బర్మింగ్‌హమ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లండ్‌ల తొలి టెస్టు బుధవారం ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే లక్ష్యంగా పెట్టుకోవాలని పలువురు సూచనలిస్తున్నారు. ప్రస్తుతమున్న బ్యాట్స్‌మెన్‌లో ప్రతిభ ఆధారంగా చూస్తే కోహ్లి విశేషంగా రాణించే అవకాశం ఉండటంతో అతణ్ని కట్టడి చేస్తే పరుగులను అదుపు చేయవచ్చని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లికి బంతులు సంధించే క్రమంలో కసిగా విసరాలని సూచించాడు.
‘కసిగా ఉండండి, విరాట్ కోహ్లిని సవాల్ చేయండి. స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ రంగంలోకి దిగి విరాట్ కోహ్లిని అడ్డుకోవాలి. జో రూట్ తన బృందంతో మాట్లాడి వారిలో కసి నింపాలి. అవసరమైతే ఒక్కొక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడాలి. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు కోహ్లి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాలి. అతడు ఫ్రంట్ ఫుట్ ఆడకుండా సవాల్ చేయాలి. బంతుల్ని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వైపు విసరాలి’ అని వాన్ పేర్కొన్నాడు. ప్రధానంగా బంతి నేరుగా వికెట్లు వైపు విసిరి బంతి దూరంగా పోతుందా లేదా అని సందేహ పడేలా చేస్తే కోహ్లిని తొందరగానే పెవిలియన్ పంపవచ్చాన్నాడు. దాంతో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం దక్కుతుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment