జగన్కు మద్దతుగా 'అనంత' దీక్షలు | Hunger Strikes In Support of YS Jagan's Deeksha | Sakshi
Sakshi News home page

జగన్కు మద్దతుగా 'అనంత' దీక్షలు

Published Wed, Aug 28 2013 10:30 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

Hunger Strikes In Support of YS Jagan's Deeksha

వైఎస్‌ జగన్‌ నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 48 గంటల దీక్ష చేపట్టారు. అనంతపురంలో చొవ్వ రాజశేఖరరెడ్డి, లింగాల రమేష్‌ల నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. కదిరిలో మాజీ మంత్రి షాకీర్‌, సుధాకర్‌రెడ్డి దీక్షలు 4వ రోజుకు చేరాయి.

తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ నేత వీఆర్‌ రామిరెడ్డి మూడు రోజులుగా ఆమరణ దీక్ష  3వ రోజుకు చేరింది. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. ధర్మవరంలో వైఎస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. రఘువీరారెడ్డి కనిపించడంలేదని ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తూ హిందూపురంలో సమైక్యవాదుల వినూత్న నిరసన చేపట్టారు.

కదిరిలో నాలుగు రోజూ కొనసాగుతున్న వైఎస్‌ఆర్ సీపీ నేతల ఆమరణ దీక్షకు వైఎస్ వివేకానందరెడ్డి సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో ముగ్గురు కార్యకర్తలు చేస్తున్న నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement