ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు ఏడు రాష్ట్రాల్లో శనివారం రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు ఏడు రాష్ట్రాల్లో శనివారం రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 57 స్థానాలకుగాను 30 ఏకగ్రీవం కాగా, 27 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దేశం దృష్టంతా యూపీలోని 11 సీట్లపైనే ఉంది. కాంగ్రెస్ నేత సిబల్, బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ప్రీతి మహాపాత్ర మధ్యే ఆసక్తికర పోరు జరగనుంది. బీఎస్పీ వద్ద అదనంగా ఉన్న 12 మంది ఎమ్మెల్యేలమద్దతుపైనే కపిల్ సిబల్ నమ్మకం పెట్టుకున్నారు.
కర్ణాటకలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను గెలిపించుకునేందుకు (44మంది మద్దతు అవసరం) బీజేపీకి ఒక ఓటు తక్కువగా ఉంది. హరియాణాలోనూ బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన జీ మీడియా గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనంద్ మధ్య పోటీ ఉంది. అయితే ఐఎన్‌ఎల్‌డీ తన 19 మంది ఎమ్మెల్యేల మద్దతును ఆనంద్‌కు ఇవ్వనున్నట్లు తెలిపింది. రాజస్తాన్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు నలుగురు అభ్యర్థులను (నాలుగు సీట్లు) గెలిపించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.