స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1858 ఆగస్టు 2 గురించి భారతీయులు ఇప్పటికీ ఈ మాటే అనుకుంటారు! ఆ ముందు ఏడాదే దేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఎవరి మీద తిరుగుబాటు అంటే.. ఆప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న ‘బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ’ మీద. పాలిస్తే బ్రిటన్ పార్లమెంటు పాలించాలి గానీ, వ్యాపారం చేసుకోడానికి ఇండియా వచ్చిన బ్రిటన్ కంపెనీ (ఈస్టిండియా) పాలించడం ఏంటి? ఏంటంటే.. పాలించుకొమ్మని బ్రిటన్ పార్లమెంటే ఈస్టిండియా కంపెనీకి ఆమోదముద్ర వేసింది!
అప్పట్నుంచీ ఇండియాలో ఈస్టిండియాది ఇష్టారాజ్యం అయిపోయింది. సిపాయిల తిరుగుబాటు మొదలయ్యాక, ఇక అది ఆగదని బ్రిటన్ ప్రభుత్వం గ్రహించి భారత పాలనా పగ్గాలను ఈస్టిండియా కంపెనీ నుంచి లాగేసుకుంది. అలా లాగేసుకుని, తను తీసేసుకున్న రోజే ఆగస్టు 2. అంటే ఈస్టిండియా కంపెనీ అనే పెనంలోంచి, బ్రిటన్ అనే పొయ్యిలోకి భారతీయులు వచ్చిపడ్డారు. ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858’ అనే చట్టం ద్వారా ఈ అధికార సంక్రమణ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment