jail bharo
-
Up: బరేలీలో ఉద్రిక్తత.. జ్ఞానవాపిపై జైల్‌భరోకు పిలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు దేశంలో ముస్లింలపై అణిచివేతకు నిరసనగా బరేలిలో ముస్లిం మతపెద్ద తఖీర్ రజా శుక్రవారం జైల్ భరో పిలుపునిచ్చారు. తన అభిమానులంతా బరేలీలోని వీధుల్లోకి వచ్చి అరెస్టవ్వాలని కోరారు. దీంతో వేలాది సంఖ్యలో రజా అభిమానులు బరేలీలోని ఇస్లామియా మైదానంలో గుమిగూడారు. శుక్రవారం నమాజ్‌కు కొద్దిసేపటి ముందే రజా జైల్ భరో పిలుపునివ్వడంతో ఆయన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో బరేలీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రజా అభిమానులు గుమిగూడిన ఇస్లామియా కాలేజ్ మైదానాన్ని పోలీసులు చుట్టుముట్టారు. బరేలీలోని మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జైల్ భరో పిలుపు కారణంగా రజాను పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం బరేలీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బరేలీకి ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసపైనా రజా స్పందించారు. దేశంలో బుల్డోజర్ల దాడిని ఇక ఎంత మాత్రం సహించేది లేదన్నారు. సుప్రీం కోర్టే తమను పట్టించుకోకపోతే ఇక తమను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురి మృతి -
పోలీస్ పహారాలో జనగామ...ఉద్రిక్తత
జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం జైల్‌భరో కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ నేపధ్యంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజలు తరలివస్తారన్న సమాచారంతో జనగామలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. 144వ సెక్షన్ విధించడంతో పట్టణంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. హైదరాబాద్, హన్మకొండ, సూర్యాపేట, సిద్ధపేట జాతీయ రహదారుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పోలీస్ పహారాలో వరంగల్ వెళ్లారు. జనగామ పట్టణంలో 144 సెక్షన్ ఇంకా వారం రోజులు కొనసాగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే జైల్ భరో
ప్రత్యేక హోదాపై రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిరంతర పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిట్లు రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ఎనిమిదో తేదీ నుంచి పాదయాత్ర కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని వివరించారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి ప్రత్యేక హోదా కోసం సామూహిక రాయబారం చేయనున్నామని తెలిపారు. -
రైతు సమస్యలు పరిష్కరించకుంటే జైల్ భరో
సాక్షి, ముంబై : కరవు ప్రాంతాల్లోని రైతుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ‘జైల్ భరో’ ఆందోళన చేపడతామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వారిని గద్దె దించాలని ఆయన అన్నారు. కరవుతో మూడు రోజుల మరాఠ్వాడా పర్యటనను ఆయన శుక్రవారం ఉస్మానాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు. మొదటి రోజు ఉస్మానాబాద్‌లో ర్యాలీ నిర్వహించిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పవార్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదలను, కరవు కోరల్లో చిక్కుకున్న రైతుల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైందని అన్నారు. ఒక్క ఉస్మానాబాద్లోనే 88 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు. 25 రోజులు వృథా పార్లమెంట్లో రైతుల సమస్యలను ప్రస్తావించాలని అనుకున్నామని.. అయితే సమావేశాలు సక్రమంగా జరగకపోవడం వల్ల 25 రోజులు వృథా అయ్యాయని, ఒక్క రోజు కూడా ప్రధాని పార్లమెంట్‌కు హాజరుకాలేదని మండిపడ్డారు. ప్రధానికి రైతు తమ్ముళ్లు, కుటుంబాలు ఎందుకు గుర్తురావడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందని దుయ్యబట్టారు. సెప్టెంబరు 14వ తేదీలోపు రైతుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జైల్ భ రో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శని, ఆదివారాలు లాతూర్, బీడ్, పర్భణి జిల్లాలో ర్యాలీలు ఉంటాయని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు 35 ఏళ్ల తర్వాత ఆయన రోడ్డుపైకి వచ్చారు. దీంతో అందరి దృష్టి పవార్‌పై పడిం ది. 1980, డిసెంబర్లో ఆయన చివరగా జల్గావ్ నుంచి నాగ్‌పూర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎన్సీపీలో సరైన నాయకుడు లేడు: వినోద్ తావ్డే అయితే విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే మాట్లాడుతూ.. ఎన్సీపీలో మరో నాయకుడు లేడు కాబట్టి పార్టీ అధినేత గల్లీల వెంబడి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉస్మానాబాద్ ర్యాలీని కేవలం పవార్ నిర్వహిస్తున్నారా?.. మిగతా ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్, సునీల్ ఠాక్రే, జయంత్ పాటిల్ ఎక్కడ అని ప్రశ్నించారు. దీనిపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత ధనంజయ్ ముండే మాట్లాడుతూ.. బోగస్ డిగ్రీ ఉన్న మంత్రులు బోగస్ మంత్రులని, ఎన్సీపీ నాయకుల గూర్చి మాట్లాడే ముందు.. బోగస్ డిగ్రీపైనిజనిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
సీపీఐ జైల్‌భరోలో పలువురి అరెస్ట్
విజయవాడ బ్యూరో, గుంటూరు ఈస్ట్: భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆందో ళనలు జరిగాయి. గురువారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని అరెస్టయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో ఆ పార్టీ కేంద్ర కార్యవర్గసభ్యుడు నారాయణ పాల్గొని అరెస్టయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేలకు పైగా సీపీఐ కార్యకర్తలు జైల్‌భరోలో అరెస్టై అనంతరం విడుదలయ్యారు. -
‘భూసేకరణ’ సవరణపై సీపీఐ సమరం
రాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో ‘చలో రాజ్‌భవన్’లో చాడ, ఇతర నేతల అరెస్ట్ హైదరాబాద్: భూసేకరణ చట్ట సవరణపై సీపీఐ సమరభేరి మోగించింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరి అనుసరిస్తోందని ఆందోళనలకు దిగింది. భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజ్‌భవన్ వైపు దూసుకువచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు బీవీ విజయలక్ష్మి, వీఎస్ బోస్, ఈటీ నర్సింహా తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన జైల్‌భరోలో ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్‌పాషా తదితరులు అరెస్ట్ అయ్యారు. భూసేకరణ చట్ట సవరణలను నిరసిస్తూ సీపీఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట కార్యకర్తలు ‘జైల్‌భరో’ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చలో రాజ్‌భవన్‌ను నిర్వహించిన సీపీఐ రాష్ట్ర నాయకులను ఖైరతాబాద్ చౌరస్తాలో అరెస్ట్ చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించి, 2013 భూసేకరణ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లుకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలన్నా రు. యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చినపుడు సమర్థించి ఇప్పుడు ఎందుకు సవ రణలు చేస్తున్నారని ప్రశ్నించారు. -
రాజ్‌భవన్ ముట్టడి యత్నం
హైదరాబాద్: తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు రాజ్‌భవన్ ముట్టడించడానికి ప్రయత్నించారు. భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఈరోజు జైల్ భరో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ బిల్లుకు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పోరేట్ల కోసమే భూ సేకరణ చేస్తోందని చాడా విమర్శించారు. -
రాజ్‌భవన్ ముట్టడి యత్నం
-
పీనుగును పెట్టి పరిపాలన చేస్తున్నారు: కె.నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అనిశ్చితి కారణంగా వెనకబడిపోయిన ప్రజాసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలో పలు చోట్ల జైల్‌భరో ఆందోళన జరిగింది. ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అలక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అరెస్ట చేసి వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పీజే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని రోజులుగా పరిపాలన స్తంభించిందన్నారు. రాష్ట్రంలో ఓ పీనుగును పెట్టి కేంద్రం పరిపాలన చేస్తోందని ధ్వజమెత్తారు. దీంతో ప్రజాసమస్యలేవీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టే నాథుడే కనిపించడం లేదన్నారు. ప్రతినెలా వచ్చే పింఛన్లు, సరుకులు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేరస్తులను చట్టసభల నుంచి వెలివేసే ఆర్డినెన్స విషయంలో జరిగిన తతంగం ప్రధానిని అవమానించేలా ఉందని మండిపడ్డారు. తానైతే క్షణం కూడా ఆ పదవిలో ఉండేవాణ్ణి కాదన్నారు. ‘ఇసుకకు తక్కువ పేడకు ఎక్కువయిన రాహుల్ చెబితే ఓ ప్రధాని వినాలా?’ అని ప్రశ్నించారు. 3 ప్రజాప్రతినిధులకు ఎదురుదెబ్బ సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉపయోగపడాల్సిన రైల్వే ‘ఇజ్జత్’ పాస్‌లను లక్షల సంఖ్యలో పక్కదారి పట్టించిన ప్రజాప్రతినిధులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీల వల్లనే ఈ పాస్‌లు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించిన రైల్వేబోర్డు వారి ఆటలు సాగకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పటి వరకు ఇజ్జత్పాస్ పొందాలనుకున్నవారికి ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉండగా.. తాజాగా వారి పెత్తనానికి కత్తెర వేస్తూ రైల్వేబోర్డు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఇకనుంచి ప్రజాప్రతినిధులు జారీ చేసే ధ్రువపత్రాలను పరిశీలించి అవి సరైనవేనని అధికారులు కూడా ధ్రువీకరించాలని మెలికపెట్టింది. దీనిప్రకారం ఆయా మండలాల తహసీల్దార్లు ఎంపీలు జారీచేసే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని ధ్రువీకరిస్తేనే రైల్వే అధికారులు ఆయా అభ్యర్థులకు ఇజ్జత్ పాసులు జారీ చేస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో దాదాపు ఏడు లక్షల ఇజ్జత్ పాసులు అనర్హుల చేతుల్లో ఉన్నట్టు ఇటీవల అంచనాకొచ్చిన స్థానిక అధికారులు... ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని తొలగించి ఆదాయ ధ్రువపత్రాల జారీని అధికారులకే అప్పగించేలా నిబంధనలు మార్చాలంటూ చేసిన ప్రతిపాదనకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించి రెండు రోజులక్రితం ఈ ఆదేశాలు జారీ చేసింది. -
సీమాంధ్రలో జైల్‌భరో
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షను భగ్నం చేసినందుకు నిరసిస్తూ శనివారం పలుచోట్ల ఆ పార్టీ కార్యకర్తలు జైల్‌భరో, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. తూర్పుగోదావరిజిల్లా అనపర్తి, ద్రాక్షారామం, రాజ మండ్రి, రాజానగరం, అమలాపురం, సర్పవరం, ప్రత్తిపాడు పోలీస్స్టేషన్ల ముట్టడించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన జైల్‌భరో కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మితో సహా వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దాపురం సబ్‌జైలును పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో ముట్టడించారు. వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట రోడ్లు ఊడ్చారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు మానవహారం నిర్వహించారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు కొయ్యలగూడెంలో జైల్‌భరో కార్యక్రమం చేపట్టగా, ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని రెండు రోజులపాటు నిర్వహించే మౌన నిరాహార పాదయూత్ర ప్రారంభమైంది. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నుంచి వందలాదిమంది కార్యకర్తలు పాదయాత్ర చేసి ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో పోలీసుస్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా గురజాల నేత జంగా కృష్ణమూర్తి పిడుగురాళ్ల నుంచి 50 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. జననేత ఆరోగ్యం కోసం పూజలు: జగన్ ఆరోగ్యం కుదుటపడాలని చిత్తూరులో పార్టీ మహిళా కన్వీనర్ గాయత్రీదేవి చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి, ముత్తయిదువులకు పసుపు కుంకుమ, జాకెట్లు పంచిపెట్టారు. పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లెలో ముత్యాలమ్మకు పొంగళ్లు పెట్టి పూజలు చేశారు. శ్రీకాకుళంలోని సిద్ధగణపతి దేవాలయం వద్ద పూజలుచేశారు. రాజాంలో ముస్లింలు నడిరోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం, మడకశిర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడలో పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో 108 మంది లలితా సహస్రనామ పారాయణ చేశారు. -
కడపలో జైల్‌భరో కార్యక్రమం
-
విజయవాడ జైల్‌భరో కార్యక్రమం
-
జననేతకు విశాఖలో వెల్లువెత్తిన మద్దతు
-
జగన్‌కు మద్దతుగా అనంతపురంలో జైల్‌భరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జగన్ దీక్షకు మద్దతుగా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన 48 గంటల ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం కూడా కొనసాగుతుంది. అలాగే కళ్యాణదుర్గంలో గంధ్రాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎమ్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తాడిపత్రిలో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి దీక్ష 5వ రోజు, చొవ్వ రాజశేఖరరెడ్డి,ఆలమూరు శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డితో పాటు మైనారిటీ నేతలు చేపట్టిన దీక్ష 3 రోజుకు చేరాయి. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్‌కు మద్దతుగా చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతుంది. -
వైఎస్ఆర్ జిల్లాలో జైల్‌భరో కార్యక్రమం
ఏలూరు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా సీమాంధ్ర జిల్లాల్లో అనూహ్యరీతిలో స్పందన లభిస్తోంది. జగన్ సంఘీభావంగా దీక్షలు, నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం విద్యార్థి జేఏసీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీసమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో రిలే దీక్షలకు దిగారు. మరోవైపు కృష్ణా జిల్లా నూజివీడులో జగన్‌కు మద్దతుగా చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యాక్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఇక ద్రాక్షారామం, రామచంద్రపురం మండలాల్లో వ్యాపార సంస్థలు, ఆటోవాలాల ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. వైఎస్‌ఆర్‌జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా కడపలో వైఎస్ఆర్సీపీ జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తోంది. పార్టీ నేతలు అవినాష్‌రెడ్డి,సురేష్ బాబు, డీసీసీబి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జననేతకు విశాఖలో వెల్లువెత్తిన మద్దతు
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. జననేత నిరవధిక దీక్షకు సంఘీభావంగా మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో మద్దెలపాలెం వద్ద దీక్షలు జరుగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు సంఘీభావంగా మునగపాకలో యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 6వ రోజుకు చేరాయి. చోడవరంలో వైఎస్ఆర్సీపీ నేత టీవీఎస్ఎన్ రాజు ఆమరణ దీక్ష నాలుగోరోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జగన్ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని పెందుర్తి వెంకటాద్రి కొండపై స్వామివారికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, యువజన విభాగ అధ్యక్షుడు అన్నమరెడ్డి ఆదీప్ రాజు ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు, రేపు ఆటో యూనియన్లు బంద్‌కు పిలుపునివంవడంతో 16 వేల ఆటోలు రోడ్డెక్కలేదు. అనకాపల్లిలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఎన్జీవోల రిలే నిరాహార దీక్షలు అనకాపల్లిలో 19వ రోజుకు చేరాయి.