వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన కార్యక్రమం జరుగుతోంది.
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. జననేత నిరవధిక దీక్షకు సంఘీభావంగా మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో మద్దెలపాలెం వద్ద దీక్షలు జరుగుతున్నాయి.
జగన్ దీక్షకు మద్దతుగా అనకాపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు సంఘీభావంగా మునగపాకలో యలమంచిలి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 6వ రోజుకు చేరాయి.
చోడవరంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత టీవీఎస్‌ఎన్ రాజు ఆమరణ దీక్ష నాలుగోరోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జగన్ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని పెందుర్తి వెంకటాద్రి కొండపై స్వామివారికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, యువజన విభాగ అధ్యక్షుడు అన్నమరెడ్డి ఆదీప్ రాజు ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు.
మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు, రేపు ఆటో యూనియన్లు బంద్‌కు పిలుపునివంవడంతో 16 వేల ఆటోలు రోడ్డెక్కలేదు. అనకాపల్లిలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఎన్జీవోల రిలే నిరాహార దీక్షలు అనకాపల్లిలో 19వ రోజుకు చేరాయి.