విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రైల్వేకి ప్రత్యేక జోన్ ఇప్పట్లో వచ్చేట్లు కనిపించడం లేదు. బీజేపీ నేతలు విశాఖ వాసుల ఆశలపై నీళ్లు చల్లారు. మే 27 న విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి ప్రకటన విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు.
24 గంటల్లో విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ ఇద్దరు ఎంపీల ఇళ్లు, కార్యాలయాలు ముట్టడిస్తామని ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఫోరం సభ్యుడు చలసాని గాంధీ ప్రశ్నించారు.
'24 గంటల్లో ఆ ఎంపీలు రాజీనామా చేయాలి'
Published Thu, May 28 2015 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement