జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం జైల్‌భరో కార్యక్రమాన్ని ప్రకటించారు.
జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం జైల్‌భరో కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ నేపధ్యంలో భారీ సంఖ్యలో విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజలు తరలివస్తారన్న సమాచారంతో జనగామలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. 144వ సెక్షన్ విధించడంతో పట్టణంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. హైదరాబాద్, హన్మకొండ, సూర్యాపేట, సిద్ధపేట జాతీయ రహదారుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పోలీస్ పహారాలో వరంగల్ వెళ్లారు. జనగామ పట్టణంలో 144 సెక్షన్ ఇంకా వారం రోజులు కొనసాగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.