
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేక అధికార టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్ జగన్ దాటనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు వెళ్లకుండా టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సభకు హజరుకావొద్దని ఏలూరు మండలం చొదిమళ్ల గ్రామస్తులను టీడీపీ నాయకులు బెదిరించారు.
వైఎస్ జగన్ సభకు హాజరైతే ప్రభుత్వ పథకాలు అన్నీ కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అదేవిధంగా ఎస్సీ, బీస్సి, కాపులను సభకు రాకుండా అడ్డుకుంటామంటూ టీడీపీ నేతలు బెదిరింపులు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. టీడీపీ నాయకుల బెదిరింపులపై వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్ అభిమానులు మండిపడుతున్నారు. బెదిరింపులతో ప్రజాభిమానాన్ని అడ్డుకోలేరని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment