
కావూరి సాంబశివరావు
తణుకు: తాను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నాకూడా ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో కావూరికి సమైక్య సెగ తగిలింది. సమైక్యవాదులు ఆయనను నిలదీశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ తాను కూడా సమైక్యవాదినేనని చెప్పారు. ఆఖరి వరకు సమక్యవాదిగానే పోరాడుతానన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకుంటామని చెప్పారు.