దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు చేదు అనుభవం ఎదురయింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్‌లో సమైక్యాంధ్ర సమరభేరీ సభ ఏర్పాటు చేశారు. సమరభేరీ సభకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వేదికపైకి రావొద్దంటూ రైతులు అడ్డుకున్నారు.
దీంతో రైతు సంఘాల నేతలు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. సమైక్యాంధ్ర సమరభేరీ సభకు రైతులు భారీగా తరలివచ్చారు. రైతు సంఘాల నేతలు నాగిరెడ్డి, ఎర్నేని నాగేంద్రనాథ్, మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇటీవలే ప్రభాకర్ పై కేసు నమోదయింది.
ఎమ్మెల్యే చింతమనేనికి చేదు అనుభవం
Published Sun, Sep 22 2013 5:36 PM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement