సఫారీలదే పైచేయి! | south africa leads 142 runs second day  test match | Sakshi
Sakshi News home page

సఫారీలదే పైచేయి!

Published Sat, Jan 6 2018 9:47 PM | Last Updated on Sat, Jan 6 2018 9:47 PM

south africa leads 142 runs second day  test match - Sakshi

కేప్‌టౌన్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. తొలుత 77 పరుగుల మొదటి ఇన‍్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పొయింది. క్రీజ్‌లో ఆమ్లా(4), రబడ(2) ఉన్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు డీన్‌ ఎల్గర్‌(25), మక్రమ్‌(34) అవుట్‌ అయ్యారు. పాండ్య రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. 28/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన విరాట్‌ సేన.. మరో 181 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది.  టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్‌ పాండ్యా(93;95 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్పర్‌) బాధ్యతాయుతంగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ హార్దిక్‌ పాండ్యా దూకుడుగా ఆడాడు. తొలుత 46 బంతుల్లో 10 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేసిన హార్దిక్‌..ఆపై కూడా అదే తరహాలో ఆడాడు. అయితే సెంచరీకి ఏడు పరుగుల దూరంలో పాండ్యా తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో పాండ్యా సెంచరీ చేస్తాడనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

మరొకవైపు చివరి వరుస ఆటగాడు భువనేశ్వర్‌ కుమార్‌(25;86 బంతుల్లో 4 ఫోర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ క‍్రమంలోనే పాండ్యాతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తరువాత భువీ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. భువీ, పాండ్యాలు ఎనిమిది పరుగుల వ్యవధిలో అవుట్‌ కావడంతో టీమిండియా రెండొందల పరుగుల మార్కును అతికష్టం మీద చేరుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్‌, రబడాలు చెరో మూడు వికెట్లు సాధించగా, డేల్‌ స్టెయిన్‌, మోర‍్నీ మోర్కెల్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement