'చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోంది'
అనంతపురం: చంద్రబాబు సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. లంచగొండితనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందారు.
కాగా, పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని కావూరి సాంబశివరావు అంతకుముందు డిమాండ్ చేశారు.