ఏలూరు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా సీమాంధ్ర జిల్లాల్లో అనూహ్యరీతిలో స్పందన లభిస్తోంది. జగన్ సంఘీభావంగా దీక్షలు, నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం విద్యార్థి జేఏసీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీసమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో రిలే దీక్షలకు దిగారు.
మరోవైపు కృష్ణా జిల్లా నూజివీడులో జగన్కు మద్దతుగా చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యాక్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.
ఇక ద్రాక్షారామం, రామచంద్రపురం మండలాల్లో వ్యాపార సంస్థలు, ఆటోవాలాల ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. వైఎస్‌ఆర్‌జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా కడపలో వైఎస్‌ఆర్‌సీపీ జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తోంది. పార్టీ నేతలు అవినాష్‌రెడ్డి,సురేష్ బాబు, డీసీసీబి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.