
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవడానికి భారత్‌కు ఇదే మంచి అవకాశమని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. ‘ మేము మంచి క్రికెట్ ఆడటంపైనే దృష్టి పెట్టాం. అద్బుత ప్రదర్శన కనబరుస్తాం. దక్షిణాఫ్రికా మంచి ఫామ్‌లో ఉన్న జట్టని, మంచి పేస్ బలం ఉందని తెలుసు. తేలికగా తీసుకోం. మా సాయశక్తుల పోరాడి గెలుస్తామని ఓ జాతీయ చానెలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే పేర్కొన్నాడు.
వైస్ కెప్టెన్‌గా ఒత్తిడేమైనా ఉందా..
’ఆ బాధ్యతను తీసుకోవడానికి చాల ఇష్టపడుతాను. బ్యాటింగ్, ఫీల్డింగ్ ఏ ఆవకాశమైన గొప్పగా భావిస్తా. నేను మాములుగా కష్టపడే స్వభావిని. వైస్ కెప్టెన్‌గా చాలెంజ్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. నా దేశ కోసం నేను మ్యాచ్ విన్నర్ కావాలని ప్రతిసారి కోరుకుంటా. అది టెస్ట్, వన్డే, టీ20 ఏదైనా సరే’. అని సమాధానం ఇచ్చాడు.
నెట్ బౌలర్స్‌ను ఎంపికపై స్పందిస్తూ..
‘ఇది చాలా మంచి నిర్ణయం. మన దగ్గర మంచి నాణ్యమైన బౌలర్లున్నారు. డొమెస్టిక్ క్రికెట్‌లో వారు అద్బుతంగా రాణించారు. వీరు పేస్ బౌలింగ్ ఎదుర్కోవడంలో బ్యాట్స్‌మెన్‌కు ఉపయోగపడుతారు. కొన్నిసార్లు ఓవర్సీస్ ప్రాక్టీస్ గేమ్‌లో ఆర్డినరీ బౌలర్లతో ఆడాల్సి వస్తది. వారు ఏవిధమైన సన్నహానికి ఉపయోగపడరు. మెనేజ్‌మెంట్ తీసుకున్నఈ నిర్ణయంతో నాణ్యమైన నెట్ ప్రాక్టీస్ అందుతోంది.’ అని రహానే మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ప్రశంసించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ 3 టెస్టులు, 6 వన్డేలు, 3టీ20లు ఆడనుంది. జనవరి 5 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment