అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! | Ayodhya Ram Mandir Inauguration | Amma Is Lifelong Ram Devotee: Zoho CEO Sridhar Vembu Visits Ayodhya With Family - Sakshi
Sakshi News home page

Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం!

Published Mon, Jan 22 2024 2:42 PM | Last Updated on Mon, Jan 22 2024 5:19 PM

Amma is lifelong Ram devotee Zoho CEO at Ayodhya - Sakshi

అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా సాగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరిలో ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ వంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రముఖులు సైతం ఉన్నారు.

భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ వెంబు కుటుంబంతోపాటు ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఒక రోజు ముందే అయోధ్యకు చేరుకున్నారు. కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న సుమారు 500 మంది స్టేట్‌ గెస్ట్స్‌ లిస్ట్‌లో శ్రీధర్‌ వెంబు కూడా ఉన్నారు. తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్న ఆయన తమకు కలిగిన భక్తి పారవశ్యాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: బంపరాఫర్‌.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్‌

తన అమ్మ జానకి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్నానని ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో శ్రీధర్‌ వెంబు తెలియజేశారు. ‘అమ్మ శ్రీరామునికి జీవితాంతం భక్తురాలు. అయోధ్యను దర్శించడం గొప్ప అదృష్టం. జై శ్రీరామ్’ అని పేర్కొంటూ తల్లి, కుటుంబ సభ్యులతో అక్కడ దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement