Indian software company
-
అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం!
అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా సాగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరిలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రముఖులు సైతం ఉన్నారు. భారతీయ సాఫ్ట్వేర్ సంస్థ జోహో చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ వెంబు కుటుంబంతోపాటు ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఒక రోజు ముందే అయోధ్యకు చేరుకున్నారు. కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న సుమారు 500 మంది స్టేట్ గెస్ట్స్ లిస్ట్‌లో శ్రీధర్ వెంబు కూడా ఉన్నారు. తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్న ఆయన తమకు కలిగిన భక్తి పారవశ్యాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్ తన అమ్మ జానకి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్నానని ‘ఎక్స్’(ట్విటర్)లో శ్రీధర్ వెంబు తెలియజేశారు. ‘అమ్మ శ్రీరామునికి జీవితాంతం భక్తురాలు. అయోధ్యను దర్శించడం గొప్ప అదృష్టం. జై శ్రీరామ్’ అని పేర్కొంటూ తల్లి, కుటుంబ సభ్యులతో అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు. In Ayodhya with my amma Janaki and my brother Kumar and his wife Anu. Amma is a life-long devotee of Lord Shri Ram. Very blessed to be here. Jai Shri Ram 🙏🙏🙏 pic.twitter.com/gwFIE8mZJb — Sridhar Vembu (@svembu) January 21, 2024 -
భారత కంపెనీలో విదేశీ ఐటి సంస్థ విలీనం
బ్రిటిష్ ఐటి కంపెనీ ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ తన వ్యాపార భాగస్వామి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ బీఎస్ఎల్ తో విలీనమైంది. ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఆర్ఎస్కె గుర్గావ్ కు చెందిన భారతీయ కంపెనీతో విలీనమై ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ గా అవతరించింది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు కన్సల్టెన్సీ సర్వీసులను సంయుక్తంగా అందించనున్నట్టు పేర్కొన్నాయి. ఈ విలీనం పట్ల రెండు కంపెనలు సంతోషం వ్యక్తం చేశాయి. తమ వ్యాపార అభివృద్ధి, ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి ఉపయోగాలని అభిలషించారు. తమ సేవల విస్తృతికి, నూతన, ప్రస్తుత ఖాతాదారులకు, హై లెవల్ కస్టమర్ సర్వీసు, అధిక నాణ్యతతో కూడిన ఔట్ పుట్ ఇవ్వడానికి తమ విలీనం దోహదపడుతుందని నూతన యాజమాన్య సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డానీ బర్డ్ తెలిపారు తమ విలీనం మెరుగైన సేవలకు, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రవీణ్ జోషి చెప్పారు. ఆన్ సైట్ కన్సల్టెన్సీ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్సేవలను ఆర్ఎస్ కె ,టెక్నికల్ రిపోర్సెస్, బ్యాక్ ఆఫీస్ సేవలు, రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ రంగాల్లో బీఎస్ లిమిటెడ్ సేవలు అందించింది. యూకే, యూరోపియన్, అమెరికా మార్కెట్లలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అలాగే ఈ కొత్త పరిణామం నేపథ్యంలో సిబ్బంది ఉద్యోగ ఒప్పందాలు, నిబంధనలు, ఖాతాదారుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించాయి.