- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
మదనపల్లె: రాయలసీమలో రాజధాని నిర్మిస్తేనే అన్ని రంగాల్లో వెనుకబడిన సీమ నిజమైన అభివృద్ధి సాధిస్తుందని పలువురు వక్తలు, మేధావులు అభిప్రాయపడ్డారు. ‘రాయలసీమ వెనుకబాటుతనం, కొత్తరాజ ధాని ఏర్పాటు’ అనే అంశంపై ఆదివారం స్థానిక దేశాయ్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో వైఎస్.మునిరత్నం, వీ ఎస్.రెడ్డి, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు నరేం ద్ర, అంబేద్కర్‌సేన అధ్యక్షుడు శివప్రసాద్, జెడ్పీటీసీ భాస్కర్, పాల్‌రెడ్డి, కొండయ్య, వెలుగు మో హన్, కౌన్సిలర్ మస్తాన్‌రెడ్డి, మహ్మద్ రఫీ, కామకోటి ప్రసాదరావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ భవానీ ప్రసాద్, జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్ర ముఖులు, మేధావులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
సీమ అభివృద్ధికి ఒక్కటవ్వాలి
తొలుత అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజ న అనంతరం రాయలసీమలో నెలకొంటు న్న సమస్యలపై రాజకీయాలకు, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలి పారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో వెనుకబ డిన రాయలసీమను రతనాల సీమగా అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజధాని విషయంలో సమస్య లేదని రాష్ర్ట విభజన తర్వా త ఈ సమస్య వచ్చిందన్నారు. భాషా సం యుక్త రాష్ట్రానికి రాజధానిగా వున్న హైదరాబాదును పోగొట్టుకోవడం దురదృష్టకరమన్నారు. సీమకు చెందిన ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత ఇద్దరున్నా నీటి వనరులు, ఇతర వాటాల విషయంలో సీమకు అన్యాయం జరి గిందన్నారు. ప్రస్తుతం వున్న హంద్రీనీవా- సుజలస్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితేనే సీమకు గుక్కెడు నీరు దొరుకుతుందన్నారు. మిగులు జలాలు కాకుండా నికర జలాలను కేటాయించాలని, పోలవరం నుం చి 72 టీఎంసీల నీరు అదనంగా హంద్రీ- నీవాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్రం పునరాలోచన చేయాలి
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడు తూ ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీకృష్ణ కమిటీ కూడా విభజన జరి గితే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని కేంద్రానికి స్పష్టంగా నివేదిక ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించి అన్ని విధాలా వెనుకబడి న సీమకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాయలసీమను అభివృ ద్ధి చేయకుండా ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడం పా లకుల నిర్లక్ష్యానికి దర్పణమన్నారు. 1956లో ఆం ధ్ర రాష్ట్ర ఆవతరణ సందర్భంగా జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడంలో పాలకులు విఫలం చెందారని ఆరోపించారు.
నాయకుల తీరుతో పూర్తికాని హంద్రీ-నీవా
రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ కేవలం కొందరు పనికిమాలిన రాజకీయ నాయకుల వల్ల హంద్రీ- నీవా ఇప్పటి వరకు పూర్తి కాలేదని దుయ్యబట్టారు. ఒకప్పుడు దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మదనపల్లె ప్రస్తుతం కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేసారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ప్రత్యేక రాయల సీమ కోసం ఉద్యమం ఎందుకు చేయలేదని మేధావులను ప్రశ్నించారు. మదనపల్లెను రాజధాని చేయాలని ఎందుకు అడగకూడదని, ఇప్పటికైనా అందరూ స్పందించి ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నీరు, సంస్కృతి లేనిదే నాగరికత లేదనే విషయాన్ని గుర్తుంచుకొ ని ప్రజలు ఉద్యమించాలని కోరారు. క మ్యూనిస్టులు కూడా మన ప్రాంతానికి తీరని అన్యాయం చేశారన్నారు.