నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
– ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు నగరంలో నెలకొన్న తాగునీడి ఎద్దడిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరకోనున్నట్లు తెలిపారు. అనంతరం 10.30 గంటల నుంచి భారీ ధర్నాను నిర్వహించనున్నామని, కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జీలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో పక్కనే నదులు పారుతున్న చుక్కనీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.