
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారిలో గెలిచేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.
కావాలనే వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని, తనకు అనుకూలంగా ఉండే పోలీసు అధికారులకు పదోన్నతులు ఇచ్చి ఎన్నికల్లో అక్రమాలకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవిన్యూ, పోలీసు అధికారులను మార్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమాలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment