శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ (డొమెస్టిక్) టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు అంశంలో బీజేపీ తెలంగాణ నేతలు ఇరకాటంలో పడ్డారు.
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ (డొమెస్టిక్) టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు అంశంలో బీజేపీ తెలంగాణ నేతలు ఇరకాటంలో పడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం ముందు నుంచీ ఉద్యమించామని తరచూ ప్రకటించుకునే ఆ పార్టీ తెలంగాణ నేతలకు దీనిపై ఎలా స్పందించాలనే దానిపై అయోమయ పరిస్థితి ఎదురైంది. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఢిల్లీ నేతలతో దీనిపై చర్చించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచన సరికాదని ఢిల్లీ పెద్దల దృష్టికి తెచ్చారు. ఆ తర్వాతే కిషన్‌రెడ్డి, బీ జేఎల్పీ నేత లక్ష్మణ్ సభలో మాట్లాడారు.