merges
-
కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల
సాక్షి, న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా షర్మిల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, ఏఐసీసీ సీనియర్ నేత కొప్పుల రాజుతోపాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పలువురు వైఎస్సార్టీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, షర్మిలకు కండువా కప్పిన అనంతరం బ్రదర్ అనిల్‌కు సైతం ఖర్గే కండువా కప్పేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా నిరాకరించారు. షర్మిల సైతం తాను ఒక్కదానినే చేరుతున్నట్లు పేర్కొనగా మరి వేదికపైకి మీరెందుకు వచ్చారని ఖర్గే నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో షర్మిల దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యున్నతికి పనిచేస్తా... కాంగ్రెస్‌లో చేరడంపట్ల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తన తండ్రి కల అని.. ఆ కల నెరవేర్చేందుకు, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తా నని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు తాను మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు. కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారా లేక ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశిస్తే అండమాన్ నుంచైనా పోటీకి సిద్ధమని షర్మిల ప్రకటించారు. మరో రెండ్రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు ఏపీలో షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. -
ఇక ట్విటర్ కనిపించదు.. ఎందుకంటే?
ట్విటర్ కంపెనీని ఎలన్ మస్క్ సొంత చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలే! లెక్కకు మించిన ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. లోగో విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. పక్షి స్థానంలో కుక్కను.. కుక్క స్థానంలో పక్షిని చూపించి వినియోగదారులను సైతం కన్ఫ్యుస్ చేసేసారు. అయితే ఇప్పుడు ఏకంగా ట్విటర్ మాయం కానున్నట్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, ట్విటర్‌ను ఎక్స్ అనే 'ఎవ్రీథింగ్ యాప్'లో విలీనం చేసినట్లు సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించినట్లు తెలుస్తోంది. మంగళవారం ట్విటర్ బాస్ ఎలోన్ మస్క్ ఈ పరిణామాన్ని ధ్రువీకరించే ఉద్దేశంతో ‘ఎక్స్’ ఒకే అక్షరాన్ని ట్వీట్ చేశారు. మస్క్ ట్వీట్ చేసిన ఈ ఒక్క అక్షరం దేనిని సూచిస్తుందనే మీద సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇది ట్విటర్ విలీనం కానున్న X Corp కంపెనీ అని భావిస్తున్నారు. ట్విటర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే, ఎక్స్ యాప్‌కు సంబంధించిన ప్రణాళికలను మస్క్ వెల్లడించారు. గతంలో ఎక్స్ యాప్ అనేది నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళిక అని, దీని రూపకల్పనను వేగవంతం చేసేందుకు ట్విటర్ చాలా ఉపయోగపడుతుందని, ట్విటర్‌ను కొనుగోలు చేస్తే ఎక్స్ కంపెనీ ఏకంగా మూడు నుంచి ఐదు ఏళ్ళు ముందుకు సాగుతుందని అక్టోబర్ 2022లో ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు నిజం కానుంది. (ఇదీ చదవండి: పేరుకే యూట్యూబర్! నెల సంపాదన రూ. కోటి కంటే ఎక్కువ..) చైనాలో అందుబాటులో ఉన్న వీచాట్ మాదిరిగానే మెసేజింగ్, కాలింగ్ వంటి అనేక కార్యక్రమాలు ఒకే యాప్‌లో చేసుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే మా లక్ష్యం అని మస్క్ వెల్లడించారు. నిజానికి 1999లో ఈయన ఎక్స్ పేరుతో ఒక ఆన్లైన్ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆ తరువాత దానిని పేపాల్‌లో విలీనం చేశారు. ఆ తరువాత ఎక్స్.కామ్ కొనుగోలు చేశారు, ప్రస్తుతం ట్విటర్‌ను కొత్త సూపర్ యాప్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. X — Elon Musk (@elonmusk) April 11, 2023 -
టెలికంలో రాంగ్ సిగ్నల్స్..!
సాక్షి, బిజినెస్ విభాగం: లాభాలొస్తాయి.. సంపాదించుకోవచ్చు కదా అని ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే..!! లాభాల సంగతేమో కానీ.. టెలికం కంపెనీలకు పెట్టుబడే పోయేట్లుంది!!. ఒకటి కాదు... రెండు కాదు... దేశీ టెలికంలోకి ప్రవేశించిన విదేశీ కంపెనీలు చాలావరకూ చాప చుట్టేస్తున్నాయి. వాటి కార్యకలాపాలకు మంగళం పాడేసి ఇంటికెళ్లిపోతున్నాయి. కొన్నాళ్లుగా టెలికం పరిశ్రమలో జరుగుతున్న విలీనాలు గమనిస్తే ఈ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఏదో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని వచ్చిన విదేశీ సంస్థలు.. ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లపై గట్టిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. చేతులు కాలి... పెట్టిన పెట్టుబడులను సైతం వదులుకోవాల్సిన పరిస్థితి. రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్, నార్వేకు చెందిన టెలినార్, మలేసియాకు చెందిన మాక్సిస్, జపాన్‌కు చెందిన ఎన్టీటీ డొకొమో వంటి కంపెనీలు టెలికంలోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నాయి. రూ.23,000 కోట్లకు రూ.420 కోట్లు.. రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ కంపెనీ ఎంటీఎస్ బ్రాండ్‌తో 2010లో భారత్‌లో సీడీఎంఏ (కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్) సర్వీసులను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటుకు దాదాపు రూ.22,750 కోట్లు (3.5 బిలియన్ డాలర్లు) ఖర్చుపెట్టింది. తగిన కస్టమర్లు రాక... ఆశించిన వ్యాపారం జరక్క... ఇప్పుడిది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో (ఆర్‌కామ్) విలీనం అవుతోంది. చాలావరకూ అనుమతులు ఇప్పటికే వచ్చాయి కూడా. దీని ప్రకారం.. 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌తో సహా సిస్టెమా కార్యకలాపాలన్నీ ఆర్‌కామ్ చేతికి వెళ్తాయి. విలీనాంతరం సిస్టెమాకు ఆర్‌కామ్‌లో 10 శాతం వాటా వస్తుంది. ప్రస్తుత ఆర్‌కామ్ మార్కెట్ క్యాప్ ఆధారంగా చూస్తే ఈ వాటా విలువ కేవలం రూ.420 కోట్లు. టెలినార్‌కు మిగిలిందేమీ లేదు.. నార్వేకు చెందిన టెలినార్ (ఒకప్పుడు యూనినార్) కూడా భారత్‌లో తన ఇన్వెస్ట్మెంట్లను కోల్పొయింది. ఇది తన ఇండియాలో దాదాపు రూ.19,515 కోట్లు (3 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసింది. భాగస్వామి యూనినార్ చేతులెత్తేయటంతో కొన్నాళ్లు సొంతగానే వ్యాపారం చేసింది. చివరికిది తన వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించింది. ఈ డీల్ ఇటీవలే పూర్తయ్యింది. ఇక్కడ టెలినార్‌కు ఎయిర్టెల్ నుంచి ఎలాంటి నగదు లభించలేదు. అయితే ఎయిర్టెల్.. టెలినార్‌కు చెందిన రూ.1,650 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించడానికి అంగీకరించింది. టెలినార్ తన రుణ బాకాయిలను చెల్లించనుంది. వొడాఫోన్ కష్టాలు.. యూకేకు చెందిన వొడాఫోన్‌కు కూడా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. దీనికి ఐడియా సెల్యులర్కి మధ్య విలీనం ఒప్పందం కుదిరింది. విలీనాంతం ఏర్పడే కంపెనీ భారత్‌లోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవిస్తుంది. నిజానికి వొడాఫోన్ పదేళ్ల క్రితం హచిసన్–ఎస్సార్ వాటా కొనుగోలుకు 10.9 బి. డాలర్లను వెచ్చించింది. ప్రస్తుత ఫారెక్స్ రేట్ల ప్రకారం దీని విలువ రూ.71,000 కోట్లు. 2007 నాటి ఫారెక్స్ రేట్ల ప్రకారం చూసినా ఇది రూ.47,000 కోట్లు. వొడాఫోన్ భారత్‌లో మొత్తంగా రూ.1,50,000 కోట్లు వెచ్చించినట్లు అంచనా. ఇక 2016లో మళ్లీ కొత్తగా రూ.47,700 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇటీవల ఐడియాతో విలీనం సందర్భంగా వొడాఫోన్ ఎంటర్ప్రైజ్ విలువను దాదాపు రూ.82,800 కోట్లుగా లెక్కించారు. అంటే లక్ష కోట్లకుపైగా గాల్లో కలిసిపోయాయన్న మాట!!. దిక్కు తోచని మాక్సిస్.. మాలేసియా కంపెనీ మాక్సిస్ మాత్రం ఇపుడు ఆయోమయంలో ఉంది. దీనికి ఎయిర్‌సెల్‌లో 74 శాతం వాటా ఉంది. భారత్‌లో ఇది ఇప్పటిదాకా దాదాపు రూ.47,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ సంస్థ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం 2017 క్యూ1లో ఏకంగా 32 శాతానికి పైగానే తగ్గింది. దీనికి కారణం జియో. దీంతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఆర్‌కామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ ఒప్పందం రద్దయ్యింది. దీంతో మరిన్ని నిధుల కోసం ప్రయత్నిస్తోంది. కాగా రుణ భారాన్ని తగ్గించుకోవడానికి గతేడాది ఎయిర్‌టెల్‌తో స్పెక్ట్రమ్ డీల్ కుదుర్చుకుంది. దీని ద్వారా రూ.3,500 కోట్లు పొందింది. అయినా కూడా ఎయిర్‌సెల్‌కు రూ.15,500 కోట్లకుపైగా రుణ భారం ఉంది. డొకొమోకు 1.3 బిలియన్ డాలర్లు నష్టం!! టాటా డొకొమో గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. టాటా సన్స్, జపాన్‌కు చెందిన ఎన్టీటీ డొకొమో కలిసి 2008లో టాటా డొకొమో వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చౌక ధరలకే డేటా, కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఈ కంపెనీ.. స్వల్ప కాలంలోనే అధిక యూజర్లకు చేరువైంది. కానీ తర్వాత నెట్వర్క్ కవరేజ్ లోపాలు, ఇష్టానుసార డిడక్షన్లు వల్ల డొకొమోపై ప్రతికూల ప్రభావం పడింది. జియో రాకతో పరిస్థితి మరింత దారణంగా మారింది. చేసేదేమీలేక ఎన్టీటీ డొకొమో తన వాటాను టాటా సన్స్‌కు విక్రయించింది. ఈ వెంచర్లో ఎన్టీటీ డొకొమోకు 1.3 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక టాటా టెలీ మొబైల్ వ్యాపారాన్ని దాదాపు ఉచితంగా ఎయిర్‌టెల్‌కు ఇచ్చేసేందుకు ఇటీవలే టాటాలు డీల్ కుదుర్చుకోవడం టెలికం సమస్యలకు అద్దంపడుతోంది. 4.5 లక్షల కోట్ల రుణ భారం విదేశీ సంస్థలే కాదు. దేశీ టెలికం రంగం పరిస్థితులు కూడా అంత ఆశాజనంగా ఏమీ లేవు. టెలికం పరిశ్రమ రుణ భారం 4.5 లక్షల కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే మూలధనంపై రాబడి 1 శాతంగా ఉంది. కంపెనీలు వాటి డబ్బుల్ని భారత టెలికం రంగంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం ఉత్తమనేది మార్కెట్ విశ్లేషకుల మాట!!. -
భారత కంపెనీలో విదేశీ ఐటి సంస్థ విలీనం
బ్రిటిష్ ఐటి కంపెనీ ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ తన వ్యాపార భాగస్వామి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ బీఎస్ఎల్ తో విలీనమైంది. ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఆర్ఎస్కె గుర్గావ్ కు చెందిన భారతీయ కంపెనీతో విలీనమై ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ గా అవతరించింది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు కన్సల్టెన్సీ సర్వీసులను సంయుక్తంగా అందించనున్నట్టు పేర్కొన్నాయి. ఈ విలీనం పట్ల రెండు కంపెనలు సంతోషం వ్యక్తం చేశాయి. తమ వ్యాపార అభివృద్ధి, ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి ఉపయోగాలని అభిలషించారు. తమ సేవల విస్తృతికి, నూతన, ప్రస్తుత ఖాతాదారులకు, హై లెవల్ కస్టమర్ సర్వీసు, అధిక నాణ్యతతో కూడిన ఔట్ పుట్ ఇవ్వడానికి తమ విలీనం దోహదపడుతుందని నూతన యాజమాన్య సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డానీ బర్డ్ తెలిపారు తమ విలీనం మెరుగైన సేవలకు, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆర్ఎస్కె బిజినెస్ సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రవీణ్ జోషి చెప్పారు. ఆన్ సైట్ కన్సల్టెన్సీ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్సేవలను ఆర్ఎస్ కె ,టెక్నికల్ రిపోర్సెస్, బ్యాక్ ఆఫీస్ సేవలు, రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ రంగాల్లో బీఎస్ లిమిటెడ్ సేవలు అందించింది. యూకే, యూరోపియన్, అమెరికా మార్కెట్లలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అలాగే ఈ కొత్త పరిణామం నేపథ్యంలో సిబ్బంది ఉద్యోగ ఒప్పందాలు, నిబంధనలు, ఖాతాదారుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించాయి.