ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి, ఎండలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మద్యం ధరల పెంపు ప్రతిపాదనలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
వాణిజ్య పన్నుల శాఖ చట్టాల్లోని మార్పులపై కేబినెట్ చర్చించనుంది. తాత్కాలిక సచివాలయం టెండర్లపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి పునర్ నిర్మాణం, జన్మభూమి కమిటీలపైనా కేబినెట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.