టీడీపీపై మరోసారి కావూరి ఫైర్
ఏలూరు: బీజేపీ మిత్రపక్షమైన టీడీపీపై ఆపార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగి బీజేపీ కార్యవర్గ సమావేశంలో మిత్రపక్షం టీడీపీపై కావూరి సాంబశివరావు ఆరోపణలు చేయడం రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది.
అధికార పార్టీకి ఓటు వేయకపోతే ఇతర పార్టీల నేతల్ని చంపేస్తారా అంటూ నిలదీశారు. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ కావూరి విమర్శించారు. రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగిపోయింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో టీడీపీకి సమానంగా బీజేపీ బలపడుతుందని కావూరి అన్నారు.