villegers protest
-
మహిళాకూలీతో అంగన్వాడీ నిర్వహణ
మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని కంచన్‌పల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఓ మహిళా కూలీ టీచర్ అవతారమెత్తారు. కేంద్రంలో టీచర్, ఆయా లేకపోవడంతో ఓ కూలీని పెట్టి కేంద్రం నిర్వహణ కొనసాగించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా, మహిళా కూలీ బెత్తం చేతబట్టుకుని పిల్లలను వారించడాన్ని చూశారు. కూలీతో అంగన్వాడీ కేంద్రం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగా.. అంగన్వాడీ కేంద్రంలో కూలీని పెట్టలేదని, పక్క అంగన్వాడీ కేంద్రానికి ఇన్చార్జ్ ఇచ్చినట్లు సూపర్వైజర్ మల్లమ్మ తెలిపారు. -
యానాదులం..అభివృద్ధిఎరుగం
సాక్షి, కాళ్ల (పశ్చిమగోదావరి) : ఎన్నో ఏళ్లుగా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. ఇప్పటికీ చీకటిలోనే జీవితాలు.. ఇన్నాళ్లూ పరిపాలించిన ప్రభుత్వాలు వారి జీవన విధానంలో ఎటువంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కట్టుకోవడానికి సరైన బట్ట, నివాసం లేక కాలువ, పొలాల గట్ల మీద కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలోని కాళ్ల మండలంలో వీరు ఎక్కువగా ఉన్నారు. కాళ్ల, దొడ్డనపూడి, ఏలూరుపాడు గ్రామాల్లో సుమారు 10 కుటుంబాలు ఈ విధంగానే జీవిస్తున్నాయి. సరైన గూడు లేక ఎండకు ఎండి, వానకు తడుస్తూ కనీసం కరెంటు సౌకర్యం లేకుండా చీకట్లోనే జీవిస్తున్నారు. పొలాల్లో ఎలుకలను, కాలువల్లో చేపలను పట్టుకుని జీవించడం వీరి వృత్తి. కనీసం వీరి పిల్లలు చదువు సంధ్య లేకుండా పొలాలగట్లపై తిరుగుతున్నా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. 20 ఏళ్లుగా కాలువ గట్టునే.. కాళ్ల మండలంలోని దొడ్డనపూడి పంట కాలువ గట్టును ఆనుకుని సుమారు 20 ఏళ్లుగా రావూరి బ్రహ్మం, రావూరి శ్రీను కుటుంబాలు జీవిస్తున్నాయి. కనీసం వీరికి రేషన్‌కార్డులు కూడా లేవు. కొన్నేళ్ల క్రితం వీరు చీకట్లో ఉండటం చూసి విద్యుత్ స్తంభం వేశారు. అయితే ఆ విద్యుత్ స్తంభం పాడైపోయి ఏడాదిన్నర గడుస్తున్నా కరెంటు కనెక్షన్ మాత్రం ఇవ్వలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దిక్కతోచని స్థితిలోనే పాములు, పురుగుల మధ్య కాళం వెళ్లదీస్తున్నామని చెప్పారు. అదే కాలువ గట్లను ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులకు విద్యుత్ ఆగితే నిమిషాల మీద పనిచేసే అధికారులు పేదలు చీకట్లో మగ్గుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామంలో పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు పట్టించుకుని విద్యుత్ లైట్లు వేయాలని, అదే విధంగా రేషన్‌కార్డులు అందించి, సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. -
నారా లోకేశ్‌కు నిరసన సెగ
సాక్షి, నరసాపురం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో బుధవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌ను కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై ఖాళీ బిందెలను ఉంచి నిరసన తెలిపారు. సుమారు 200 కుటుంబాలకు పైగా నివసిస్తున్న తమ కాలనీలో తాగునీటి సదుపాయం లేదని మంత్రి వద్ద ధ్వజమెత్తారు. పూర్తిగా ఉప్పునీటి మయమైన తమ ప్రాంతానికి పక్క గ్రామమైన వేములదీవి నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అవుతున్నప్పటికీ.. అవి కూడా తరచూ పైపులైన్లు పాడై నీరు ఉప్పగా ఉంటుందని చెప్పారు. అదికూడా రెండు రోజులకోసారి కేవలం అరగంట పాటు మాత్రమే ఇస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలు తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. అనంతరం కాన్వాయ్ ముందుకు సాగింది. -
పోలీసుల పల్లె నిద్ర
మోర్తాడ్: ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా పల్లెల్లో నిద్ర చేయడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పోలీసులు ప్రజలతో మమేకమైతు సమస్యల పరిష్కారం కోసం వినూత్న పద్ధతికి అంకురార్పణ చేశారు. జిల్లా పోలీసు బాస్ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపిక చేసిన గ్రామాలలో పోలీసు అధికారులు ఒక రాత్రిపూట బస చేసి శాంతియుత వాతావరణం కల్పించడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. సాధారణంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని హరితహారం కార్యక్రమం అమలు చేసే సమయంలో పంచాయతీరాజ్, రెవెన్యూ, తదితర శాఖ అధికారులు చేపట్టేవారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో అప్పుడప్పుడు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఆరంభించడం ఇది తొలిసారి. వారానికి ఒక గ్రామంలో ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తాజాగా మోర్తాడ్ మండలం వడ్యాట్‌లో నిర్వహించిన పల్లె నిద్రలో భీమ్‌గల్ సీఐ సైదయ్య, మోర్తాడ్ ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడలో నిర్వహించిన పల్లె నిద్రలో ఎస్ఐ ప్రభాకర్ పాల్గొన్నారు. సమస్యలను తెలుసుకుంటున్నం ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. పల్లె నిద్ర వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పల్లె నిద్ర వల్ల గ్రామంలోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేసే అవకాశం ఉంది. – సురేశ్, ఎస్ఐ, మోర్తాడ్ -
మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్ లో ఉద్రిక్తత
మెదక్: మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి పంట భూములను ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకర్తిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో భాగంగా ఆయన పంట పొలాలపై దాడులు చేశారు. గ్రామస్తులు విధ్వంసానికి దిగారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.