బీజేపీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఆపార్టీ నేత కావూరి సాంబశివరావు పాల్గొన్నారు.
విజయవాడ : బీజేపీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఆపార్టీ నేత కావూరి సాంబశివరావు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం మిగతా రాష్ట్రాల అనుమతి తీసుకునే ప్రయత్నం ఉన్నట్లు చెప్పారు. అలాగే ఏపీకి నిధులు సమకూర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆమె పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు.