టీడీపీలో ఉత్కంఠ | TDP faces uphill task: MLC candidates selection | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఉత్కంఠ

Published Mon, Feb 27 2017 8:12 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

టీడీపీలో ఉత్కంఠ - Sakshi

టీడీపీలో ఉత్కంఠ

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు జిల్లా ఎమ్మెల్యేలతో సోమవారం ఇక్కడ ఇంఛార్జి మంత్రులు అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత  సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.

సత్యనారాయణరాజు, ముళ్లపూడి రేణుక, అంబికా కృష్ణ, సైదు సత్యనారాయణ, దుమ్మేటి సుధాకర్‌, కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లను సమన్వయ కమిటీ పరిశీలిస్తోంది. రెండు సీట్లలో ఒకటి ఓబీసీకి, మరోటి ఓసీకి కేటాయించాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎమ్మెల్యేల కోటాలో మరో సీటు కేటాయించాలని చంద్రబాబును ఎమ్మెల్యేలు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement