ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ నీరు వారం, పది రోజులకోసారి సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వేకువనే కాలినడకన వెళ్లి తెచ్చుకోవలసిన దుస్థితి.
పూనగూడ గ్రామస్తులు ఎడ్లబండిపై నాలుగైదు కి.మీ. దూరంలోని చెరువు, బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారం వేకువజామున కనిపించిన దృశ్యాలివి. – ఆదిలాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment