
సినీ నటుడు మురళీమోహన్ అరెస్ట్
ఏలూరు: సినీ నటుడు, టీడీపీ నాయకుడు మురళీమోహన్‌ను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 29న ద్వారకాతిరుమలలో అనుమతిలేకుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించినందుకు ఆయనను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు.
మురళీమోహన్‌తోపాటు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీరమణిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిని భీమడోలు కోర్టులో హాజరుపరిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి లోక్సభకు టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే.