
కేప్‌టౌన్: టెస్టు సిరీస్‌లో పేస్ బౌలింగ్‌తో భారత్‌ను బెంబేలెత్తించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికాకు తొలి మ్యాచ్‌లోనే సంకట స్థితి ఎదురవుతోంది. రెండేళ్ల క్రితం భారత గడ్డపై టెస్టు సిరీస్‌లో స్పిన్ దెబ్బకు చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా ప్రతీకారం సంగతేమో కానీ చివరకు పిచ్ భారత్‌కు అనుకూలంగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు! తొలి టెస్టు జరిగే ఈ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర నీటికొరత ఉంది. నీటి వాడకం తక్కువగా ఉంటే పిచ్‌ను పేస్, బౌన్స్‌కు అనుకూలంగా తీర్చి దిద్దడం చాలా కష్టంగా మారిపోతుంది. చివరకు వికెట్ పొడిగా మారి స్పిన్ బాగా ప్రభావం చూపించవచ్చు. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి జరిగే తొలి టెస్టు కోసం పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు క్యురేటర్‌కు కష్టంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment