కాకినాడ శివారు ప్రాంతాల్లో కష్టాలివీ...
గత ఏడాది కాంట్రాక్టర్లకు బకాయిలు రూ.75 లక్షలు ఈ ఏడాది రూ.93 లక్షలు అవసరమని అధికారులు అంచనాజిల్లాలో చెరువులు నింపేందుకు రూ.20 లక్షలు అవసరంవీటితోపాటు జిల్లాలో 101 పంపులు మరమ్మతులకు రూ.17 లక్షల అంచనా .ప్రస్తుత ఎండాకాలం గట్టెక్కాలంటే రూ.1.30 కోట్లు అవసరం. 141 శివారు ప్రాంతాల్లో కటకట
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): జిల్లాలో మార్చి ఆరంభం నుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. జిల్లాలో 1096 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో 193 గ్రామాల్లో మంచినీటి కొరత పీడిస్తోందని అధికారులు గుర్తించారు. వీటితోపాటు 141 శివారు ప్రాంతాలు నీటికోసం కటకటలాడుతున్నాయి. ఆయా గ్రామాలు, శివారు ప్రాంతాలకు ప్రతిరోజూ మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటì సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మంచినీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు రూ.75 లక్షల బిల్లులు మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం సరఫరా చేసేందుకు ముందుకు రావడంలేదు. సుమారు 4,534 ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు రూ.93 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మంచినీటి చెరువులు నింపేందుకు రూ.20 లక్షలు అవసరం. వీటితోపాటు జిల్లాలో 101 పంపులు మరమ్మతులకు రూ.17 లక్షలు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఎండాకాలం గట్టెక్కాలంటే రూ.1.30 కోట్లు అవసరం.
తలలు పట్టుకుంటున్న అధికారులు...: గ్రామాల్లో చాలా వరకు చేతిపంపులు కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో మంచినీటి కష్టాలు మరింత పెరిగాయి. మరికొన్ని గ్రామాల్లో మంచినీటి బావులు సైతం అడుగంటిపోవడంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. సరాసరి రోజుకి 50 నుంచి 70 లీటర్ల వరకు మంచినీరు సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం చాలా గ్రామాల్లో 20 లీటర్లు కూడా మంచినీరు సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. గ్రామాల్లో కూడా రక్షిత మంచినీరు లభించకపోవడంతో మినరల్ వాటర్ ప్లాంట్ల ద్వారా మంచినీటిని కొనుగోలు చేసుకుని తాగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కానరాని ఎన్టీఆర్ సుజల పథకం...
ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా గతంలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ అవి మూతపడ్డాయి. జిల్లాలో సుమారు 300ల పైగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల పథకాలు 70లోపు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వం వీటికి నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులు మూసివేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment