టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో చేదు అనుభవం ఎదురైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేనను 46 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ.. భారత బ్యాటర్ల వైఫల్యానికి, రహానే పోస్ట్‌కి సంబంధం ఏమిటంటారా?!
రహానేకు అప్ప ట్లో పిలుపు
టీమిండియా టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా వెలుగు వెలిగిన రహానేకు ప్రస్తుతం జట్టులో చోటు కరువైంది. అయితే, ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టడంతో మళ్లీ భారత జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడిన జట్టులో స్థానం సంపాదించాడు.
తన విలువ చాటుకున్నాడు
ఇంగ్లండ్ గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విఫలం కాగా రహానే 89, 46 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఏకంగా మరోసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, విండీస్‌లో పేలవ ప్రదర్శన కారణంగా రహానేకు మళ్లీ అవకాశాలు రాలేదు.
రంజీ, ఇరానీ కప్ గెలిచిన సారథి
ప్రస్తుతం అతడు దేశవాళీ టోర్నీలతో బిజీగా ఉన్నాడు. ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే గతేడాది ఆ జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు ఇరానీ కప్-2024 ట్రోఫీ కూడా గెలిచాడు. ప్రస్తుతం మళ్లీ రంజీ 2024-25 సీజన్‌తో బిజీగా మారాడు. అతడి సారథ్యంలోని ముంబై తమ మొదటి మ్యాచ్‌లో బరోడా చేతిలో ఓడిపోయింది.
స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా
ఈ క్రమంలో అక్టోబరు 18 నుంచి తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా రహానే సేన మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం రహానే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం షేర్ చేస్తూ.. ‘‘స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అంటూ గ్రీన్‌టిక్ బాక్స్‌లో రైట్ గుర్తు ఉన్న ఎమోజీ పోస్ట్ చేశాడు.
‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్
ఇక అదే సమయంలో టీమిండియా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ రెండింటినీ ముడిపెడుతూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్.. ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేయాలో బాగా తెలుసు. నువ్వు టీమిండియా రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నావని సంకేతాలు ఇస్తున్నావు కదా!
అసలే ఆస్ట్రేలియా పర్యటన ముందుంది మరి!’’ అని రహానే క్యాప్షన్‌కు తమ భాష్యాలు ఆపాదిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే నాటి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
చదవండి: Ind vs NZ: తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment