కావూరి చూపు.. టీడీపీ వైపు
ఏలూరు, న్యూస్‌లైన్:
మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయూనికి వచ్చిన ఆయన ఆది వారం వట్లూరు సమీపంలోని సీతారామ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు.
తన మనసులోని మాటను నా యకులతో బయటపెట్టించారు. ఇదే సం దర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియో జకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపిం చారు.
‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయా లి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ ేయూలని సూచించారు. చివరకు ఎక్కు వ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు పేర్కొన్నారు.
ఇంట్లో సమాలోచనలు.. సభలో హైడ్రామా
అభిప్రాయ సేకరణకు ముందే కావూరి ఏలూరులోని తన క్యాంపు కార్యాల యంలో అనుయూయులతో మంతనాలు సాగించారు. సభలో ఎవరు, ఏం మాట్లాడాలనే విషయమై దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ముందుగా నిర్ణరుుంచిన ప్రకారం వేదికపైకి సామాజిక వర్గాల వారీగా నాయకుల్ని పిలిచి మాట్లాడిం చారు.
ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు, ట్రస్టు ద్వారా లబ్ధి పొం దినవారే ఊకదంపుడు ప్రసంగాలు చేయ టం విమర్శలకు తావిచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, చావా రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, గారపాటి రామసీత, తూతా లక్ష్మణరావు, ముసునూరి నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన కోసం కావూరి పనిచేశారని, ఆయన ఏ పార్టీవైపు నడిస్తే అటువైపు సాగుతామని కొందరు, ఏ పార్టీలో చేరినా మీ వెంట సాగుతామని ఇంకొందరు పేర్కొన్నారు.
త్వరలోనే నిర్ణయం
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కావూరి కాంగ్రెస్ పెద్దల అసమర్ధత కారణంగానే రాష్ట్రం విడిపోయిం దన్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రి పద వి ఇచ్చే విషయమై రాజీవ్‌గాంధీ నిర్ణయానికి కొందరు అడ్డుపడ్డారని ఆవేదన వ్య క్తం చేశారు.
2004లో మంత్రి పదవి రాలేదని బాధపడ్డానని, 2009లో మనోవేదనకు గురయ్యానని చెప్పారు. పార్టీ సిద్ధాం తాలకు అనుగుణంగా పనిచేసినా గౌరవం దక్కలేదని వాపోయూరు. త్వరలో అందరికీ సంతృప్తినిచ్చే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సమావేశంలో మాగం టి వీరేంద్రప్రసాద్ (బబ్బు), కలిపిండి అప్పారావు, పెరికే వరప్రసాదరావు, కొత్త సాంబశివరావు, బొమ్మి ప్రభాకర్, సైదు సత్యనారాయణ, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, పులి శ్రీరాములు, కారే బాబూరావు, కత్తి రాములు పాల్గొన్నారు.
మాగంటి అనుచరుల ఆరా
ఇదిలావుండగా, టీడీపీలోకి కావూరి రాకను వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అనుచరులు ఈ సభపై కన్నేసి ఉంచారు. సమావేశంలో ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారనే విషయూలపై ఆరా తీశారు.