ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే జైల్ భరో | CPI demands Prime Minister comment on the Special Status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే జైల్ భరో

Published Tue, Sep 29 2015 4:14 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CPI demands Prime Minister comment on the Special Status

ప్రత్యేక హోదాపై రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిరంతర పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిట్లు రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ఎనిమిదో తేదీ నుంచి పాదయాత్ర కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని వివరించారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి ప్రత్యేక హోదా కోసం సామూహిక రాయబారం చేయనున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement