ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జగన్ దీక్షకు మద్దతుగా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన 48 గంటల ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం కూడా కొనసాగుతుంది.
అలాగే కళ్యాణదుర్గంలో గంధ్రాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎమ్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తాడిపత్రిలో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి దీక్ష 5వ రోజు, చొవ్వ రాజశేఖరరెడ్డి,ఆలమూరు శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డితో పాటు మైనారిటీ నేతలు చేపట్టిన దీక్ష 3 రోజుకు చేరాయి. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్కు మద్దతుగా చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతుంది.