకపోవటం కూడా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటానికి ఒక కారణంగా చెప్తున్నారు. తాజా పరిణామాలపై గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదించే అవకాశాలున్నాయి. దానిపై సోనియా గురువారం తుది నిర్ణయం తీసుకుంటారా? లేక శుక్రవారం నాటి కేంద్ర మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయానికి వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. లాభనష్టాల బేరీజులో సతమతం ఇప్పుడు రాష్ట్రంలో ఏం చేస్తే తమకు లాభమన్న కోణంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోంది. విభజన తేదీని ఎప్పుడు నిర్ణయించాలి? ఎన్నికల షెడ్యూలు రాకముందే ఆ తేదీ ఉండాలా? లేక ఎన్నికలు ముగిశాక ఉండాలా? ముందే ఆ తేదీ ప్రకటిస్తే లాభమేనా? ఇలా చేస్తూ రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం వల్ల లాభముందా? విభజన తేదీని వాయిదా వేస్తే ఎలా ఉంటుంది? అలా చేస్తే విభజన ప్రభావం సీమాంధ్ర ప్రజలపై పడుతుందా? అందువల్ల విభజన తేదీ (అపాయింటెడ్ డే) ఎప్పుడుండాలి? అనే అంశాలను తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. అనైక్యతతో కొత్త చిక్కుల భయం ముఖ్యమంత్రిగా ఒకరి పేరు బయటకు రాగానే మరొకరు ఆ వ్యక్తి వైఫల్యాల చిట్టా విప్పుతుండటంతో ప్రభుత్వ ఏర్పాటు కష్టమేనన్న భావనకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది. రాజకీయ సమీకరణల నేపథ్యంలో సీఎం అభ్యర్థులుగా పరిశీలనలో ఉన్న పేర్లు బయటకు పొక్కగానే నేతల అనైక్యత బయటపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా కొత్త చిక్కులు ఎందుకని భావిస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూలుకు ముందే ప్రకటిస్తే.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే దానిలో అపాయింటెడ్ డేను ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూలు మార్చి తొలి వారాంతంలో రావాల్సి ఉంది. మరి ఈలోగానే అపాయింటెడ్ డేను ప్రకటించి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తే.. న్యాయపరమైన చిక్కులు ఉండవని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినట్టు చెప్పుకొని లబ్ధిపొందవచ్చని, సీమాంధ్ర ప్రాంతంలో తాము ఆ ప్రాంతానికి బిల్లులోనూ, ప్రధానమంత్రి ప్రసంగంలోనూ చేసిన మేలును చెప్పుకోవచ్చని యోచిస్తోంది. అయితే.. విభజనకు సంబంధించి లాంఛనాలు పూర్తిచేసేందుకు ఇంతతక్కువ వ్యవధి సరిపోదన్నది ఇందులో ప్రతికూలాంశం. హోంశాఖకు చేరిన టీ-బిల్లు... పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 బుధవారం తిరిగి హోంశాఖకు చేరింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించాల్సి ఉంది. బుధవారం రాత్రి కానీ, గురువారం కానీ రాష్ట్రపతికి చేరే అవకాశం ఉంది. కాగా పార్లమెంటు 15వ సెషన్ ముగిసినట్టుగా భావిస్తూ ప్రొరోగ్ చేయాలని కోరుతూ హోంశాఖ రాష్ట్రపతికి నివేదన పంపింది. సాధారణంగా పార్లమెంటు సెషన్ ఇలా అధికారికంగా ముగిస్తే ఇక కేంద్రం ఆర్డినెన్సులు తేవడానికి వీలుంటుంది. అలాగే రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా అవకాశం ఉంటుంది. బిల్లు నాటి ఆడియో ఫైళ్లు వెబ్సైట్లో.. ఈ నెల 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి లోక్‌సభ ప్రసారాలు నిలిచిపోయిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆడియో రికార్డులు మొత్తం 9 ఫైళ్ల రూపంలో లోక్‌సభ వెబ్సైట్లో పొందుపరిచారు. విభజన తేదీని వాయిదావేస్తే... అపాయింటెడ్ డే(విభజన తేదీ)ని జూన్ 1 గానో లేక మరో తేదీనో ప్రకటించి.. ఇప్పుడు ఒకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న అంశాలపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం బేరీజు వేస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే అపాయింటెడ్ డే ఆలస్యమవుతుండటంతో పాటు.. ఈలోగా కోర్టులో న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా? అన్న అంశాలనూ చర్చిస్తోంది. మరోవైపు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. సీనియర్ నేతల్లో అసంతృప్తి ఏర్పడితే వారిలో నుంచి కొంతమంది బయటకు వెళితే ఎన్నికల సమయంలో అదొక ప్రతికూల అంశంగా మారుతుందని భావిస్తోంది. దీనికంటే రాష్ట్రపతి పాలనే మేలన్న అభిప్రాయమూ నేతల్లో ఉంది. రాష్ట్రపతి పాలన అయితే: మెజారిటీ ఉన్నప్పటికీ చిక్కులకు భయపడి కారణం లేకుండా రాష్ట్రపతి పాలన విధించారన్న అపఖ్యాతి ఎదురవుతుంది. అయితే రెండు పీసీసీల ఏర్పాటు ద్వారా అక్కడికక్కడే.. ఇక్కడికిక్కడే ప్రచార బాధ్యతలు అప్పగిస్తే ఎవరి పనివారు చేసుకుపోతారని, ఇక ప్రభుత్వాలు ఎందుకని అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు పీసీసీలు, రెండు ఎన్నికల ప్రచార కమిటీలు, రెండు మేనిఫెస్టో కమిటీలు ఖరారు చేసింది. వీటిని నేడో రేపో ప్రకటించే అవకాశం కూడా ఉంది. పైగా రాష్ట్రపతి పాలన అయితే.. రెండు నెలలు ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎన్నికల అంశం కాకుండాపోవచ్చు.. ఇలాంటి అంశాలన్నింటినీ బేరీజు వేస్తోంది. అయితే నిర్ణయం మాత్రం గురువారం కోర్ కమిటీ భేటీలో గానీ, శుక్రవారం నాటి కేబినెట్ భేటీలోగానీ తీసుకోవచ్చు. -
కేసీఆర్ సదసత్సంశయం
టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలిపేస్తే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. అంతేకాదు టీఆర్ఎస్ కథ సమాప్తమవుతుంది. కాంగ్రెస్ గడప తొక్కిన తర్వాత వందలాదిమంది నాయకుల్లో తాను ఒకడిగా ఉంటానన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. ఆయనకు ఏ ప్రత్యేకతా ఉండదు. మునిగిపోతున్న కాంగ్రెస్ పడవలో కాలుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. తెలంగాణ కల సాకారమై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విజయోత్సవంతో హైదరాబాద్ చేరుకున్న తర్వాత అందరి మెదళ్లలోనూ ఒకటే ప్రశ్న తొలుస్తోంది. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం సజావుగా జరుగుతుందా? లేదా అవి రెండూ శత్రుపక్షాలుగా మారిపోతాయా అన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కావాలి. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. కేసీఆర్‌నూ, ఆయన అనుచరులనూ సంతోషపెట్టేందుకు తగిన సంఖ్యలో టికెట్లు ఇస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ సిట్టింగ్ అభ్యర్థులందరికీ టికెట్లు ఇస్తుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన శక్తిగా అవతరిస్తుందన్న మాట. ఈ ఫార్ములా ప్రకారం 50 దాకా ఎమ్మెల్యే, కొన్ని ఎంపీ ఓపెన్ సీట్లు ఉంటాయి. ఇవన్నీ టీడీపీ, ఇతర పార్టీలు గెలుచుకున్నవి. అలాంటి సీట్లలో కొన్నింటిని కేసీఆర్ కోరుకుంటే కాంగ్రెస్ కేటాయిస్తుంది కూడా. అయితే ఇవన్నీ ఓడిపోయే సీట్లే. కాంగ్రెస్ వ్యూహమిదే. ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయాల నుంచి నిష్ర్కమించవచ్చు. తొలిసారి ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం ఆయనకు బాగా తెలుసు. నూతన రాష్ట్రంలో కొత్త శక్తులు.... కుల ప్రాతిపదికగా ఆవిర్భవించవచ్చు. వాటిని నియంత్రించే శక్తి ఆయనకు ఉండదు. అవినీతికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమం నడిపినట్టుగా తెలంగాణ కోసం పోరాడడం సులభమే. కాని ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు డిమాండ్లు చేయడం, ప్రశ్నించడం ప్రారంభిస్తారు. వాగ్దానాలను నిలబెట్టుకోలేనివారిని ప్రజలు శిక్షిస్తారు. ఈ ఏడాదిలో ఏదో ఒక రాష్ట్రంలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అనిపించుకోవడం కోసం కాంగ్రెస్ తంటాలు పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారును ఏర్పాటు చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంలో అర్థం లేదు. కేసీఆర్ వెనకడుగు తెలంగాణ ఏర్పడిన తక్షణం కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు తటపటాయించడానికి కారణాలు లేకపోలేదు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలిపేస్తే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. అంతేకాదు టీఆర్ఎస్ కథ సమాప్తమవుతుంది. ఆయనకు ఏ ప్రత్యేకతా ఉండదు. మునిగిపోతున్న పడవలో కాలుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. మరోవైపు ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ కూడా గాలివాటాన్ని గ్రహించి కాంగ్రెస్‌కు దూరంగా జరిగిపోయినప్పుడు... కేసీఆర్ కాంగ్రెస్ పడవలో ఎందుకు ఎక్కుతారు? అది రాజకీయ ఆత్మహత్యాసదృశం అవుతుంది. టీఆర్ఎస్ విలీనం జరిగితే బీజేపీకి సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. సూత్రరీత్యా తెలంగాణకు బీజేపీ అనుకూలమైనప్పటికీ తాము కాంగ్రెస్‌లో విలీనం కాబోమని టీఆర్ఎస్ ఆ పార్టీకి లోపాయికారీగా చెపుతూ వచ్చింది. విభజన బిల్లును ఆపాల్సిందిగా సీమాంధ్ర నాయకుల నుంచి బీజేపీ నాయకత్వంపై తీవ్రఒత్తిడి వచ్చిన దరిమిలా కమలనాథులు కూడా ఒకదశలో డైలమాలో పడ్డారు. ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపేందుకు టీఆర్ఎస్ హామీ ఇచ్చి ఉండవచ్చు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నందున కాంగ్రెస్‌లో విలీనమై బీజేపీతో శత్రుత్వం కొనితెచ్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఓడిపోయే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తే జరిగే మేలు ఏమిటి? ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ పంచన చేరడానికి సైతం వెనకాడరు. హస్తం పార్టీలో విలీనమైతే పూర్తిగా ఓటమి తప్పదని భావిస్తున్న టీఆర్ఎస్ అందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదు. కాంగ్రెస్ గడప తొక్కిన తర్వాత వందలాదిమంది నాయకుల్లో తాను ఒకడిగా ఉంటానన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. ఉద్యమాన్ని తెలివిగా నియంత్రించవచ్చుకానీ, సర్కారును నడపడం, ఎమ్మెల్యేలను అదుపులో పెట్టడం అంత సులభమేమీ కాదు. తెలివైన ముఖ్యమంత్రే రాష్ట్రాన్ని చక్కదిద్దగలడు. ఒకవేళ విలీనం జరిగితే తన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కావాలనుకున్న సీట్లను ఆయన సాధించుకోలేరు. సహజంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే అన్ని స్థానాల్లోనూ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో ఈ రెండు పార్టీలు గెలిచే అవకాశం లేదు. కాని విలీనం జరగకపోతే టీఆర్ఎస్ అన్ని సీట్లకూ పోటీ పెట్టుకోవచ్చు. తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టీఆర్ఎస్ తరఫున వేలాది మంది ఉన్నారు. టికెట్లు దొరకని వారంతా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు. నిజామాబాద్, ఇంకా కొన్ని ఎంపీ సీట్లపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అలాంటప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీల పరిస్థితి ఏమిటి? కాబట్టి కాంగ్రెస్ వల నుంచి తప్పించుకోవడం టీఆర్ఎస్కు మంచిది. కాంగ్రెస్‌లో విలీనమైతే టీఆర్ఎస్ పరిస్థితి రేపోమాపో ఉద్యోగం ఊడే పెళ్లికొడుకుతో పెళ్లికి సిద్ధమైన పెళ్లికూతురు చందంగా ఉంటుంది. నిజానికి కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తును మాత్రమే కోరుకుంటోంది. అదికూడా మహారాష్ట్రలో శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-కాంగ్రెస్ మాదిరి పొత్తులా ఉండాలని భావిస్తోంది. అలా అయితే మొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో కచ్చితంగా గెలిచే 50 శాతం సీట్లను తాను ఎంపిక చేసుకుని ఓడిపోయే సీట్లను కాంగ్రెస్‌కు ఇవ్వవచ్చు. ఎంజీఆర్ ఫార్ములా తమిళనాడులో చాలాకాలం ఎంజీఆర్ ఫార్ములా నడిచింది. తెలంగాణలోని మూడింట రెండొంతుల ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు ఇచ్చి, శాసనసభలోని మూడింట రెండొంతుల స్థానాలు తాము తీసుకునేలా ఈ ఫార్ములాను టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు ప్రతిపాదించింది. ఈ వ్యూహం వల్ల తమిళనాడులో కాంగ్రెస్ భూస్థాపితమయ్యింది. సోనియాగాంధీ ఇలాంటి ఆత్మహత్యాసదృశ నిర్ణయం తీసుకోరు. విలీనం కన్నా ఒంటరిగా పోటీ చేయడమే మేలని టీఆర్ఎస్ భావించవచ్చు. 60 సీట్లకు పోటీ చేసి 20 నుంచి 30 సీట్లలో గెలిస్తే ప్రయోజనం ఏముంటుంది? పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా అలాంటి ఫలితాలు వస్తే ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పెద్ద ప్రభావం చూపలేదు. రాష్ట్రాల ఆవిర్భావం కోసం ఉద్యమించిన పార్టీలు అవి ఏర్పడిన తర్వాత నామరూపాలు లేకుండా కనుమరుగయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు కోసం పోరాడిన సిసలైన పార్టీలను ఎవరు గుర్తుంచుకున్నారు? చరిత్ర చెప్పే పాఠాలు సరైనవే అయితే రేపు టీఆర్ఎస్ కూడా అదృశ్యం కావచ్చు. మూడు మార్గాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గెలిచే అవకాశం ఉన్న సీట్లలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే టీఆర్ఎస్కు ఉన్న మంచి మార్గం. అది కాని పక్షంలో ఒంటరిగా పోటీ చేయాలి. ఈ రెండు సాధ్యం కానప్పుడు మూడో మార్గం విలీనం. తమ పార్టీ విలీనమైతే టీడీపీ-బీజేపీ ఏకమై కాంగ్రెస్‌ను ఓడిస్తాయంటూ టీఆర్ఎస్ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. ఈ వాదన ద్వారా కాంగ్రెస్‌ను భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి ఒత్తిళ్లకు సోనియా సులభంగా తలొగ్గుతారు కాబట్టి టీఆర్ఎస్ నాయకులు ఇలా నరుక్కుని వస్తున్నారు. టీఆర్ఎస్ను తనలో కలిపేసుకునేందుకు కాంగ్రెస్ చతురతను ప్రదర్శిస్తోంది. ఒకవేళ ఆ పార్టీ మొండికేస్తే బెదరగొడుతుంది. టీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోదన్న విషయం కూడా ఆ పార్టీకి తెలుసు. తన దారికి రాకపోతే విమర్శలకు దిగుతుంది. తర్వాత ప్రజాక్షేత్రంలోకి కూడా దిగుతుంది. తెలంగాణ ఇచ్చిన తాము కావాలో, ఎలాంటి భవిష్యత్తులేని టీఆర్ఎస్ కావాలో తేల్చుకొమ్మని ప్రజలకు చెపుతుంది. తెలంగాణ ఇచ్చినందుకు తమకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతుంది. కాని కాంగ్రెస్‌లో కలిసిపోతే టీఆర్ఎస్ రాజకీయ అస్తిత్వం కోల్పోతుంది. బీజేపీ అంతా గమనిస్తోంది. టీఆర్ఎస్ తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీజేపీ కోరుతుంది. ఇదో తెలుగు సినిమా కథలా ఉంటుంది. మాటను నిలబెట్టుకునేందుకు ఓడిపోయే పార్టీలో విలీనం కావాలా? భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలపాలా? లేదా తటస్థంగా కొనసాగాలా?ఏదీ అంత సులభం కాదు. ఇది ముంగిస, పాము మధ్య కొట్లాట లాంటిది. ఈ పోరులో ఏదో ఒకటే బతుకుతుంది. విశ్లేషణ: పెంటపాటి పుల్లరావు (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
'కిరణ్ ఫోన్ చేసినందునే... భేటీకి'
హైదరాబాద్ : కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పుడే చెప్పలేమని... మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ సబ్బం హరి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పెట్టాలా, వద్దా అనే అంశంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ముందు అనంతరం సబ్బం హరి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినందునే సమాశానికి హాజరు అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావతం తగ్గినట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, మూడో ప్రాంతీయ పార్టీగా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను పూర్తిగా అంచనా వేస్తామన్నారు. ఈ భేటీకి సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, పార్థసారధి తదితరులు హాజరు అయ్యారు. మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా... పెడితే తనతో పాటు ఎంతమంది ఉంటారు... ప్రజలు ఆదరిస్తారా, లేదా అన్న మీమాంస మధ్య గత రెండు రోజులుగా ఆయన తన సన్నిహితులతో ముమ్మరంగా మంతనాలు జరుపుతున్నారు. -
కిరణ్ ’పార్టీ’ మీమాంస
అనుచరులతో కిరణ్ సమాలోచనలు ఎంతమంది వెంట వస్తారా అని చర్చ కొత్త పార్టీ పెట్టే దిశగానే అడుగులు? నేతలతో సోమవారం సమావేశం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొత్త పార్టీ పెట్టాలా, వద్దా... పెడితే తనతో పాటు ఎంతమంది ఉంటారు... ప్రజలు ఆదరిస్తారా, లేదా అన్న మీమాంస మధ్య రెండు రోజులుగా తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్లిన కిరణ్‌ను కలిసేందుకు మొదటి రెండు రోజులూ ఎవరూ వెళ్లలేదు. శ నివారం ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, పాలడుగు వెంకట్రారావు తదిరులు కలిశారు. మరికొందరు నేతలతో కిరణ్ ఫోన్లో మాట్లాడారు. ఏం చేయాలి, ఎలా ముందుకు పోదాం, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయముంది అంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలవారీగా అనుచర నేతలకు ఫోన్లు చేస్తూ అంచనా వేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కొంత కసరత్తు చేసిన కిరణ్, ఆదివారం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో భేటీ నిర్వహిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆయన మాటలు, చేతలు చూస్తుంటే కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని కలసిన నేతలు చెబుతున్నారు. తాజాగా మాదాపూర్‌లో ఒక విశాలమైన భవనాన్ని కిరణ్ అద్దెకు తీసుకున్నారు. ఇకపై అందులోనే సమావేశాలు నిర్వహించనున్నారు. దాన్ని వ్యక్తిగత కార్యాలయంగా పెట్టినా మున్ముందు పార్టీ కార్యాలయంగా మార్చడానికి వీలుగానే ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతున్నారు. రెండు రోజులుగా కిరణ్‌తో సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యవహార శైలి కూడా కొత్త పార్టీ ఏర్పాట్ల ప్రచారానికి ఊతమిస్తున్నాయి. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి కిరణ్ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. ఆయన రాజకీయాల్లో కొనసాగాలంటూ అనుచరులు విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు సీమాంధ్రలో కాలం చెల్లిందన్న అశోక్‌బాబు మాటలు కూడా కిరణ్ ‘పార్టీ’ వ్యూహంలో భాగమేనంటున్నారు. పాలడుగు, ఉండవల్లి కూడా పార్టీ ఏర్పాటుపై కిరణ్ సూచనలిచ్చారంటున్నారు. ఆదివారం ఎంపీల భేటీకి ఎందరు హాజరవుతారన్నది కూడా చర్చనీయాంశమైంది. ఎంపీ రాయపాటి సాంబశివరావు హాజరుఅనుమానంగానే ఉంది. రాయపాటి కాంగ్రెస్‌లోనే కొనసాగేలా మాట్లాడుతున్నామని, అధిష్టానంతో కూడా చర్చిస్తున్నామని ఆయన సన్నిహిత మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. మరో ఎంపీ హర్షకుమార్ హాజరుపైనా భిన్న వాదనలున్నాయి. కిరణ్‌పై సన్నిహితుల్లోనే అపనమ్మకం కిరణ్ సామర్థ్యంపై ఆయన సన్నిహిత నేతల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్నానంటూనే విభజన ప్రక్రియలోని ప్రతి దశలోనూ ఆయన వ్యవహరించిన వైనం, చివరికి విభజన జరిగిపోయిన తీరు, రాజీనామాపైనా రోజుకోమాట వంటివన్నీ కిరణ్‌పై ప్రజల్లో విశ్వాసం లేకుండా చేశాయని వారంటున్నారు. పైగా సీమాంధ్ర సమస్యలు కూడా చెప్పుకోనీయకుండా తమ గొంతు నొక్కారంటూ కేబినెట్ సహచరులు మండిపడుతున్నారు. రాజీనామా సమయంలో కిరణ్ వెంట 8 మంది మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు కన్పించినా, ఆ రోజు సాయంత్రానికే అత్యధికులు ముఖం చాటేశారు. రాజీనామా అనంతరం పితాని సత్యనారాయణ మినహా ఎవరూ ఆయన్ను కలవడానికి వెళ్లలేదు. కేబినెట్ సహచరులే కిరణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా ఖండించడం దేవుడెరుగు, కనీసం ఆయనకు మద్దతు పలికే నాథుడే లేకుండా పోయాడు. ఈ తరుణంలో కొత్త పార్టీ పెట్టినా కిరణ్ వెంట ఉండేవారి సంఖ్య అత్యల్పమేనంటున్నారు. జాప్యం చేయడమే.. కిరణ్ పార్టీ పెట్టరు: డొక్కా చివరి బంతి వరకూ ఆడతానని, బ్రహ్మాస్త్రం ఉందంటూ ఉద్యోగులను, ఎంపీలు, ఎమ్మెల్యేలను మభ్యపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు వారు ఆగ్రహంతో తిరుగుబాటు చేస్తారనే భయంతోనే ఈనెల 23న విసృ్తతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. సమావేశం పెట్టి అందరూ రాలేదని చెప్పి మరింత జాప్యం చేస్తారే తప్ప కిరణ్ పార్టీ పెట్టరని ఆయన అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయం వద్ద డొక్కా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్‌ను నమ్మి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే ఆయన పార్టీనే మింగాలని చూశారన్నారు. రాయపాటి సాంబశివరావును మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని తాను అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. కిరణ్ మాటలకు మోసపోయి రాయపాటి లోక్‌సభలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో 12 గంటలకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశానని.. అక్కడే తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అంతకు ముందు మాణిక్యవరప్రసాద్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు భేటీ అనంతరం వెనుదిరిగి వెళ్లిపోయారు. -
డోలాయమానంలో రేణుక కేడర్
సాక్షి, కొత్తగూడెం: ఇన్నాళ్లూ తమకు జిల్లాలో అండదండగా ఉన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని ఏఐసీసీ దూరం పెట్టడంతో ఆమె అనుచరులు డోలాయమానంలో పడ్డారు. ఆమె చలువతో పార్టీ పదవులు, ప్రత్యక్ష ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని భావించిన నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కొక్కరు ఆమె వర్గం ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అసలు రేణుక వ్యవహారంపై తమకేమీ తెలియదన్నట్లు వారు గప్‌చుప్‌గా ఉండడంపై కాంగ్రెస్‌లో చర్చ కొనసాగుతోంది. జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, పార్టీలో ప్రత్యర్థులపై విమర్శలు చేయించిన రేణుకాచౌదరిని ఏఐసీసీ పక్కన పెట్టడంతో ఆమె ప్రధాన అనుచరులు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమెను నమ్ముకొని ఏకంగా మంత్రులను, రాహుల్‌గాంధీ ప్లేస్ ఆఫ్ బర్త్ను కూడా ప్రశ్నించడంతో అసలు పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే కొంతమంది నేతలు ఆమె వర్గం ముద్ర నుంచి బయటపడాలని, లేకపోతే పార్టీలో తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. గతంలో ఖమ్మం నగర కమిటీ, భద్రాచలం పట్టణ కమిటీలో ఆమె తల దూర్చడం.. చివరకు ఆ కమిటీలను రద్దు చేస్తూ పీసీసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఇటు రాష్ట్రం, అటు హస్తినలో ఆమె మాట చెల్లుబాటు కావడం లేదని భావిస్తున్నారు. ఇంత జరిగినా కొంతకాలంగా ఆమె జిల్లాకు రాకపోవడంతో ఆమె వర్గంగా ఉన్న క్యాడర్లో నిస్తేజం నెలకొందని పార్టీలో చర్చించుకుంటున్నారు. సమైక్య వాదానికి మొగ్గుచూపిన రేణుకాచౌదరి వర్గంగా ముద్ర పడడంతో రానున్న రోజుల్లో తమకు ఇబ్బంది కానుందని ఆయా నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఆమె పదవి వ్యవహారంపై జిల్లాలోని ఒకరిద్దరు నాయకులు నేరుగా ఆమెతోనే చర్చించి ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. రేణుకకు మళ్లీ ఏఐసీసీలో స్థానం దక్కితే జిల్లాలో ఆమె అనుచరులుగా చక్రం తిప్పుతామన్న యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. పదవులు దక్కవని నిరాశ.. ఇంతకాలం రేణుక వర్గంగా ముద్రపడిన నేతలకు ఆమె ఎలాగో పార్టీ పరంగా, నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడంలో తనదే పైచేయిగా నిరూపించుకున్నారు. కొంతకాలం నుంచి జిల్లాలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆమె వ్యవహార ధోరణిని వ్యతిరేకించడంతో పదవుల పంపకాల్లో రేణుక ముద్రకు బ్రేక్ పడింది. ఏఐసీసీ చర్యలు, దరిమిలా అధిష్టానం ముందు ఆమె ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్ర విభజన జరిగినా, ఉమ్మడిగానే ఉన్నా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గం నేతలకు కనీసం కార్పొరేటర్ టికెట్లు వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆమెకు మద్దతిస్తూ జిల్లాలోని పార్టీ నేతల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇంకెన్ని కష్టాలు వస్తాయోనని భయపడుతున్నారు. ఆమె ఆహ్వానం మేరకు ఇటీవల పార్టీలో చేరిన ఓ నేత ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. ఆమెనే నమ్ముకుని.. ఖమ్మం టికెట్‌పై కన్నేయడంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన కంగుతిన్నట్లు తెలిసింది. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారడంతో ఖమ్మం టికెట్‌పై సదరు నేత ఆశ వదులుకున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ భవిష్యత్‌కు అనూహ్యంగా అడ్డంకులు ఎదురుకావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొంతకాలం క్రితం వరకు రేణుక అనుచరులు, మంత్రి రాంరెడ్డి అనుచరులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలతో డీసీసీ కార్యాలయం మార్మోగిపోయింది. రాహుల్‌గాంధీపై రేణుక అనుచరులు చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ కార్యాలయంలో విమర్శలకు తెరపడింది. ఈ విషయంలో ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేయడం, దీన్ని మంత్రి తనకు అనుకువగా మలుచుకోవడంతో.. ఇక డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టాలంటేనే రేణుక అనుచరులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటి వరకు డీసీసీ కార్యాలయం అంటేనే రేణుక కార్యాలయంగా ఉంది. అధిష్టానం ఆమెకు ప్రాధాన్యత తగ్గించడంతో ప్రస్తుతం కార్యాలయ నిర్వహణ నేతలు కూడా మిన్నకుండా ఉన్నారు. ఇదిలా ఉంటే రేణుక అనుచరులు కొందరు ఇప్పటికే జిల్లాలోని ఆమె ప్రత్యర్థి వర్గం నేతలు, ప్రజాప్రతినిధులతో చను వుగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలి సింది. రెండుమూడు రోజులుగా ఆయా ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమాలకు కూడా సదరు నేతలు హాజరుకావడం గమనార్హం. -
‘దేశం’ అయోమయం
సాక్షి, తిరుపతి: జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా మా రింది. పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఇన్‌చార్జ్‌లను నియమించలేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఎవరితో కలసి పనిచేయాలో తెలియక తికమకపడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా లేకపోవడంతో చిన్నచిన్న కార్యక్రమాలను కూడా మదనపల్లె నుంచి వచ్చి చేపడుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలో చదలవాడ కృష్ణమూర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ అయినా ఆయన్ను పార్టీ కార్యకర్తలు విశ్వసించడం లేదు. ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని నాయకులు అంటున్నారు. ఇటీవల సోనియాకు సమాధి కట్టిన ఘటనలో అనేకమంది పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసినా ఆయన పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పలమనేరులో అమరనాథరెడ్డి స్థానా న్ని భర్తీ చేసే బాధ్యతను చంద్రబాబు రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్‌కు ఇచ్చినట్లు తెలిసింది. ఆయన ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. చంద్రబాబునాయుడు సూచన మేరకు రెడ్డెప్పరెడ్డి సోదరుడు విజయభాస్కర్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇంతవరకు పార్టీకి ఇన్చార్జ్ లేరు. తెలుగుదేశానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి మదనపల్లె నుంచి మల్లికార్జుననాయుడు రావాల్సి వస్తోంది. ఆయన కూడా పార్టీ కార్యకర్తలను కలుసుకుని సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. తంబళ్లపల్లె గురించి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలోనూ చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్‌ను పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ఆయన ఆసక్తి కనబరచకపోవడంతో మదనపల్లె నుంచి తెలుగుదేశం నాయకులు శివకుమార్ లేదా జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు కొండా నరేంద్రను తీసుకురావాలని జిల్లా నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. -
దిక్కుతోచని స్థితిలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు
హైదరాబాద్: పైలిన్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలు మళ్లో మరో తుఫాను తాకిడికి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు భారీ నష్టాన్ని కలగజేశాయి. జిల్లాలోని కవిటిలో అత్యధికంగా 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మందస, కంచలిలో 17.1, పలాసలో 15.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నాగావళి, వంశధార నదుల్లో భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. పాత పట్నంలో మహేంద్రతనయ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఏడు మండలాల్లో అంధకారం నెలకొంది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కూడా అకాల వర్షాలతో సతమతమవుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నరసాపురం, మొగుల్తూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. కొన్ని చోట్ల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పట్టణ వీధుల్లో అనేక చోట్ల మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. సబ్‌కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ రోడ్, మెయిన్ రోడ్డు నీట మునిగాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనం వీధుల్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. -
హైదరాబాద్‌పై ఎటూ తేల్చుకోలేని హైకమాండ్