బ్రిటిష్ ఐటి కంపెనీ ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ తన వ్యాపార భాగస్వామి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ బీఎస్ఎల్ తో విలీనమైంది. ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఆర్ఎస్కె గుర్గావ్ కు చెందిన భారతీయ కంపెనీతో విలీనమై ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ గా అవతరించింది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు కన్సల్టెన్సీ సర్వీసులను సంయుక్తంగా అందించనున్నట్టు పేర్కొన్నాయి.
ఈ విలీనం పట్ల రెండు కంపెనలు సంతోషం వ్యక్తం చేశాయి. తమ వ్యాపార అభివృద్ధి, ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి ఉపయోగాలని అభిలషించారు. తమ సేవల విస్తృతికి, నూతన, ప్రస్తుత ఖాతాదారులకు, హై లెవల్ కస్టమర్ సర్వీసు, అధిక నాణ్యతతో కూడిన ఔట్ పుట్ ఇవ్వడానికి తమ విలీనం దోహదపడుతుందని నూతన యాజమాన్య సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డానీ బర్డ్ తెలిపారు తమ విలీనం మెరుగైన సేవలకు, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రవీణ్ జోషి చెప్పారు. ఆన్ సైట్ కన్సల్టెన్సీ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్సేవలను ఆర్ఎస్ కె ,టెక్నికల్ రిపోర్సెస్, బ్యాక్ ఆఫీస్ సేవలు, రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ రంగాల్లో బీఎస్ లిమిటెడ్ సేవలు అందించింది. యూకే, యూరోపియన్, అమెరికా మార్కెట్లలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అలాగే ఈ కొత్త పరిణామం నేపథ్యంలో సిబ్బంది ఉద్యోగ ఒప్పందాలు, నిబంధనలు, ఖాతాదారుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించాయి.
భారత కంపెనీలో విదేశీ ఐటి సంస్థ విలీనం,
Published Tue, Jun 21 2016 2:38 PM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM
Advertisement