the capital
-
రికవరీ రేటు 96.59 శాతం
ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతోంది. గురువారం రికవరీ రేటు 96.59 శాతానికి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. మరణాల రేటు 2.01 శాతంగా ఉంది. గత నెలలో రికవరీ రేటు 93 శాతంగానే ఉంది. అలాగే ఒక్కరోజే 11,124 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 60,75,888కి పెరిగింది. ఇక కొత్తగా 7,242 కోవిడ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 62,90,156కి చేరుకుంది. గత 24 గంటల్లో 190 మంది కరోనాతో పోరాడుతూ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1,32,335కి చేరుకుంది. బుధవారం రాష్ట్రంలో 6,857 కొత్త కేసులు, 286 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 1,90,181 కరోనావైరస్ పరీక్షలు జరిగాయి, ఇప్పటివరకు అధికారులు రాష్ట్రంలో 4,75,59,938 కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం 78,562 క్రియాశీల కేసులు ఉన్నాయి. 4,87,704 మంది గృహ నిర్బంధంలో 3,245 మంది సంస్థాగత నిర్బంధంలో ఉన్నారు. క్రియాశీల రోగులలో పుణే జిల్లాలో అత్యధికంగా 16,177 కేసులు ఉన్నాయి. అలాగే అదే జిల్లాలో అత్యధికంగా 10,52,367 మంది రోగులు కోలుకున్నారు. రాజధానిలో 341 కేసులు.. గత 24 గంటల్లో రాజధాని ముంబైలోనే కొత్తగా 341 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇక్కడ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,35,505 అయింది. ముంబైలో 13 మంది కరోనాతో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 15,808గా నమోదైంది. ముంబై, ఉపగ్రహ పట్టణాలతో కూడిన ముంబై డివిజన్లో ఒక్కరోజులో 1,011 కేసులు నమోదయ్యాయి. పుణే డివిజన్లో 2,801 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. లాతూర్ డివిజన్లో కొత్తగా 375 కరోనా కేసులు నమోదైతే ఔరంగాబాద్ డివిజన్లో 94, కొల్లాపూర్ డివిజన్లో 1,847 కేసులు నమోదయ్యాయి. కొల్హాపూర్ ప్రాంతంలో 48 మరణాలు నమోదయ్యాయి, తరువాత పుణే, ముంబై పరిసర ప్రాంతాలలో వరుసగా 40, 31 మరణాలు సంభవించాయి. అకోలా డివిజన్లో 28, నాగ్‌పూర్ డివిజన్లో 32 కేసులు నమోదయ్యాయి. నాసిక్ డివిజన్లో తాజాగా 1,054 కేసులు నమోదయ్యాయి. భండారా, నందుర్బార్ జిల్లాలతో పాటు పర్భని మునిసిపల్ కార్పొరేషన్ ఏరియాలో గురువారం ఎలాంటి కొత్త కరోనా వైరస్ కేసులు రాలేదు. ఔరంగాబాద్, నాసిక్, లాతూర్, నాగ్‌పూర్, అకోలా ప్రాంతాలలో వరుసగా 26, 17,12, 9, 7 తాజా కరోనా మరణాలు నమోదయ్యాయి. థానేలో 292 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, మొత్తం కేసుల సంఖ్య 5,43,814కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. గత 24 గంటల్లో జిల్లాలో 11 మంది కోవిడ్ కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 11,009కి చేరిందని తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 2.02 శాతంగా ఉంది. రికవరీ, క్రియాశీల కేసుల వివరాలను జిల్లా యంత్రాంగం అందించలేదు. పాల్ఘర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,29,488కి చేరుకోగా మరణాల సంఖ్య 3,190గా ఉందని అధికారులు తెలిపారు. -
ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే జైల్ భరో
ప్రత్యేక హోదాపై రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిరంతర పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిట్లు రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ఎనిమిదో తేదీ నుంచి పాదయాత్ర కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని వివరించారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి ప్రత్యేక హోదా కోసం సామూహిక రాయబారం చేయనున్నామని తెలిపారు. -
దుర్గగుడి ఖాతాలో సర్కారు ఉగాది ఖర్చు!
25 లక్షలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఆలయంలో ఉగాది ఉత్సవాలకు కోత తూతూ మంత్రంగా అమ్మవారి చైత్ర మాసోత్సవాలు? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు సాక్షి, విజయవాడ: ఉగాది వేడుకలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసిన తుళ్లూరులో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా రాజధానికి భూములిచ్చిన రైతులకు సత్కారాలు చేయడంతోపాటు వేదపండితులతో పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సీఎం చంద్రబాబుతోపాటు ఆయన మందీమార్బలమంతా తరలిరానుంది. దీనికయ్యే ఖర్చు రూ.25 లక్షలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఈ ఖర్చు భారమంతటినీ విజయవాడ కనక దుర్గమ్మపైన పెట్టారు. ఈ మేరకు తుళ్లూరులో అయిన ఖర్చులన్నింటినీ దేవస్థానం నుంచి విడుదల చేయాలని ఆలయ అధికారులకు ఆదేశాలందినట్లు సమాచారం. దేవస్థానంలో ఉగాది ఉత్సవాలకు కోత.. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో దేవస్థానానికి భక్తులు కూడా పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఉగాది పండుగరోజు నుంచే 18 రోజులపాటు దేవస్థానంలో అమ్మవారి చైత్ర మాసోత్సవాలు(వసంత నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ ఏడాది ఉగాది వేడుకలకు, చైత్ర మాసోత్సవాలకు సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతాయని దేవస్థానం అధికారులు అంచనాలు తయారు చేశారు. అయితే తుళ్లూరులో ప్రభుత్వం నిర్వహించే ఉగాది వేడుకల ఖర్చు భారం దేవస్థానంపై పడటంతో దుర్గగుడిలో జరిపే ఉగాది వేడుకలు, చైత్ర మాసోత్సవాల ఖర్చును తగ్గించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో అంచనాలు వేసిన రూ.6 లక్షల్లో సగానికి కోత పెట్టి రూ.3 లక్షలు ఖర్చు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అమ్మవారి సొమ్ముతో ప్రభుత్వం సోకులా? భక్తులు అమ్మవారిపై నమ్మకంతో కానుకలు, మొక్కుబడులు సమర్పిస్తారు. ఈ నిధుల్ని దేవస్థానం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్వహించే ఉగాది ఉత్సవాలకు దేవస్థానం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి చేసే ఉత్సవాల్లో కోతలు విధించి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. -
‘గ్రేటర్’లో మరో 8 స్వైన్‌ఫ్లూ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 17 రోజుల్లో ఏడుగురు చనిపోగా, 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. హోలిస్టిక్ ఆస్పత్రిలో 39 ఏళ్ల వ్యక్తి, బసవతారకం ఆసుపత్రిలో 57 ఏళ్ల మహిళ, రెయిన్బో ఆస్పత్రిలో 8 ఏళ్ల బాలిక, కేర్‌లో 28 ఏళ్ల మహిళతో పాటు 25 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతున్నారు. అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు, కాంటినెంటల్ ఆస్పత్రిలో 38 ఏళ్ల మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరారు. -
సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ మంత్రికి అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. నేలపాడులో మొత్తం 1470 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిలో 1206 ఎకరాల పట్టాభూమిని మొత్తం 685 మంది రైతులు రాజధానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే రైతులకు తీవ్ర నష్టం వస్తుందని భావించిన సీఎం ల్యాండ్ పూలింగ్ చేపట్టినట్టు తెలిపారు. నూతన రాజధానిలో మొదటి లబ్ధి ఈ ప్రాంత రైతులకే దక్కుతుందన్నారు. జూన్‌లో సింగపూర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ఇస్తే వెంటనే మంచి రోజు చూసుకుని రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.తొలి దశ పనులు మూడేళ్లలో పూర్తి కాగలవని అంచనా వేశామన్నారు. మురుగు నీరు బయటకు వెళ్లే అవకాశం లేని నేలపాడు గ్రామాన్ని ప్రభుత్వం తీసు కోవాలని ఓ రైతు కోరగా ప్రస్తుతం గ్రామాలను కదిలించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, వివాదాలను పరిష్కరిస్తూ రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ అనుమతి ప్రతాలను తీసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తిని భూ సమీకృత అధికారిగా నియమిస్తున్నట్లు చెప్పి ఆయనను రైతులకు పరిచయం చేశారు. అనంతరం మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ భూములు ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని రశీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ చెరుకూరి శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, తహశీల్దార్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేసిన రైతులు కొమ్మినేని ఆదిలక్ష్మి 3.5 ఎకరాలు, కాటా అప్పారావు ఎకరం, ధనేకుల రామారావు 11 ఎకరాలు, భూక్యా సాలి 80 సెంట్లు, కొమ్మినేని శేషగిరిరావు 5 ఎకరాలు, ఇందుర్తి నాగమల్లేశ్వరరావు 55 సెంట్లు, గుజ్జర్లపూడి తిరుపతిరావు ఎకరం, కణతరపు సాంబశివరావు 4.75 ఎకరాలు, పారా పార్వతి 95 సెంట్లు, ఆలూరి వెంకటేశ్వరరావు 6 ఎకరాలు, మూల్పూరి రాంబాబు 5.75 ఎకరాలు, కె.రాఘవయ్య 5 ఎకరాలు, ఇందుర్తి వెంకటేశ్వరరావు 55 సెంట్లు, యంపరాల నవత 1.50 ఎకరాలు, కొమ్మగూర ఇసాక్ 1.70 ఎకరాలు, కణతరపు శ్రీమన్నారాయణ 3.5 ఎకరాలు. ఇంకా పలువురు ఉన్నారు. తొలిరోజు 106.48 ఎకరాలు నేలపాడులో శుక్రవారం జరిగిన ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంలో 106ఎకరాల 48 సెంట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు 40 మంది రైతులు అంగీకార పత్రాలను సమర్పించారు. మొదటి రోజు కనీసం 500 ఎకరాలకు అంగీకార పత్రాలు తీసుకోవాలనే లక్ష్యంతో అధికారులు, మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ గ్రామానికి వచ్చారు. అయితే శుక్రవారం కావడం ఒక కారణమైతే, మరోవైపు భారీ వర్షం కురవడంతో రైతులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. దీనిపై తహశీల్దార్ సుధీర్‌బాబు మాట్లాడుతూ తొలిరోజు 40 మంది రైతులు ముందుకు రావడం ఆశించదగిన పరిణామం అన్నారు. శనివారం ఎక్కువ మంది రైతులు వచ్చే అవకాశం వుందని అన్నారు. వారంలోపు నేలపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
రాజధాని రైల్వేస్టేషన్‌పై ప్రత్యేక దృష్టి
మంగళగిరి: రాజధాని రైల్వేస్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికులకు వసతులు కల్పిస్తామని డీఆర్ఎం ఎన్వీ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 12న దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పరిశీలించనున్న నేపథ్యంలో డీఆర్ఎం ప్రసాద్ నేతృత్వంలో సుమారు 40 మంది రైల్వే అధికారులు, సిబ్బంది బుధవారం గుంటూరు నుంచి ప్రత్యేక రైలులో ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా డీఆర్ఎం విలేకరులతో మాట్లాడారు. స్టేషన్లో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను కాంట్రాక్ట్‌పై తీసుకోవడానికి ఎవరు ముందుకురాకపోవడంతో నిరుపయోగంగా పడివున్నాయన్నారు. రైల్వేస్టేషన్ విస్తరణ, ప్లాట్‌ఫారాలు తదితర అంశాలపై వచ్చేనెలలో పర్యటించనున్న ఉన్నతాధికారులు బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తొలుత అధికార బృందం రైల్వేస్టేషన్ ఆవరణను పరిశీలించి, ప్లాట్‌ఫారాలు, తాగునీరు, టాయిలెట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, సేఫ్టీ చైన్స్తోపాటు స్టేషన్ ఆవరణలోని సైకిల్‌స్టాండ్‌ను పరిశీలించారు. సైకిల్స్టాండ్కు మరో 50 మీటర్ల స్థలం కేటాయించి విస్తరించాలని ఆదేశించారు. స్వఛ్చభారత్ సందర్భంగా నాటిన మొక్కలను పరిశీలించారు. తాగునీటి పంపుల లీకవుతుండడంతో వెంటనే వాటిని మార్చాలని చెప్పారు. స్టేషన్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిడమర్రు రైల్వేగేటు వద్ద త్వరలో రెయిలింగ్.. నిడమర్రు రైల్వేగేటు వద్ద రెయిలింగ్ ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామని డీఆర్ఎం ప్రసాద్ తెలిపారు. ఈ నెల ఐదో తేదీన సాక్షిలో ‘ప్రాణాలు పోతేకాని పట్టించుకోరా?’ శీర్షికన రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహంపై కథనం ప్రచురితమైం ది. ఈ కథనాన్ని ఓ ప్రయాణికుడు డీఆర్ఎం ప్రసాద్‌కు చూపించారు. స్పందించిన డీఆర్ఎం.. వివరాలు తీసుకుని నిడమర్రు గేటు వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుగుప్రయాణంలో తనకు ఆ గేటును చూపించాలని అధికారులతో అన్నారు. డీఆర్ఎం వెంట సీనియర్ డీసీఎం శ్రీరాములు, కోఆర్డినేషన్ డీఎం సైమన్, సీనియర్ డీఎస్టీ ఐజాక్, ఎలక్ట్రికల్ డీఈఈ ఏఎంఎస్ రెడ్డి, డీఈఈ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ డి.సత్యనారాయణ, మెకానికల్ డీఈ శ్రీకాంత్, స్టేషన్ మేనేజర్లు డి.ఏలియాబాబు, ఎన్.విజయ్ప్రవీణ్, బాబు,శ్రీలక్షి తదితరులు ఉన్నారు. -
సమీకరణకు కదిలిన గణం
సాక్షి,గుంటూరు : రాజధాని ప్రాంతంలో భూసమీకరణ కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. వీలైనంత వేగంగా భూసమీకరణ చేసే దిశగా అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. ఇందులో భాగంగానే గుంటూరులోని కలెక్టరేట్లో శనివారం తొలిదశలో భూ సమీకరణ జరగనున్న 17 గ్రామాలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డి. సాంబశివరావు పాల్గొని భూసమీకరణకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి జాగ్రత్తగా ఉంచాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న పట్టాదారుల సంఖ్య, కుటుంబాల సంఖ్యను కులాల వారీగా తీసుకున్నారు. గ్రామాల వారీగా సంబంధిత వీఆర్వోలతో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. గ్రామ మ్యాప్‌లు పరిశీలించారు. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి, తాడేపల్లి, అమరావతి, జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశమయ్యారు. భూముల ధరలు, రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. భూములను స్థానికులు కొంటున్నారా, లేక బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కొంటున్నారా అని అడిగినట్లు తెలుస్తోంది. ఆదాయం, మార్కెట్ విలువ ఎలా ఉందని ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులతో మంత్రి సమీక్ష.... భూ సమీకరణకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లం, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి డి. సాంబశివరావు. ఆర్అండ్ బీ ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు.మంత్రుల కమిటీ పర్యటించే లోపే రెవెన్యూ రికార్డులు అప్డేట్ చేయాలని సూచించారు. కృష్ణానదికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోనే రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరులతో అన్నారు. ఐనవోలు, వెంకటపాలెంలో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సమీకరించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రికార్డులు స్వాధీనం.... తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని ఆ 17గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2009-2014 వరకు ఉన్న అడంగళ్లు, ఆర్ఎస్ఆర్ రికార్డులను తీసుకొన్నారు. ఈ రికార్డులను గ్రామ స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. తెనాలి, తాడేపల్లి తహశీల్దార్లులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ 17 గ్రామాల్లో అన్ని రకాల భూములు కలిపి దాదాపు 32,977.95 ఎకరాలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. -
లెనిన్ ఆశయాలు సాధించాలి
విజయవాడ స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఆర్చర్, కోచ్ చెరుకూరి లెనిన్ నాలుగో వర్ధంతి నగరంలో చెరుకూరి లెనిన్ -వీఎంసీ ఆర్చరీ అకాడమీలో శుక్రవారం జరిగింది. అకాడమీ ఆవరణంలో లెనిన్ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ప్రసంగించారు. గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ సంప్రదాయ విలువిద్య క్రీడలో అహర్నిశలు శ్ర మించి కామన్వెల్త్ గేమ్స్‌లో తన శిష్యబృందంతో పతకాలు సాధించడంలో సఫలీకృతుడయ్యారని గుర్తుచేశారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని క్రీడా రాజధానిగా తీర్చిది ద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లో దేశానికి ఆర్చరీ పతకాన్ని అందించే క్రీడాకారులు శిక్షణ పొందుతున్న చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి అవసరమైన కొరియన్ కోచ్ నియామకంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. చెరుకూరి లెనిన్ స్ఫూర్తితో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ చిన్నతనంలో ద్రాణాచార్యుడిగా పిలిపించుకున్న ఘనత ఒక్క లెనిన్కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు నగర పాలక సంస్థ సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ పతక విజేత పూర్వాష సుధీర్ షిండే సన్మాన కార్యక్రమంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు సమక్షంలో కొరియన్ కోచ్ కావాలని లెనిన్ తండ్రి చెరుకూరి సత్యనారాయణ కోరారని, స్పందించిన సీపీ తక్షణమే బడ్జెట్ ఎంత కావాలని కోరగా, రూ.1.39 కోట్లకు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి, స్పాన్సర్ల నుంచి సేకరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్డీవో పి.రామకృష్ణ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ రామ్ బొబ్బా, జిల్లా చైర్మన్ కె.పార్థసారథి, కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, దాసరి మల్లేశ్వరి, కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఐద్వా నాయకురాలు వనజకుమారి, అకాడమీ ఆర్చర్లు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అకాడమీకి రూ.లక్ష విరాళం ఆసియా క్రీడల్లో తన కుమార్తె కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెరుకూరి ఓల్గా-వీఎంసీ అకాడమీకి పూర్వాష సుధీర్ షిండే తండ్రి సుధీర్షిండే (మహారాష్ట్ర-అమరావతి) లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. తొలుత విశాఖపట్నం హుదూద్ బాధితల కోసం సీఎం సహాయ నిధికి ఇవ్వాలని రూ.లక్ష చెక్కును ఆయన ఎమ్మెల్యేలకు ఇవ్వగా వారు అకాడమీకి ఇవ్వాలని సూచించా రు. ఈ మేరకు ఆ చెక్కును తన కుమార్తె పూర్వాషతో కలిసి ఎమ్మెల్యేల చేతులు మీదుగా చెరుకూరి సత్యనారాయణకు అందజేశారు. -
విమానాశ్రయానికి ‘భద్రత’ ఉందా?
పెను తుపాను వస్తే తప్పని ఇబ్బందులు అధునాతన టెర్మినల్ భవనం అవసరం ప్రత్యేక డిజైన్ సిద్ధం చేస్తున్న అధికారులు భూములిచ్చేందుకు ఒప్పుకోని రైతులు సాక్షి, విజయవాడ : హుదూద్ సృష్టించిన పెను విలయానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆధారంగా నిర్మించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం విధ్వంసం కావడంతో... గన్నవరం విమానాశ్రయ పటిష్టతపైనా చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఎయిర్‌పోర్టుకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయమే పెనుగాలుల నుంచి తప్పించుకోలేకపోయిందని, సాధారణ గన్నవరం ఎయిర్‌పోర్టు ఏలా తట్టుకుంటుందనే వాదన వినిపిస్తోంది. అయితే రాజధాని ఎయిర్‌పోర్టు కాబట్టి దీనిని మరింతగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఉంది. బ్రిటిష్ పరిపాలన సమయం నుంచే గన్నవరం విమానాశ్రయం ఉంది. అయితే 2000 సంవత్సరం వరకు కేవలం రన్వేగానే దీనిని వినియోగించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి మూడు ఎయిర్‌లైన్స్ నాలుగు నగరాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో ఐదేళ్ల నుంచే వాడకంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం సాధారణ నిర్మాణం గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేవలం రన్‌వే వాడకానికి వీలుగా నిర్మించారు. భవనంపై భాగం అంతా రేకులతో నిర్మితమై ఉంది. 574 ఎకరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులో 7,500 అడుగుల రన్‌వే ఉంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్, మధురై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. తాజాగా విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో విఐపీల రాకపోకలు అధికమయ్యాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెం దిన వారే అధికంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నెలకు సగటున మూడుసార్లు వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సదుపాయాల లేమి... మారుతున్న అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు పెరిగాయి కాని సౌకర్యాలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌లో కేవలం 70 మందికి మాత్రమే సీటింగ్ సౌకర్యం ఉంది. అలాగే 7,500 అడుగులు రన్‌వే ఉంది. అలాగే విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏరియా తక్కువే ఉంది. ఈ క్రమంలో రెండు నెలల కిత్రం ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆలోక్ సిన్హా, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టును సందర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడ రాజధానిగా ప్రకటించనున్న క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే భూసేకరణ అసలు సమస్యగా మారింది. 480 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా వాటిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 430 ఎకరాల భూమిని సుమారు 400 మంది రైతలు నుంచి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తి అయితేనే విస్తరణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే గన్నవరం భూముల ధరలు కోట్లకు చేరిన క్రమంలో రైతులు భూములు ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. తుపానుల ముప్పు తక్కువే - రాజ్‌కిషోర్, డెరైక్టర్ విశాఖ విమానాశ్రయం సముద్రానికి అతి దగ్గరగా ఉండటం వల్ల కొంత నష్టం వాటిల్లిందని, అయితే గన్నవరానికి అలాంటి ఇబ్బంది ఉండదని గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ రాజ్‌కిషోర్ సాక్షికి తెలిపారు. సముద్రానికి , నదికి దూరంగా జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో ఇబ్బంది ఉండదని చెప్పారు. అయితే ప్లానింగ్ విభాగం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన టెర్మినల్ డిజైన్‌కు రూపకల్పన చేస్తుందని ఆయన చెప్పారు. -
జిల్లా వాసులను మోసగిస్తున్న బాబు
కంకిపాడు : పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తూ జిల్లా వాసులను మోసం చేస్తున్నారని, ఆయన్ను టీడీపీ నేతలు నిలదీయాలని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. కంకిపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత రాజధాని విజయవాడ అని ప్రకటించిన సీఎం.. మళ్లీ ఇప్పుడు గుంటూరు పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటుచేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులకు ఆశలు రేపి మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో భూ వ్యాపారం చేసుకుని, చివరికి మాట మార్చిన చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. టీడీపీ 150 రోజుల పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జాడలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ పేరు తగిలించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలపై రోజులో మాట మారుస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేసిన చంద్రబాబుకు ఈ విషయంలో అసలు చిత్తశుద్ధి లేదన్నారు. అధిక వడ్డీల బారిన పడ్డ రైతులను కాపాడిన ఆపద్బాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే, తిరిగి వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. 2న వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమావేశం వైఎస్సార్సీపీ పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కంకిపాడు వాణీనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తామని సారథి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ బందరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరరవుతారని చెప్పారు. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మాదు వసంతరావు, వేల్పూరు సర్పంచ్ చెన్నుబోయిన జయరాం, మంతెన పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కంకిపాడు మాజీ సర్పంచ్ బండి నాంచారయ్య, ఏఎంసీ మాజీ డెరైక్టర్ భీమవరపు రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఉమా...ఓ చేతకాని దద్దమ్మ.. : సారథి ‘గుంటూరుకు రాజధాని.. దొనకొండకు పారిశ్రామిక కేంద్రం, విశాఖను స్మార్ట్ సిటీగా ప్రకటించి విజయవాడను మాత్రం డంపింగ్ యార్డుగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చేతకాని దద్దమ్మ మంత్రి ఉమా మాత్రం నోరు మెదపటం లేదు..’ అంటూ సారథి మండిపడ్డారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై రాద్ధాంతం చేసిన ఉమా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఉమా తన మంత్రి పదవికి రాజీనామా చేసి చంద్రబాబును నిలదీయాలని డిమాండ్ చేశారు. -
జాగా కావలెను
సాక్షి, విజయవాడ : అధికారిక అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని వచ్చేనెల 21వ తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలో నిర్వహించనున్నారు. అయితే, నగరంలో ఎక్కడా పోలీస్ అమరవీరుల స్తూపం లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న అధికారులు తాత్కాలిక స్తూపం ఏర్పాటుపై మొగ్గుచూపి ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. దీంతోపాటు పోలీస్ బాస్ రంగంలోకి దిగి శాశ్వతంగా అమరవీరుల స్తూపం నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ బాధ్యతలను బెటాలియన్స్ అదనపు డీజీ గౌతమ్ సవాంగ్‌కు అప్పగించారు. దీంతో సవాంగ్ రెండు రోజుల క్రితం విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో పర్యటించారు. శాశ్వత స్తూపం ఏర్పాటుపై కసరత్తు సాగిస్తూనే విజయవాడలో తాత్కాలిక స్తూపం ఏర్పాటు చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. మరోవారం రోజుల వ్యవధిలో విజయవాడలో తాత్కాలిక స్తూపం నిర్మించే ప్రాంతాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్ర పోలీస్ అమరవీరుల స్తూపం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉండేది. దీంతో ప్రభుత్వం ఏటా అక్కడే అధికారిక కార్యక్రమాలు నిర్వహించేది. ఆ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. నూతన ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడను రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. విభజన క్రమంలో గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్తూపం తెలంగాణ రాష్ట్ర కేటగిరీలోకి చేరిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అమరవీరులకు అసలు ప్రస్తుతానికి స్తూపమే లేదు. ఇప్పటివరకు అంత సీరియస్‌గా పట్టించుకోని పోలీస్ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తేదీ దగ్గర పడటంతో అధికారుల్లో పూర్తిస్థాయి కదలిక మొదలైంది. మంగళగిరి బెటాలియన్‌లో తొలుత శాశ్వత అమరవీరుల సంస్మరణ స్తూపం ఏర్పాటు, స్టేడియం నిర్మాణానికి స్థల లభ్యత ఉందని గుర్తించారు. అయితే, అక్కడ బెటాలియన్ అమరవీరుల స్తూపం ఉండటంతో రాష్ట్ర స్తూపం అక్కడ పెట్టడం సాధ్యంకాదని నిర్ణయించి విజయవాడ నగరంపై దృష్టి సారించారు. విజయవాడను ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు కాబట్టి రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా విజయవాడ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించిన క్రమంలో విజయవాడలో శాశ్వత స్తూపం, స్టేడియం ఏర్పాటు కోసం స్థల సేకరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బెటాలియన్స్ డీజీ గౌతమ్ సవాంగ్ విజయవాడలోని ఆంధ్రలయోల కళాశాల ప్రాంగణం, సిదార్థ కళాశాల సెంటర్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. -
సీమలో రాజధాని నిర్మిస్తేనే అభివృద్ధి సాధ్యం
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మదనపల్లె: రాయలసీమలో రాజధాని నిర్మిస్తేనే అన్ని రంగాల్లో వెనుకబడిన సీమ నిజమైన అభివృద్ధి సాధిస్తుందని పలువురు వక్తలు, మేధావులు అభిప్రాయపడ్డారు. ‘రాయలసీమ వెనుకబాటుతనం, కొత్తరాజ ధాని ఏర్పాటు’ అనే అంశంపై ఆదివారం స్థానిక దేశాయ్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో వైఎస్.మునిరత్నం, వీ ఎస్.రెడ్డి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నరేం ద్ర, అంబేద్కర్‌సేన అధ్యక్షుడు శివప్రసాద్, జెడ్పీటీసీ భాస్కర్, పాల్‌రెడ్డి, కొండయ్య, వెలుగు మో హన్, కౌన్సిలర్ మస్తాన్‌రెడ్డి, మహ్మద్ రఫీ, కామకోటి ప్రసాదరావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ భవానీ ప్రసాద్, జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్ర ముఖులు, మేధావులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. సీమ అభివృద్ధికి ఒక్కటవ్వాలి తొలుత అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజ న అనంతరం రాయలసీమలో నెలకొంటు న్న సమస్యలపై రాజకీయాలకు, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలి పారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో వెనుకబ డిన రాయలసీమను రతనాల సీమగా అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజధాని విషయంలో సమస్య లేదని రాష్ర్ట విభజన తర్వా త ఈ సమస్య వచ్చిందన్నారు. భాషా సం యుక్త రాష్ట్రానికి రాజధానిగా వున్న హైదరాబాదును పోగొట్టుకోవడం దురదృష్టకరమన్నారు. సీమకు చెందిన ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత ఇద్దరున్నా నీటి వనరులు, ఇతర వాటాల విషయంలో సీమకు అన్యాయం జరి గిందన్నారు. ప్రస్తుతం వున్న హంద్రీనీవా- సుజలస్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితేనే సీమకు గుక్కెడు నీరు దొరుకుతుందన్నారు. మిగులు జలాలు కాకుండా నికర జలాలను కేటాయించాలని, పోలవరం నుం చి 72 టీఎంసీల నీరు అదనంగా హంద్రీ- నీవాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం పునరాలోచన చేయాలి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడు తూ ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీకృష్ణ కమిటీ కూడా విభజన జరి గితే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని కేంద్రానికి స్పష్టంగా నివేదిక ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించి అన్ని విధాలా వెనుకబడి న సీమకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాయలసీమను అభివృ ద్ధి చేయకుండా ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడం పా లకుల నిర్లక్ష్యానికి దర్పణమన్నారు. 1956లో ఆం ధ్ర రాష్ట్ర ఆవతరణ సందర్భంగా జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడంలో పాలకులు విఫలం చెందారని ఆరోపించారు. నాయకుల తీరుతో పూర్తికాని హంద్రీ-నీవా రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ కేవలం కొందరు పనికిమాలిన రాజకీయ నాయకుల వల్ల హంద్రీ- నీవా ఇప్పటి వరకు పూర్తి కాలేదని దుయ్యబట్టారు. ఒకప్పుడు దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మదనపల్లె ప్రస్తుతం కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేసారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ప్రత్యేక రాయల సీమ కోసం ఉద్యమం ఎందుకు చేయలేదని మేధావులను ప్రశ్నించారు. మదనపల్లెను రాజధాని చేయాలని ఎందుకు అడగకూడదని, ఇప్పటికైనా అందరూ స్పందించి ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నీరు, సంస్కృతి లేనిదే నాగరికత లేదనే విషయాన్ని గుర్తుంచుకొ ని ప్రజలు ఉద్యమించాలని కోరారు. క మ్యూనిస్టులు కూడా మన ప్రాంతానికి తీరని అన్యాయం చేశారన్నారు.