East india company
-
ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది? ‘ఆపరేషన్ రాహత్’ ఘనత ఏమిటి?
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయక నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసే జవాన్ల త్యాగం ఎవరూ వెలకట్టలేనిది. భారత సైన్యానికున్న పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 20 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ హయాంలో 1776లో కోల్‌కతాలో ఇండియన్ ఆర్మీ ఏర్పడింది. 2. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇది సముద్ర మట్టానికి ఐదువేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత సైన్యం ఆధీనంతో ఉంది. 3. హిమాలయాలలోని ద్రాస్, సురు నదుల మధ్య ఉన్న బెయిలీ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన. దీనిని 1982లో భారత సైన్యం నిర్మించింది. 4. అమెరికా, చైనాల తర్వాత భారత సైన్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనికబలగం. 5. ఇతర ప్రభుత్వ సంస్థలలో మాదిరిగా భారత సాయుధ దళాలలో కులం లేదా మతం ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 6. 2013లో ఉత్తరాఖండ్‌లో వరద బాధితులను రక్షించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ రాహత్’ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్. 7. ప్రెసిడెంట్స్ బోర్డ్గార్డ్ అనేది భారత సైన్యంలోని పురాతన సైనిక దళం. ఇది 1773లో స్థాపితమయ్యింది. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉంది. 8. ఎత్తయిన పర్వతప్రాంతాలలో యుద్ధాలకు భారతీయ సైనికులు సమర్థులైనవారిగా గుర్తింపుపొందారు. 9. 1971 డిసెంబర్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారు. ఈ యుద్ధ నేపధ్యంతోనే బాలీవుడ్ సినిమా ‘బోర్డర్’ రూపొందింది. 10. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్మీ. భారతఆర్మీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైనికులను కలిగి ఉంది. 11. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (హెచ్ఏడబ్ల్యుఎస్)ను భారత సైన్యం అత్యుత్తమ సైనిక శిక్షణ కోసం నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి ముందు అమెరికా, ఇంగ్లండ్, రష్యా ప్రత్యేక దళాలు ఇక్కడ శిక్షణ పొందాయి. 12. భారతదేశం 1970, 1990లో అణు పరీక్షలను నిర్వహించింది. 13. కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అకాడమీ. 14. భారత సైన్యంలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ఇలాంటి రెజిమెంట్లు మూడు మాత్రమే ఉన్నాయి. 15. తజికిస్థాన్‌లో భారత వైమానిక దళానికి ఔట్-స్టేషన్ ఉంది. తజికిస్థాన్ తర్వాత, ఇప్పుడు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తన అవుట్-స్టేషన్‌ను నిర్మించబోతోంది. 16. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ ఏజెన్సీలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. 17. 1971లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏకంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం చోటుచేసుకున్న అతిపెద్ద లొంగుబాటు ఇదే. 18. పలువురు ప్రముఖులకు సాయుధ దళాల గౌరవ ర్యాంక్‌లు ఇచ్చారు. సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. ఎంఎస్ ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ హోదాను ప్రదానం చేసింది. 19. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల మోవ్ భారతదేశంలోని పురాతన కంటోన్మెంట్లలో ఒకటి. 1840 నుండి 1948 వరకు రెజిమెంట్ ఇక్కడ శిక్షణ పొందింది. 20. 1835లో స్థాపితమైన అస్సాం రైఫిల్స్.. భారత సైన్యంలోని పురాతన పారామిలిటరీ దళం. -
పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు
మణిపూర్ హింసాకాండతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి, సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. అయితే మణిపూర్ ఘటనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినా.. విపక్షాలు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్ర స్వరంతో నినాదాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్, టీఎంసీ సహా విపక్షాలు అన్నీ ఆందోళనకు దిగుతూ.. సభాకార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజూ మంగళవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ ఘటనపై పార్లమెంట్లో విపక్షాలు సృష్టిస్తోన్న రాద్దాంతంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ సహా సీనియర్ నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. చదవండి: జేడీఎస్ భవిష్యత్‌పై పార్టీ అధినేత దేవె గౌడ కీలక వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై విరుచుకుపడ్డారు. కేవలం ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన సక్సెస్ కాలేరని విమర్శించారు. ఉగ్రవాద సంస్థ ‘ఇండియన్ ముజాహిద్దీన్’ లోనూ ఇండియా పేరు ఉందని, బ్రిటీష్ వారి ‘ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మనల్ని దోచుకున్నారని మండిపడ్డారు. దేశం పేరు చెప్పుకొని ప్రజలను తప్పుదోవ పట్టించలేరని దుయ్యబట్టారు. చదవండి: ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం? PM Shri @narendramodi and other senior leaders arrive for the BJP Parliamentary Party Meeting in New Delhi. pic.twitter.com/3Hk6q5wlwa — BJP (@BJP4India) July 25, 2023 విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయని మోదీ విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్షాల వైఖరి చూస్తుంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండాలనే కోరిక లేదన్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయినట్లుగా ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. #WATCH | LoP Rajya Sabha & Congress President Mallikarjun Kharge in Parliament, says, "So many representatives are giving notices under 267 in Parliament. We are talking about Manipur, but the Prime Minister is talking about East India Company" pic.twitter.com/rCpfn8JHPO — ANI (@ANI) July 25, 2023 ఇక ప్రధానిమోదీ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. తాము పార్లమెంట్ సాక్షగా మణిపూర్ సమస్య గురించి మాట్లాడాలని కోరుతుంటూ.. ప్రధాని మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చెబుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో చాలా మంది ప్రతినిధులు నిబంధన 267 కింద నోటీసులు ఇస్తున్నారని, కాబట్టి పార్లమెంట్లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కకుపెట్టి, మణిపుర్ ఘటనపై చర్చ జరగాలన్నారు. ఈ అంశంపై కేవలం అరగంట చర్చ సరిపోదు తెలిపారు. -
బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు. అలాగే వ్యాపారంలోనూ చరుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు. విర్జీ వోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయనను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫైనాన్షియర్ చరిత్రకారుల ప్రకారం.. విర్జీ వోరా 1617 - 1670 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్. 1590లో జన్మించిన విర్జీ వోరా 1670లో మృతి చెందారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు రూ. 80 లక్షలు. అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం. ఆ మేరకు ఆయన ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు. చారిత్రక పత్రికల ప్రకారం.. విర్జీ వోరా మిరియాలు, బంగారం, ఏలకులు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు. 1629 - 1668 మధ్య కాలంలో బ్రిటీష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విర్జీ వోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకున్నారు. అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విర్జీ వోరాదే ఏకైక గుత్తాధిపత్యం. ఉత్పత్తుల మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు. షాజహాన్‌కు అరబ్ గుర్రాలు విర్జీ వోరా వడ్డీ వ్యాపారి కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్‌వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విర్జీ వోరాను ఆశ్రయించినట్లు చెబుతారు. విర్జీ వోరా మొఘల్ రాజు షాజహాన్‌కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని కూడా చరిత్రకారులు పేర్కొంటారు. -
‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!
కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరాని తనం నుండి విముక్తి పొందడానికి మహార్ పీడిత కులానికి చెందిన ఐదు వందలమంది సైనికులు 1818 జనవరి ఒకటవ తేదీ నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున రెండవ బాజీరావు పీష్వా సైన్యంతో భీమానది ఒడ్డున వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. ఈ విజయానికి సూచనగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కోరేగావ్ వద్ద మహార్ అమరవీరుల స్థూపాన్ని నిర్మించి, ఆ స్థూపంపై యుద్ధంలో చనిపోయిన 22 మంది మహార్ వీరుల పేర్లను చెక్కించారు. భీమా నది ఒడ్డున నిర్మించిన మహార్ వీరుల స్మారక విజయ స్తంభాన్ని 1927లో డాక్టర్ అంబేడ్కర్ సందర్శించే వరకు భీమా కోరేగావ్ చరిత్ర... స్వతంత్ర పోరాటం పేరుతో వక్రీకరణకు గురైంది. అక్కడ జరిగిన యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా మరా ఠాలు చేసిన స్వాతంత్య్ర పోరాటంగా కుహనా చరిత్రకారులు చిత్రించారు. నిజానికి చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే... మహార్ వీరులు ఆ యుద్ధంలో తమ పట్ల పీష్వాలు అనుసరిస్తున్న అంటరానితనం, అణచివేతలకు వ్యతిరేకంగా... తమ విముక్తి కొరకే పాల్గొన్నా రనేది వాస్తవం. అంబేడ్కర్ భీమాకోరేగావ్ వద్ద విజయాన్ని మరాఠా పీష్వాల రాజ్యంలో ‘బ్రాహ్మణీయ అణచివేతపై దళిత ఆత్మగౌరవ ప్రతీకగా’ ప్రకటించడంతో అసలు చరిత్ర వెలుగు లోకి వచ్చింది. మరాఠా సామ్రాజ్యంలో నిజానికి పీష్వాలు దళితులపై చేస్తున్న కుల అణచివేత, ఆగడాలు అంతా ఇంతా కాదు. నడుముకు చీపురు, మూతికి ముంత కట్టించారు. దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆయుధాలు నిరాకరించి పశువుల కన్నా హీనంగా చూస్తున్న పీష్వాల పాలనలో పోరాటం తప్పితే మరేమీ మిగల్లేదు. యుద్ధానికి ముందు మహార్ల నాయకుడైన సిఖ్ నాయక్... పీష్వా సైన్యాధికారిని యుద్ధం జరగకుండా ఉండాలంటే... తమను మనుషులుగా గుర్తించి, అంటరానితనం పాటించడం నిలిపివేసి కనీస హక్కులు ఇవ్వాలని అడిగాడు. ‘మీరు యుద్ధం చేసి గెలిచినా కూడా అస్పృశ్యులే, మీ అంటరానితనం పోదు. మీరు ఎప్పుడూ మా కాళ్ళకింద ఉండేవారే’ అని కండకావరంతో సైని కాధికారి మాట్లాడటంతో యుద్ధం అనివార్యమైంది. అత్యంత బలస్థులూ, పోరాట యోధులైన మహర్ యువకులు ఆ మాటలతో ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. రెండు రోజులు కాలినడకన ప్రయాణం చేశారు. వెంట తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి. అయినా ఆకలితో ఉండి కూడా భీమా నది ఒడ్డున 1818 జనవరి ఒకటవ తేదీనాడు 20 వేల అశ్వికదళం, 8 వేల పదాతిదళం కలిగినన పీష్వాల సైన్యంతో పోరాడి విజయం సాధించారు. ఇది ముమ్మాటికీ కుల పీడనపై ‘ప్రతిఘటన’గానే మనం చూడాలి. నేడు కుల వ్యవస్థ ఆధునిక రూపాలు సంతరించుకొని గ్రామాల నుండి పట్టణాల వరకూ, పాఠశాలల నుండి యూని వర్సిటీల వరకూ, చిన్న పని ప్రదేశాల నుండి కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల వరకూ రాజ్యమేలుతోంది. రోజురోజుకు బలోపేతం అవుతున్న హిందూత్వ ఫాసిజం మనుస్మృతిని అధికారికంగా నెలకొల్పే దిశగా పయనిస్తున్నది. దళిత బహుజనుల నీడ, గాలి సోకకుండా వారి మానవ హక్కు లన్నింటినీ నిషేధించిన పీష్వాల అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతి రేకంగా సాగిన భీమా కోరేగావ్ పోరాటాన్ని ఎత్తి పడుతూ అంబేడ్కర్ ఆ పోరాటాన్ని ఆత్మగౌరవ ప్రతీక అని ప్రకటించి, దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు. అనంతరం ఈ దేశ రాజ్యంగంలో దళితులకు హక్కులను పొందుపర్చడంతో పాటు కుల వర్గ పీడన అంతం కావాలని ఆశించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన మహిళలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలతో కూడిన బహుజన సమాజపు విముక్తికై వినూత్న మార్గంలో పోరాడారు. అయినా కొత్త పీష్వాలు అధికారాన్ని చలాయిస్తున్న సందర్భంలో మళ్లీ మనువాదం పూర్తి స్థాయిలో జడలు విప్పుకునే అవకాశం ఉంది. అందుకే బహుజన సమాజం అప్రమత్తతతో ఉండాలి. – కోట ఆనంద్, కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ‘ 96523 57076 (నేడు భీమా కోరెగావ్ పోరాటం జరిగిన రోజు) -
జైహింద్ స్పెషల్: ఈస్టిండియా కుటిల వ్యూహం
భారతావనిని దోచుకోవడంలో పాశ్చాత్యులు ఒకరిని మించి మరొకరు అన్నట్లు వ్యవహరించారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్నప్పటి నుంచే ఆక్రమణల పర్వం పతాక స్థాయికి చేరింది. జాగీరులను సొంతం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్లు పన్నిన కుట్రకు ఒక ప్రత్యక్ష నిదర్శనం ఉదయగిరి (నెల్లూరు జిల్లా) జాగీర్ ఆక్రమణ. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఉదయగిరి నవాబుల వారసురాలు సయ్యద్ ఖాదరున్నీసా బేగం సాక్షి ‘జైహింద్’తో పంచుకున్న ఆనాటి జ్ఞాపకాలివి. దోపిడీకొచ్చిన దొర! ‘‘అవి పందొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లు. భారతదేశంలో రాజ్యాలు, సంస్థానాలు, జాగీర్దార్ల మీద ఈస్ట్ ఇండియా కంపెనీ కన్ను పడటం మొదలైంది. ఒక్కొక్క సంస్థానాన్ని ఏదో ఒక నెపంతో కంపెనీ పాలనలోకి తీసుకోవడం అనే కుట్ర చాపకింద నీరులా ప్రవహిస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో ఉంది ఉదయగిరి దుర్గం. ఆ దుర్గం నవాబుల పాలనలో ఉండేది. జాగీర్దారుగా అబ్బాస్ అలీఖాన్ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో అంటే.. 1803లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉదయగిరి జాగీర్దారుతో ఒప్పందం కుదుర్చుకోడానికి వచ్చింది. చదవండి: జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున స్ట్రాటన్ అనే అధికారి వచ్చాడు. కంపెనీకి ఉదయగిరి జాగీర్ నుంచి ఏడాదికి 53 వేల రూపాయల పేష్కార్ చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు కంపెనీకి చెల్లించడానికి అబ్బాస్ అలీఖాన్ అంగీకరించలేదు. అంతేకాదు.. వాళ్లతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఉద్దేశంతో ఐదువేలు మాత్రమే చెల్లించగలనని చెప్పాడు అలీఖాన్. స్ట్రాటన్ దొర చాలా వ్యూహాత్మకంగా అలీఖాన్ చెప్పిన ఆ ఐదువేల మొత్తానికి అంగీకరించాడు. ఆ ఒప్పందం 1837 వరకు కొనసాగింది. ‘కోటలో కుట్ర’ వదంతి! అత్యంత లాభసాటి రాబడి ఉన్న ఉదయగిరి సంస్థానం మీద నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టి మరల్చనే లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ తర్వాత అనుకోకుండా ఒక ప్రచారం తలెత్తింది. ఆ ప్రచారాన్ని సద్దుమణగనివ్వకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ జాగ్రత్త పడింది. అప్పుడు నెల్లూరు కలెక్టర్ పేరు స్టోన్‌హౌస్. ఉదయగిరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్, అతడి కుమారులు స్టోన్‌హౌస్‌ను హత్య చేయడానికి పథకం రచిస్తున్నారనే వదంతి ఎలా పుట్టిందో తెలియదు, కానీ స్టోన్‌హౌస్ ఆ వదంతిని ఉపయోగించుకున్నాడు. స్టోన్ హౌస్ కుయుక్తితో ఈ పుకారుకి మరింత ఆజ్యం పోస్తూ మద్రాసు ప్రెసిడెన్సీకి ఉత్తరం రాశాడు. ఉదయగిరి కోటలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అభియోగం అందులో ఉంది. కుట్ర జరుగుతోందని, ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రిని సిద్ధం చేస్తున్నారని, అబ్బాస్ కుమారులే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నారనీ..’ రాశాడు. నవాబు నిర్బంధం వివాదాన్ని విచారించే నెపంతో కలెక్టర్ మరితంగా విషయాన్ని క్లిష్టపరుస్తూ 70 మందిని అరెస్ట్ చేయించాడు, మరో 40 మంది మీద నేర విచారణ జరపాల్సిందిగా ఆదేశించాడు. ఇలా రకరకాలుగా జాగీర్దారుల కుటుంబీకులు, సమీప బంధువుల మీద అనేక రకాల కేసులు పెట్టి నానా విధాలుగా బాధలు పెట్టాడు కలెక్టర్. కొందరిని చెంగల్పట్టు జైల్లో, మరికొందరిని సైదాపేట జైల్లో బంధించారు. ఇంట్లో ఉన్న వారికి కానీ, జైల్లో ఉన్న వారికి కానీ ఒకరి సమాచారం మరొకరికి తెలియని స్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబం కకావికలమైంది. ఆంగ్లేయుల మీద పోరాటం సాగించిన ఉదయగిరి దుర్గం చివరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్‌ను చెంగల్పట్టు జైల్లో బంధించారు. ఆయన ఆంగ్లేయుల అధికారానికి తలవంచకుండా, వారి ఆధిపత్యాన్ని అంగీకరించకుండా, వారిచ్చిన ఆహారాన్ని స్వీకరించకుండా 21 రోజుల పాటు ఉగ్గబట్టి ప్రాణాన్ని ఆత్మార్పణం చేసుకున్నారు’’ అని తెలిపారు ఖాదరున్నీసా. కలిసిమెలిసి ఉండేవాళ్లు ‘‘ఉదయగిరి జాగీర్దార్ కుటుంబానికి వారసుల్లో ఒకరైన అబ్దుల్ ఖాదర్ సాహెబ్ అఫ్ఫాన్ (ఛాబుదొర) మా పెద్ద తాతగారు. ఆయన 1953లో మరణించారు. ఆయనకు పిల్లల్లేరు. మమ్మల్ని ఆత్మీయంగా చూసేవారు. ఆయన ఉదయగిరి దుర్గానికి పాశ్చాత్యుల కారణంగా ఎదురైన కష్టాలను, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన అనేక ఘట్టాలను మాకు చెబుతుండేవారు. ఉదయగిరి కోట లోపల మసీదులు, ఆలయాలు ఉండేవి. హిందువులు– ముస్లిమ్‌లు తరతమ భేదాలు లేకుండా సోదరభావంతో మెలిగేవారు. మనమంతా భారతీయులం, తెల్లవాళ్లు మనల్ని దోచుకుంటున్నారనే స్పృహ అందరిలో ఉండేది. అప్పట్లో అది సుసంపన్నమైన జాగీరు కూడా. అలాంటి జాగీరుకు బ్రిటిష్ వాళ్ల దృష్టి పడినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడది పేరుకే కోట అన్నట్లుగా ఉంది. పరాకాష్టకు చెందిన ఇంగ్లిష్ దొరల అరాచకానికి ఆనవాలుగా మిగిలింది. మా పూర్వికులు ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు. అబ్బాస్ అలీఖాన్ తండ్రి హజ్రత్ ఖాన్ సాహెబ్ వలి ఉర్సు చేసుకుంటాం. మొహర్రమ్ నెలలో ఉదయగిరి దర్గా ఉరుసులో హిందువులు– ముస్లిమ్‌లు కలిసి పాల్గొంటారు’’ అని ఖాదరున్నీసా తెలిపారు. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు!
స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1858 ఆగస్టు 2 గురించి భారతీయులు ఇప్పటికీ ఈ మాటే అనుకుంటారు! ఆ ముందు ఏడాదే దేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఎవరి మీద తిరుగుబాటు అంటే.. ఆప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న ‘బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ’ మీద. పాలిస్తే బ్రిటన్ పార్లమెంటు పాలించాలి గానీ, వ్యాపారం చేసుకోడానికి ఇండియా వచ్చిన బ్రిటన్ కంపెనీ (ఈస్టిండియా) పాలించడం ఏంటి? ఏంటంటే.. పాలించుకొమ్మని బ్రిటన్ పార్లమెంటే ఈస్టిండియా కంపెనీకి ఆమోదముద్ర వేసింది! అప్పట్నుంచీ ఇండియాలో ఈస్టిండియాది ఇష్టారాజ్యం అయిపోయింది. సిపాయిల తిరుగుబాటు మొదలయ్యాక, ఇక అది ఆగదని బ్రిటన్ ప్రభుత్వం గ్రహించి భారత పాలనా పగ్గాలను ఈస్టిండియా కంపెనీ నుంచి లాగేసుకుంది. అలా అలాగేసుకుని, తను తీసేసుకున్న రోజే ఆగస్టు 2. అంటే ఈస్టిండియా కంపెనీ అనే పెనంలోంచి, బ్రిటన్ అనే పొయ్యిలోకి భారతీయులు వచ్చిపడ్డారు. ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858’ అనే చట్టం ద్వారా ఈ అధికార సంక్రమణ జరిగింది. విజ్ఞాన ఘనుడు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ బెంగాలీ విద్యావేత్త, ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, పారిశ్రామికవేత్త, వితరణశీలి. రసాయనశాస్త్రంలో మొట్టమొదటి భారతీయ పరిశోధనా పాఠశాలను స్థాపించారు. భారతదేశపు మొట్టమొదటి ఔషధ సంస్థ బెంగాల్ కెమికల్స్ – ఫార్మాస్యూటికల్స్ కూడా ఆయన స్థాపించినదే. ‘ఎ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ ఫ్రమ్ ది ఎర్లీస్ట్ టైమ్స్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ సిక్స్‌టీంత్ సెంచరీ’ (1902) అనే గ్రంథాన్ని రచించాడు. భారతీయుల విజ్ఞానం గూర్చి ప్రపంచానికి తెలుపుతూ ఎన్నో వ్యాసాలు రాశారు. నేడు ప్రఫుల్ల చంద్రరాయ్ జయంతి. 1861 ఆగస్టు 2 న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఖుల్నా జిల్లా రారూలీ–కటిపర గ్రామంలో ఆయన జన్మించారు. బ్రిటన్‌లో ఆరేళ్లు చదివొచ్చారు. రసాయన, రాజకీయ శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. 1944 జూన్ 16న తన 82 ఏళ్ల వయసులో కలకత్తాలో మరణించారు. విద్యా చరణుడు విద్యా చరణ్ శుక్లా రాజకీయవేత్త. కేంద్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు. తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1966లో ఇందిరాగాంధీ కేబినెట్లో హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ర్యాలీ లక్ష్యంగా 2013 మే 25 న మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో శుక్లాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2013 జూన్ 11న 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నేడు ఆయన జయంతి. 1929 ఆగస్టు 2న రాయ్‌పూర్‌లో జన్మించారు. (చదవండి: చైతన్య భారతి: పతాక యోధుడు.. పింగళి వెంకయ్య) -
ఆగస్టు 2: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు!
స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1858 ఆగస్టు 2 గురించి భారతీయులు ఇప్పటికీ ఈ మాటే అనుకుంటారు! ఆ ముందు ఏడాదే దేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఎవరి మీద తిరుగుబాటు అంటే.. ఆప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న ‘బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ’ మీద. పాలిస్తే బ్రిటన్ పార్లమెంటు పాలించాలి గానీ, వ్యాపారం చేసుకోడానికి ఇండియా వచ్చిన బ్రిటన్ కంపెనీ (ఈస్టిండియా) పాలించడం ఏంటి? ఏంటంటే.. పాలించుకొమ్మని బ్రిటన్ పార్లమెంటే ఈస్టిండియా కంపెనీకి ఆమోదముద్ర వేసింది! అప్పట్నుంచీ ఇండియాలో ఈస్టిండియాది ఇష్టారాజ్యం అయిపోయింది. సిపాయిల తిరుగుబాటు మొదలయ్యాక, ఇక అది ఆగదని బ్రిటన్ ప్రభుత్వం గ్రహించి భారత పాలనా పగ్గాలను ఈస్టిండియా కంపెనీ నుంచి లాగేసుకుంది. అలా లాగేసుకుని, తను తీసేసుకున్న రోజే ఆగస్టు 2. అంటే ఈస్టిండియా కంపెనీ అనే పెనంలోంచి, బ్రిటన్ అనే పొయ్యిలోకి భారతీయులు వచ్చిపడ్డారు. ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858’ అనే చట్టం ద్వారా ఈ అధికార సంక్రమణ జరిగింది. -
మహోజ్వల భారతి: బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వ నిషేధం
1837 నాటి ఈస్టిండియా కంపెనీ ‘కార్మిక వలసల కొత్త విధానం’ పై బ్రిటన్‌లోను, భారతదేశంలోనూ బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్థాయిలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 1838 ఆగస్టు 1న భారతీయ కార్మికుల ఎగుమతి వ్యవహారంపై విచారణకు ఒక కమిటీని నియమించారు. కమిటీ నివేదిక అనంతరం 1839 మే 29న విదేశీ కార్మిక వ్యవస్థను నిషేధించారు. అలాంటి వలసలను చేపట్టే ఏ వ్యక్తి అయినా 200 రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షకు గురవుతాడు. నిషేధం తర్వాత కూడా, కొంతమంది భారతీయ కార్మికులను పాండిచ్చేరి (అప్పట్లో ఫ్రెంచ్ వారి అధీనంలో) మీదుగా మారిషస్‌కు పంపడం కొనసాగింది. భారతీయ వెట్టి చాకిరీ వ్యవస్థ బ్రిటిషు వారు 19 వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన నిర్బంధ కార్మిక వ్యవస్థ. ఒక పరిమిత కాలానికి చేసుకునే ఒప్పందం ప్రకారం కార్మికులు పనిచేస్తారు కాబట్టి దీన్ని ఒప్పంద కార్మిక వ్యవస్థ అనే వారు. అది బానిసత్వం లాంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో పదహారు లక్షలకు పైబడిన సంఖ్యలో భారతీయులను శ్రామికులుగా వివిధ ఐరోపా వలస రాజ్యాలకు రవాణా చేశారు. బ్రిటిషు సామ్రాజ్యంలో 1833లోను, ఫ్రెంచ్ వలస దేశాల్లో 1848 లోను, డచ్ సామ్రాజ్యంలో 1863 లోనూ బానిసత్వాన్ని నిర్మూలించిన తర్వాత ఈ వ్యవస్థ విస్తరించింది. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ 1920 ల వరకు కొనసాగింది. నేడు కరిబియన్ దేశాలు, నాటల్ (దక్షిణాఫ్రికా), తూర్పు ఆఫ్రికా, మారిషస్, శ్రీలంక, మలేషియా, మయన్మార్, ఫిజీ వంటి దేశాల్లో ప్రవాస భారతీయ సమాజం ఉందంటే దానికి మూలం ఈ కార్మిక వ్యవస్థే. ఇండో–కరిబియన్, ఇండో–ఆఫ్రికన్, ఇండో–ఫిజియన్, ఇండో–మలేషియన్, ఇండో–సింగపూర్ జనాభా పెరుగుదలకూ ఈ వ్యవస్థే దోహదం చేసింది. ఈ వ్యవస్థలో ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులను హీనంగా కూలీ అని పిలిచేవారు. వివిధ వలస దేశాల్లో వారి పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉండేవి. వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఒప్పందంలో నియమాలు ఉన్నప్పటికీ వాటిని పాటించేవారు కాదు. ఒప్పంద కాలపరిమితి తీరిపోయాక కూడా ఏదో విధంగా వాళ్లను వెనక్కి పోనీయకుండా నిర్బంధంగా అక్కడే ఉంచేలా యజమానులు కుటిల ప్రయత్నాలు చేసేవాళ్లు. భారతదేశంలో కార్మికుల నియామకాల్లో కూడా అనేక అక్రమాలు జరిగేవి. తమ పని ఏమిటో, పని చెయ్యబోయేది ఎక్కడో వాళ్లకు చెప్పేవారు కాదు. ఓడ ఎక్కేముందు రేవు లోను, ఓడలోనూ వాళ్ల నివాస పరిస్థితులు అమానవీయంగా ఉండేవి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు బ్రిటిషు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ అక్రమాలు కొనసాగాయి. చివరికి దేశవ్యాప్తంగాను, బ్రిటన్‌లోను, ఇతర దేశాల్లోనూ ప్రజల నుండి వచ్చిన వత్తిడి కారణంగా 1917లో ఈ వెట్టి చాకిరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసారు. -
సామ్రాజ్య భారతి 1877/1947
ఘట్టాలు 1. గుజరాత్లో కచ్ మ్యూజియం స్థాపన. 2. క్వీన్ విక్టోరియా భారతదేశ సామ్రాజ్ఞి అయిన సందర్భంగా దర్బార్లలో వేడుకలు. 3. గిల్గిట్ ఏజెన్సీ ఆరంభం. జమ్మూకశ్మీర్ సంస్థాన భూభాగాలను ఎవరూ ఆక్రమించకుండా ఈ రక్షణ ఏజెన్సీని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చట్టాలు లిమిటేషన్ యాక్ట్, ఈస్ట్ ఇండియా లోన్ యాక్ట్, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ జననాలు మూడవ ఆగాఖాన్ : ఆలిండియా ముస్లిం లీగ్ తొలి శాశ్వత అధ్యక్షులు (కరాచీ); సర్ అల్లమ మహమ్మద్ ఇక్బాల్ : కవి, ప్రత్యేక పాకిస్థాన్ భావనకు ఆద్యులు (సియాల్కోట్); కవాస్జీ జెంషెడ్జీ పెటిగర : ముంబై తొలి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలిస్; రవిశంకర్ శుక్లా : భారత స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (మధ్యప్రదేశ్); పులిన్ బెహారీదాస్ : విప్లవ వీరుడు, ‘ఢాకా అనుశీలన్ సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు (బంగ్లాదేశ్); వీరభద్రరాజు బహదూర్ : కురుపాం జమీందారు (విజయనగరం జిల్లా); ఈఫరేసియా ఎళువతింగళ్ : ఇండియన్ నన్ (కొచ్చిన్); నిరలాంబ స్వామి : జాతీయవాది, తత్వవేత్త, స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (పశ్చిమబెంగాల్); తరుణ్ రామ్ ఫూకన్ : రాజకీయ వేత్త, ‘దేశభక్త’గా ప్రసిద్ధి (అస్సాం). -
సామ్రాజ్య భారతి 1874/1947: ఈస్టిండియా కంపెనీ రద్దు
చట్టాలు: మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ జెయిల్స్ యాక్ట్, ఈస్టిండియా యాన్యుయిటీ ఫండ్స్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, కోర్ట్స్ (కొలోనియల్) జ్యూరిస్డిక్షన్ యాక్ట్, కొలొనియల్ క్లెర్జీ యాక్ట్. జననాలు: కవి కలాపి : గుజరాతీ కవి. ‘కలాపి’ అన్నది కలంపేరు. అసలు పేరు సుర్సిన్హ్జీ టఖ్టాసిన్హ్జీ గోహిల్. అతడి కవిత్వం నిండా భావోద్వేగమే ఉంటుంది. సాహు మహరాజ్ : మరాఠాల భోంస్లే వంశానికి మహారాజు. కొల్హాపూర్ సంస్థానానికి తొలి మహారాజు. భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర : వైష్ణవ హిందూ గురువు. అసలు పేరు విమల ప్రసాద్ దత్. పూరీలో జన్మించారు. షాపూర్జీ సక్లత్వాలా : కమ్యూనిస్టు కార్యకర్త. పార్సీ వంశీయుడు (ముంబై) టి.ఆర్.వెంకట్రామశాస్త్రి : న్యాయవాది. రాజకీయ నేత. మద్రాస్ ప్రెసిడెన్సీకి 1924 నుంచి 1928 వరకు అడ్వొకేట్ జనరల్‌గా పని చేశారు. జన్మస్థలం తమిళనాడులోని మాయవరం. (చదవండి: మనల్ని మనవాడిలా పాలించాడు!) -
Azadi Ka Amrit Mahotsav: ఆక్రమణ.. నిష్క్రమణ
సిపాయిల ధిక్కారం.. జాగీర్దారుల విద్రోహం.. బద్ధలైన స్వాతంత్య్ర కాంక్ష.. వీటిల్లో ఏది 1857 తిరుగుబాటు చరిత్ర? 165 ఏళ్ల తర్వాత కూడా మనకింకా సంశయమే. ఒక్క విషయంలో మాత్రం స్పష్టత ఉంది. అత్యంత శక్తిమంతమైన ఒక మహా సామ్రాజ్యంతో భారతీయులు తెగించి పోరాడారు. వట్టి చేతులతో, ఉక్కు గుండెలతో బ్రిటిష్ ఫిరంగుల వైపు ప్రతి గర్జన చేశారు. ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల గుండా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన ఆ తిరుగుబాటు స్ఫూర్తి 1857–59 మధ్య.. దేశాన్ని యుద్ధభూమిగా మార్చింది. రెండు వైపులా హింస.. రక్తమై ప్రవహించింది. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌లోని సతీచౌరా ఘాట్‌లో అమాయక ఆంగ్ల వనితలు, పిల్లల ఊచకోత.. తిరుగుబాటు దారుల ఆగ్రహోన్మాదానికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది. బ్రిటిష్ వారు కూడా అదే ‘యుద్ధ రీతి’లో ప్రతీకారం తీర్చుకున్నారు. 1757 నుంచి 1857 వరకు దేశమంతటా శాంతి పునఃస్థాపన జరిగినట్లు 1859 జూలై 8 న అధికార ప్రకటన వెలువడే నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం దాదాపుగా డీలా పడి ఉంది. ఆ ముందటి ఏడాదే 1858 చివరిలో ఇంగ్లండ్ ప్రభుత్వం ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని రద్దు చేసి, భారతదేశాన్ని పూర్తిగా తన పాలన కిందికి తెచ్చుకుంది. అప్పటికి 250 ఏళ్ల పూర్వమే వాణిజ్య ప్రయోజనాల కోసం భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లిమెల్లిగా ఇక్కడి భూభాగాలపైన కూడా ఆధిపత్యం సంపాదించడం మొదలుపెట్టింది. అందుకోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాను ఓడించింది. మైసూరులో టిప్పు సుల్తాన్‌ను, మరికొందరు ప్రాంతీయ పాలకులను గద్దె దించింది. అలా 1857 నాటికి యావద్భారతాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అప్పుడు జరిగిందే సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రప్రథమ స్వాతంత్య్ర పోరాటం కూడా అని కొందరు చరిత్రకారులు అంటారు. మంగళ్ పాండే ధిక్కార స్వరం తర్వాత తొలిసారి మీరట్‌లో (యూపీ) భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్రిటిష్ సైనిక అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (యూపీ) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తదితరులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ప్రారంభంలో పోరు విజయవంతంగా సాగినప్పటికీ చివరికి భారతీయులు ఓడిపోయారు. ఝాన్సీరాణి, తాంతియా తోపే ఆ పోరులో మరణించారు. ఝాన్సీరాణి యుద్ధ క్షేత్రంలో వీర మరణం పొందితే తోపేని బ్రిటిష్ వాళ్లు పట్టి బంధించి ఉరి తీశారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేశారు. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. తిరుగుబాటుతో శకం ముగిసింది సిపాయిల తిరుగుబాటు తర్వాత సంభవించిన కీలక పరిణామం.. ఈస్టిండియా కంపెనీ శకం ముగియడం. దాని స్థానంలో ఇంగ్లండ్ ప్రభుత్వం వైస్రాయ్‌లను, గవర్నర్ జనరల్స్‌ని పెట్టి భారతదేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత 1885 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయోద్యమం సాగింది. మనం చదువుకున్న చరిత్ర పుస్తకాలలో కాస్త అటు ఇటుగా ఇదీ మన స్వాతంత్య్ర సమరగాథ. అయితే భారతదేశ చరిత్రకారులు కొంతమంది మౌలిక పరిశోధనలకు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఏవో తమకు లభ్యమైన ఆధారాలతో, తోచిన విధంగా చరిత్రను రాస్తున్నారన్న విమర్శ ఉంది. 1857 తిరుగుబాటు పైన, బహదూర్ షా జఫర్ పైన భారతీయ చరిత్రకారులు ఎన్నో రచనలు చేసినప్పటికీ అందుబాటులో ఉన్న అనేక రికార్డుల వైపు వెళ్లనే లేదని ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అంటున్నారు! ‘‘వివిధ సిద్ధాంతాలు, దృక్పథాల ప్రభావంతో భారతదేశంలో మౌలిక సూత్రాల నుంచి చరిత్ర రచన దారి తప్పింది. ఇందువల్ల పరిశోధన కొరవడి చరిత్ర వాస్తవాలు ప్రజల దృష్టికి వచ్చే పరిస్థితి ఉండదు. శూన్యస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చరిత్ర వక్రీకరణ జరిగి, అదే నేపథ్యంలో వర్తమాన సమాజం అవాంఛనీయ చర్యలకు, విధానాలకు పాల్పడుతుంది..’’ అంటారు డాల్రింపుల్ 1957లో శతాబ్ది ఉత్సవాలు 1957 నాటి ‘తొలి తిరుగుబాటు శతాబ్ది’ వేడుకల సమయానికి స్వతంత్ర భారతదేశం వయసు 10 ఏళ్లు. 1857 మే 10న బ్రిటిష్ పాలకులపై భారతీయ సిపాయిలు తిరగబడిన సందర్భాన్ని జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్.. ‘కులమతాలకు అతీతమైన సమైక్య పోరాటం’గా అభివర్ణించారు. స్వాతంత్య్రానంతర స్వార్థపూరిత పోకడలకు వ్యతిరేకంగా తిరిగి ఆ స్థాయిలో ఉద్యమించవలసిన అవసరం ఉందని కూడా నెహ్రూ ఓ మాట అన్నారు. కలకత్తా యూనివర్సిటీ చరిత్రకారుడు ఎస్.ఎన్.సేన్‌తో తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై రాయించిన అధికారిక గ్రంధాన్ని ప్రభుత్వం ఆ ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించింది. ‘‘మతాన్ని కాపాడుకొనేందుకు మొదలైన పోరాటం స్వాతంత్య్ర సమరంగా సమాప్తమయింది’’ అని సేన్ తన పుస్తకాన్ని ముగించారు. పుస్తకం రాస్తున్నప్పుడు పాలక్షపక్షం ఒత్తిళ్ల మేరకు ఆయన తన అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చిందని అంటారు. అలాంటి అనుభవమే సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్.సి.మజుందార్‌కూ ఎదురైంది. ‘ది సిపాయ్ మ్యూటినీ అండ్ రివోల్ట్ ఆఫ్ 1857’ గ్రంథ రచన విషయంలో బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ కార్యదర్శితో ఆయనకు అభిప్రాయభేదాలు వచ్చాయి. బ్రిటిష్ వారిని ఇండియా నుంచి వెళ్లగొట్టేందుకు ఒక పథకం ప్రకారం సిపాయిల తిరుగుబాటు జరిగినట్లు రాయాలని ఆ కార్యదర్శి కోరడం మజుందార్‌కు నచ్చలేదు. చరిత్రను వక్రీకరించడం తన వల్ల కాదని చెప్పి, బోర్డు నుంచి బయటికి వచ్చి సొంతంగా పుస్తకం తీసుకువచ్చారు. శతాబ్ది ఉత్సవాలలోనే ఆ పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో 1857 నాటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయమై ఈనాటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
సిరాజుద్దౌలాను హతమార్చేందుకు రాబర్ట్ క్లైవ్ బయల్దేరిన రోజు
1757లో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో బెంగాల్ యువ నవాబు సిరాజుద్దౌలా ఈస్టిండియా కంపెనీకి పట్టుబడి, హతుడు కావడంతో ఇండియాలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలన మొద లైంది. సిరాజుద్దౌలాపై యుద్ధానికి రాబర్ట్ క్లైవ్ ఆ ఏడాది జూన్ 13 న ముర్షిదాబాద్ బయలుదేరి వెళ్లాడు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ.. బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రుల కూటమిపై నిర్ణయా త్మక విజయం సాధించిన ఆ యుద్ధం చరిత్రలో ప్లాసీ యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. 1757 జూన్ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారత్ అంతటా విస్తరించింది. బెంగాల్లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద ఆనాటి యుద్ధం జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కిమీ వద్ద, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఇస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రధాన ప్రత్యర్థులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషు వారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. బెంగాల్ ప్రెసిడెన్సీకి బ్రిటిష్ గవర్నర్ అయిన రాబర్టు క్లైవ్, సిరాజుద్దౌలా సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపి, తన పక్షానికి తిప్పుకున్నాడు. సిరాజుద్దౌలాను ఓడించారు. ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. బ్రిటిషు వారు రాబర్టు క్లైవ్ నాయక త్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవ్ ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్‌నగర్ కోటను వశపరచుకు న్నాడు. బ్రిటిషువారికీ, సిరాజుద్దౌలాకూ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు ప్లాసీ యుద్ధానికి దారితీశాయి. సంఖ్యపరంగా సిరాజు ద్దౌలా సైన్యం, బ్రిటిషు సైన్యం కంటే చాలా పెద్దది. ఈ విషయమై ఆందోళన చెందిన క్లైవ్.. మీర్ జాఫరు, మరికొంతమందితో కలిసి కుట్ర పన్నాడు. ఆ ప్రకారం వాళ్లంతా యుద్ధభూమికి తమ సైన్యాలతో వచ్చినప్పటికీ సిరాజుద్దౌలా తరఫున యుద్ధంలో పాల్గొనలేదు. ఫలితంగా 18,000 మందితో కూడిన సిరాజుద్దౌలా సైన్యం, కేవలం 3,000 క్లైవ్ సైన్యం చేతిలో పరాజయం పొందింది. యుద్ధం కేవలం 40 నిముషాల్లో ముగిసి పోయింది. తర్వాత సిరాజుద్దౌలాను బ్రిటిష్ వాళ్లు హతమార్చారు. గణేశ్ దామోదర్ సావర్కర్ గణేష్ దామోదర్ సావర్కర్ స్వాతంత్య్ర సమర యోధుడు. 1879 జూన్ 13న జన్మించారు. ‘అభినవ్ భారత్ సంఘం’ వ్యవస్థాపకులు. భారతదేశంలో బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ఉద్యమానికి నాయ కత్వం వహించారు. ఫలితంగా ఆయన జీవితాంతం బహిష్కరణ శిక్ష గురయ్యారు. అందుకు ప్రతీకారంగానే అప్పటి నాసిక్ కలెక్టర్ జాక్సన్‌ను గణేష్ సన్నిహిత అనుచరుడు అనంత లక్ష్మణ్ కన్హేర్ హత్య చేశాడు. కన్షేర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటాన్ని ఆశ్రయించిన సమర యోధుడు. ప్రముఖ హిందుత్వ వాది వినాయక్ దామోదర్ సావర్కర్.. గణేశ్ తమ్ముడే. -
దేశమాత స్వేచ్ఛ కోరి.. తిరుగుబాట్లు.. ఉరికొయ్యలు
1947 వరకు ‘ఈస్టిండియా’, ‘బ్రిటిష్ ఇండియా’లే తప్ప మనకంటూ ‘మదర్ ఇండియా’ లేదు! వ్యాపారం చేసుకోడానికి కంపెనీ పెట్టి, ఆ కంపెనీ పేరులో స్థానికత కోసం వ్యూహాత్మకంగా ‘ఇండియా’ అనే పేరును జతకలిపి, బ్రిటన్ పార్లమెంటు అనుమతితో ‘ఈస్టిండియా కంపెనీ’గా అవతరించిన బ్రిటిష్ ప్రైవేటు వ్యాపారులు.. లాభాలతో, అపరిమితమైన సంపదలతో సంతృప్తిచెందక, సొంత సైన్యాన్ని సమకూర్చుకుని సొంత పాలన కూడా మొదలు పెట్టినా.. ఈస్టిండియా కంపెనీపై ఆ కంపెనీ ఆధిపత్య ప్రాంతాలలోని భారత సిపాయిలు తిరగబడటంతో కంపెనీ కథ ముగింపునకు వచ్చింది. అనంతరం ఇండియా పాలన పగ్గాలను 1858లో బ్రిటన్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కూడా పదహారేళ్ల పాటు ఈస్టిండియా ఆనవాళ్లు దేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. చివరికి 1874 జూన్ 1న ఈస్టిండియా తిరుగుముఖం పట్టింది. 1858 తరువాత కూడా భారత ప్రజానీకంలో చల్లారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. ఆనాటి క్వీన్ విక్టోరియా వాటిని చల్లార్చే ప్రయత్నమేమీ చేయలేదు. 1885లో ‘భారత జాతీయ కాంగ్రెస్’ స్థాపనకు ముందు ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా హయాంలలో దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు చెలరేగాయి. హిందీ ప్రాంతాలతో పాటు.. అస్సాం, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, నిజాం ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. తిరగబడిన దాదాపు అందరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఉరికంబాలు ఎక్కించింది. వాస్తవానికి అప్పటికి వందేళ్ల ముందు నుంచి ఈ తిరుగుబాట్లు, ఉరికంబాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతాన్ని కబళించే ప్రయత్నం 1766 నుంచి ఈస్టిండియా కంపెనీ ఎలా చేసిందో, ఆంధ్రా యోధులు కంపెనీని ఎలా ఎదుర్కొన్నారో ప్రొఫెసర్ కె.ఎస్.ఎస్. శేష¯Œ ‘ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ ఇన్ ఆంధ్ర 1766–1857’ అనే పుస్తకంలో వివరించారు. 1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, విశాఖపట్నం, మొమినాబాద్, బొల్లారం తిరుగుబాట్లు అలాంటివే. కర్నూలు జిల్లాలో కంపెనీ దమనకాండకు నిరసనగా పోరుబాట పట్టిన ఐదువేల మంది రైతులకు నరసింహారెడ్డి నాయకత్వం వహించాడు. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని ఉరి తీయడంతో ఉద్యమం చల్లారిపోయింది. తమిళనాడు, మహారాష్ట్ర తమిళనాడులోని నెల్కట్టుంసేవల్ ప్రాంత పాలెగాడు పులిదేవర్. 1757లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. 18వ శతాబ్దంలో దక్షిణాదిన కనిపించే మరొక వీరుడు వీరపాండ్య కట్టబొమ్మ కరుతయ్య నాయకర్. పాంచాల¯Œ కురుచి ప్రాంతాన్ని పాలించేవాడు. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు అతడిని 1799లోనే ఉరి తీశారు. మహారాష్ట్ర ప్రాంతం సతారాలో 1822–25 ప్రాంతాలలో జరిగిన రామోసీల తిరుగుబాటు కూడా కంపెనీని భయపెట్టింది. వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే.. వారి విప్లవ యోధులలో ఒకరు. రామోసీలు అంటే పోలీసు, సైనిక వ్యవస్థలో ఉండే అత్యంత కింది స్థాయి ఉద్యోగులు. వీరే చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరగబడ్డారు. తూర్పు భారతం 19వ శతాబ్దంలో తూర్పు భారతంలో ముఖ్యంగా అస్సాంలో కంపెనీకి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. యాండాబు ఒప్పందం (1826) మేరకు అస్సాం.. కంపెనీ అధీనంలోకి వచ్చింది. యథాప్రకారం కంపెనీ కిందకు అస్సాం రావడం, కల్లోలం ఆరంభం కావడం ఏకకాలంలో జరిగాయి. తిరుగుబాట్లలో అటు పై వర్గాల వారు, మధ్య, దిగువ తరగతుల వారు కూడా పాల్గొన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో మొదటి వ్యక్తి గోంధార్ కున్వార్. స్థానిక పాలకులైన కుందురా దీకా ఫుఖాన్, దామోదర్, హర్నాథ్ కూడా అతడికి సహకరించారు. వీరంతా కలసి 1828లో సాడియా అనే చోట కంపెనీ ఆయుధాగారం మీద దాడి చేశారు. అది విఫలమైంది. మళ్లీ పియాలీ బర్ఫూఖన్ నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది. ఈయనకు జీయురాం దూలియా బారువా, బేణుధర్ కున్వార్, రూప్‌చంద్ కున్వార్, దేయురాం దిహింగియా, బౌవ్‌ు చింగ్‌ఫూ, హర్నాథ్ తదితరులు సహకరించారు. రంగపూర్‌లో ఉన్న బ్రిటిష్ శిబిరాన్ని దగ్ధం చేయాలని పియాలీ బర్ఫూఖన్ నాయత్వంలో జరిగిన ప్రయత్నం విజయవంతమైంది. కానీ పియాలీ, జియురాం బారువా, ఇంకొందరు ఆందోళనకారులను కంపెనీ అధికారులు పట్టుకున్నారు. పియాలీ, జియురాంలను ఉరి తీసి, మిగిలిన వారిని ద్వీపాంతరం పంపారు. ఇదే సమయంలో ఎగువ అస్సాంలో పనిచేసే కొందరు కంపెనీ బ్రిటిష్ జాతీయులను చంపాలని గదాధర్ గొహిన్ అనే మరొక వీరుడి నాయకత్వంలో ప్రయత్నించారు. కానీ ఇది విఫలయింది. గదాధర్‌ను జైలులో పెట్టారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆ జ్వాలను అస్సాంకు తీసుకుని వెళ్లిన యోధుడు మణిరాం దివాన్. ఆ సమయంలో కలకత్తా వెళ్లి, మరొక ఉద్యమకారుడు మధు మల్లిక్ సాయంతో పథకం వేశాడు. అయితే పథకం అమలులో కొద్దిపాటి ఆలస్యం కావడంతో కంపెనీ వెంటనే అప్రమత్తమై తిరుగుబాటులో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుంది. కలకత్తా నుంచి పనిచేస్తున్న మణిరాంను కూడా అరెస్టు చేశారు. కందర్పేశ్వర్‌సింగ్‌ను కారాగారంలో పెట్టారు. చాలామందిని ద్వీపాంతరం పంపారు. మణిరాం, పియాలీ జోర్హాట్ కారాగారంలోనే చనిపోయారు. 1861, 1894లలో ఫులగారి, పత్థర్‌ఘాట్ అనేచోట రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇలాంటివి పదులు, వందలుగా జరిగిన తిరుబాట్ల ఫలితంగా ఈస్టిండియా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాట పట్టించవలసి వచ్చింది. -
భారత్‌లో ‘కుట్ర’ ఆరోపణలు.. అమెజాన్ రియాక్షన్ ఇది
అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్యకలాపాల ద్వారా భారత్‌లో విదేశీ కుట్రకు పాల్పడుతోందన్న ఆరోపణలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్‌కు చెందిన ‘పాంచ్‌జన్య’లో అమెజాన్‌ను ‘ఈస్టిండియా కంపెనీ 2.0’తో పోలుస్తూ ఓ కవర్ స్టోరీ ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ కథనానికి అమెజాన్ కౌంటర్ ఇచ్చింది. ‘ఈస్టిండియా కంపెనీ 2.0’ అనే హెడ్డింగ్‌తో అమెజాన్‌కు వ్యతిరేకంగా ఈమధ్య ఓ కథనాన్ని ప్రచురించింది పాంచ్‌జన్య. అందులో.. ‘‘భారత మార్కెట్లో పైచేయి కోసం అమెజాన్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నిరకాలు స్వేచ్ఛలను, భారతీయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంది. తమ అనుకూలత కోసం ఓ మెట్టుదిగజారి అవినీతికి సైతం పాల్పడుతోంది. వీటికి తోడు ప్రైమ్ వీడియోల ద్వారా సంప్రదాయాల్ని నాశనం చేస్తోంది. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ ఎలాగైతే భారత్‌ను దోచుకుందో.. ఇప్పుడు అదేవిధంగా జాతి సంపదను కొల్లగొడుతూ అమెజాన్ మరో ఈస్టిండియా కంపెనీని తలపిస్తోంది’’ అని ఆరోపించింది పాంచ్‌జన్య. అయితే ఈ కథనానికి స్పందించిన అమెజాన్.. తమ విక్రయదారుల్లో భారత ఎగుమతిదారులూ ఉన్నారని, వాళ్ల ద్వారా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులనే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నామని తెలిపింది. లెక్కలతో సహా.. 200 దేశాల్లో భారత ఉత్పత్తులను అందిస్తున్నామని స్పష్టం చేసింది అమెజాన్. అంతేకాదు భారత అమ్మకందారులకు అమెజాన్ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తుందో వివరించింది. ‘‘కరోనా టైంలో మూడు లక్షల మంది కొత్త అమ్మకందారులు చేరారు. అందులో 45 ఫ్లస్ నగరాల నుంచి 75 వేలమంది స్థానిక దుకాణదారులే ఉన్నారు. మెట్రోనగరాలు, టైర్-2, టైర్-3, టైర్- స్థాయి పట్టణాల నుంచి కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రొడక్టులను సేకరించి.. 200 దేశాల్లో మా సర్వీసుల ద్వారా అందిస్తున్నాం. పైగా అమెజాన్ ఎక్స్పోర్ట్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది భారత్‌కు చెందిన ఎగుమతిదారులే ఉన్నారని, వాళ్లంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే అమ్ముతున్నారని స్పష్టం చేసింది. చదవండి: భారత్‌లో అమెజాన్ ‘ధన’బలం! చదవండి: అమెజాన్ లీగల్ ప్రతినిధుల రాంగ్‌రూట్?! ఇదిలా ఉంటే పాంచ్‌జన్య.. గత కొన్నిరోజులుగా అమెజాన్ మీద ఫోకస్ పెట్టి వరుస కథనాలు ప్రచురిస్తోంది. హిందీ వీక్లీ, ఆరెస్సెస్ అనుబంధ పత్రికా విభాగం అయిన పాంచ్‌జన్య ఇంతకు ముందు ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ను ‘జాతి వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే కదా!. అయితే ఈ కథనంపై ఆరెస్సెస్ ఆల్ఇండియా పబ్లిసిటీ ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. పాంచ్‌జన్య కథనం రాసినవాళ్ల సొంత అభిప్రాయమని, ఆరెస్సెస్‌తో ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. Panchjanya is not mouthpiece of the RSS and the said article or opinions expressed in it should not be linked with the RSS. @editorvskbharat — Sunil Ambekar (@SunilAmbekarM) September 5, 2021 సంఘ్‌కు అవసరమా? ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ జోక్యానికి కారణమైంది. ఆరెస్సెస్ పాంచ్‌జన్య కథనాన్ని కాంగ్రెస్ పార్టీ అప్రస్తుతమని పేర్కొంది. అవసరం లేని వ్యవహారాల్లో ఆరెస్సెస్ జోక్యం ఎక్కువైందని, అమెజాన్ మీద పాంచ్‌జన్య ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని, ఉపేక్షించదగినవి కావని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ ప్రయోజనాలకే తప్ప.. దేశ ప్రయోజనాలకు ఆ విభాగం(ఆరెస్సెస్) పని చేయదంటూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: అమెజాన్‌కి చెక్ పెట్టే పనిలో టాటా గ్రూపు -
ముంబైలో బైడెన్ బంధువులు..!
ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. త్వరలోనే 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బైడైన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. బైడెన్ బంధువులు కొందరు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉన్నట్లు తెలిసింది. దీని గురించి గతంలో బైడెనే స్వయంగా వెల్లడించారు. 2013లో వైస్ ప్రెసిడెంట్ పర్యటనలో భాగంగా ముంబైలో ఐదుగురు బైడెన్లు ఉన్నారు అని తెలిపారు. భారత్‌లో ఇస్టిండియా పాలన కొనసాగుతున్న కాలంలో తన పూర్వీకులు ఇండియాలో పని చేశారని.. రిటైర్మెంట్ తర్వాత ఇక్కడే స్థిరపడ్డారని బైడెన్ స్వయంగా వెల్లడించారు. బైడెన్ మాట్లాడుతూ.. ‘నా 29వ ఏట 1972లో తొలిసారి సెనెటర్‌గా ఎన్నికయ్యాను. ఆ సమయంలో నాకు వచ్చిన ఓ ఉత్తరాన్ని ఎప్పటికి మర్చిపోను. పేరు చివర బైడెన్ అని ఉన్న ఓ పెద్దమనిషి దగ్గర నుంచి నాకు ఆ ఉత్తరం వచ్చింది. నా పేరు.. ముంబైలో ఎలా అని ఆశ్యర్యపోయాను. అప్పుడు నా గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్‌ఫాదర్ జార్జ్ బైడెన్ ఈస్ట్ఇండియా ట్రేడింగ్ కంపెనీలో కెప్టెన్‌గా పని చేశారని.. భారతీయ మహిళను వివాహామాడి ఇండియాలోనే స్థిరపడ్డారని తెలిసింది. అలా ఇండియాలో నా బంధువులు ఐదుగురు ఉన్నారనే విషయం నాకు తెలిసింది’ అన్నారు. (చదవండి: అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!) దీని గురించి వంశవృక్ష శాస్త్రవేత్తలు ఎవరైనా పరిశోధన చేసి.. పూర్తి వివరాలు వెల్లడిస్తే బాగుంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇక ముంబైలోని తన బంధువుల బైడెన్స్ ఫోన్ నంబర్లతో సహా ఎవరైనా తనకు వివరాలను అందించాల్సిందిగా బైడెన్ కోరారు. భారత-అమెరికా సివిల్ న్యూక్లియర్ డీల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా 2015లో వాషింగ్టన్లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ కార్యక్రమంలో బైడెన్ దీని గురించి మరో సారి మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఆయన ముంబై బంధువులు ఎవరనేది తెలియ లేదు. అంతేకాక మేం బైడెన్ బంధువులమంటూ ఎవరు ప్రకటించలేదు. -
నాడే భారత్ బిగ్ మార్కెట్!
సాక్షి, న్యూఢిల్లీ : నాడు పలు ప్రపంచ దేశాల వర్తకులు సముద్ర మార్గాన వచ్చి భారత్‌తో జరిపిన వాణిజ్య లావాదేవీల గురించి ప్రస్తావనకు వచ్చిందంటే చాలు మనకు నాటి వలసపాలకులు గుర్తుకు వస్తారు. ముందుగా పోర్చుగీసు, ఆ తర్వాత డచ్, ఫ్రెంచ్, చివరకు బ్రిటీష్ వర్తకులు మలబార్, గోవా, గుజరాత్, బెంగాల్ సముద్ర మార్గాల ద్వారా భారత్‌తో వ్యాపారం నిర్వహించడానికి వచ్చి వ్యాపార సంస్థల పేరుతో ఇక్కడే స్థిరపడడం, మన రాజకీయాల్లో జోక్యం చేసుకొని మనల్నే పాలించడం గుర్తుకురాక తప్పదు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఏ బడి పిల్లవాడిని అడిగినా ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్ వ్యాపారులు దాదాపు రెండు వందల సంవత్సరాలు మనల్ని పాలించారని చెబుతాడు. నాటి వలసపాలన చీకటి రోజులు గుర్తుకు రావడం వల్ల అంతకుముందు పలు ప్రపంచ దేశాలు, భారత్ మధ్య భారీ ఎత్తున జరిగిన సముద్ర వాణిజ్యం గురించి పూర్తిగా మరచిపోతాం, పోయాం. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే భారత్, ఇతర దేశాల మధ్య భారీ ఎత్తున సముద్ర మార్గాన వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. పైగా నాడు ఆవిరితో నడిచే ఓడలు లేవు. కేవలం గాలి వాటున నడిచే చిన్న, మధ్యతరహా నౌకలు ఉండేవి. ఎండకాలంలో నైరుతి, చలిగాలంలో ఈశాన్య దిశ గాలులు ఏటవాలున నాటి వాణిజ్య తెరచాపల పడవలు ప్రయేణించేవి. ఆయా ప్రాంతాల్లోని దేశాలతోని వాణిజ్యం నెరపేవి. మొదట గ్రీకు వర్తకులు ఈజిప్లు, తూర్పు ఆఫ్రికా, దక్షిణ అరేబియా, భారత్‌తో వ్యాపారం నిర్వహించేవారు. వీరు తూర్పు ఆఫ్రికా తీరం నుంచి, అరేబియా ద్వీపకల్పం, పర్సియన్ గల్ఫ్ నుంచి, రెండు మార్గాల ద్వారా భారత్‌కు వచ్చేవారు. పలు మధ్యధరా సముద్ర తీర దేశాలు కూడా భారత్‌తో వర్తకం నిర్వహించేవి. విదేశీ సముద్ర వర్తకులు ఎక్కువగా హిందూ మహా సముద్ర నుంచి భారత్‌కు చేరుకునేవారు. అప్పట్లో భారత్‌తో భారుచ్ రేవు పట్టణం వాణజ్యానికి ప్రధాన కేంద్రం. మధ్యధరా సముద్ర తీర దేశాలు, భారత్, పర్షియా, ఆఫ్రికా, చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. భారత్‌లోని దాదాపు 20 రేవు పట్టణాలు నాడు వాణిజ్యానికి పేరు పొందాయి. భారత్‌లోని మలబార్ తీరం నుంచి విదేశాలకు భారీ ఎత్తున మిరియాలు ఎగుమతయ్యేవి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాస్కోడిగామ భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి కూడా ‘బ్లాక్ గోల్డ్’గా అభివర్ణించే మిరియాలే కారణమట. నాడు భారత్ నుంచి మిరియాలతోపాటు ఇతర మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతోపాటు వివిధ రకాల అత్తర్లలో కలిపే సువాసన మూలకాలు, పత్తి, ఏనుగు దంతాలు, ముత్యాలు, చైనీస్ సిల్స్ భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి. ఇక అరబ్ వ్యాపారులతోపాటు భారతీయ వ్యాపారులు కూడా బియ్యం, నువ్వుల నూనె, నెయ్యి, చక్కెర, కాటన్ గుడ్డలు విక్రయించేవారు. ఇటలీ, అరబ్ వైన్లు, ఆలివ్ నూనె, వెండి, గాజు పాత్రలతోపాటు భారతీయులు బానిస సంగీత కళాకారులు, వేశ్య వృత్తి కోసం అమ్మాయిలను కొనుగోలు చేసేవారు. రోమన్ బంగారు, వెండి నాణెలను భరతీయులు కొనుగోలు చేసేవారు. అటు సముద్ర దొంగలు, ప్రకృతి విలయాలను ఎదురొడ్డి నాడు వర్తకులు వ్యాపారం నిర్వహించాల్సి వచ్చేది. వస్తు మార్పిడి, నాటి నాణెంల ద్వారా వ్యాపార లావాదేవీలు నడిచేవి. ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయంటే.. ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ’ పేరిట ఒకటవ శతాబ్దంలో, అంటే 1900 సంవత్సరాల క్రితం, వాస్కోడిగామా భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి 1400 ఏళ్ల ముందు ఓ గ్రీకు రచయిత గ్రీకు భాషలో చేతితో రాసిన పుస్తకం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవ శతాబ్దంలో పైటపడిన ఆ రాతపతిని బ్రిటీష్ మ్యూజియలంలో భద్రపరిచారు. దాన్ని లింకన్ కాసన్ ఇటీవల ఆంగ్లంలోకి అనువదించారు. నాడు ఏయే దేశాలు ఏయే సముద్ర మార్గం గుండా భారత్‌కు వచ్చి వర్తకాన్ని నిర్వహించేవి. భారత్‌లో ప్రసిద్ధి చెందిన రేవులు, మార్కెట్లు, వాటి వివరాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. 1550 రూపాయల ధర కలిగిన ఈ పుస్తకాన్ని 33 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గించి విక్రయించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆన్లైన్ వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి. -
పోస్టుకార్డుకు 141 ఏళ్లు
ఇంటి ముందు నుంచి పోస్ట్ అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకునే పరుగెత్తే దృశ్యాలు పాతకాలంలో కనిపించేవి. ఆ చిన్ని ఉత్తరం రాగానే ఇంటిల్లిపాది ఒకచోట చేరి దానిని చదివి ఎంతో ఆనందించేవారు. అదే పోస్టుకార్డు. చిన్నగా ఉండే ఆ పోస్టు కార్డు ఎన్నో పెద్దపెద్ద విషయాలను మోసుకొచ్చేది. ఆ చిట్టి పోస్టుకార్డే కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచేది. మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పర్చేది. అంతటి ఘన కీర్తి కలిగిన ఆ పోస్టుకార్డుకు ప్రస్తుతం ఆదరణ లేదు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆ పోస్టుకార్డుకు స్థానం లేదు. తమ భావాలను పంచుకునేందుకు, విషయాలను వివరించేందుకు ఆ పోస్టుకార్డు ఉనికి లేదు. సర్వం మొబైల్ మయం. నేడు పోస్టుకార్డు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, పాల్వంచరూరల్(ఖమ్మం) : నాడు ఎంతో ఆదరణ పొందిన పోస్టుకార్డుకు మారుతున్న ఆధునిక సమాజంలో ఆదరణ కరువైంది. సాంకేతిక విప్లవంతో అధునాతమైన మొబైళ్లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ యుగం రాకెట్ స్పీడుతో దూసుకుపోతుండటంతో 14 దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన, మంచిచెడుల సమాచారాన్ని చేరవేసే తోకలేని పిట్ట పోస్టుకార్డు నిరాదరణకు గురై కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది. భారతదేశంలో నాడు పాలించిన అంగ్లేయుల పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసినట్లు చెబుతున్న పోస్టుకార్డు 1879 జూలై 1న ఆవిర్భవించింది. నాడు ఈ కార్డును అణాపైసకు విక్రయించేవారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పోస్టుకార్డును వినియోగించుకునేవారు. సూదూర ప్రాంతాల్లోని బంధువుల యోగ క్షేమాల సమాచారం కార్డు ద్వారానే తెలుసుకునే అవకాశం ఉండేది. గతంలో ప్రభుత్వాలు కూడా పోస్టు కార్డు మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముద్రించి ప్రచారం చేసేవి. కానీ, గతంతో పరీశీలించి చూస్తే ప్రస్తుతం కార్డు ప్రభావం గణనీయంగా తగ్గింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల ప్రవేశంతో పోస్టుకార్డు నేడు ఉనికిని కోల్పోయే దశకు చేరింది. ప్రజలకు ఈ కార్డు ఆవసరం లేకుండా పోయింది. తొలి తెలంగాణ ఉద్యమంలో పోస్టుకార్డు కూడా కీలక భూమిక పోషించిందని నాటి స్వాతంత్య్ర సమరయోధులు అంటున్నారు. మలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను వివరించడానికి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రులకు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందు నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజలు పోస్టుకార్డు ద్వారా అభిప్రాయాలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పోస్టుకార్డుల వినియోగాన్ని ప్రజలు మరిచిపోయారు. దీంతో ప్రస్తుతం అర్ధ రూపాయి ధర కలిగిన పోస్టుకార్డును పోస్టు ఆఫీస్‌లోకి వెళ్లి కొనుగోలు చేసే దిక్కులేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కనుమరుగవుతున్న పోస్టుకార్డుకు భవిష్యత్లోలైనా పూర్వవైభవం రావాలని అశిద్దాం. అదరణలేక పోవడం బాధాకరం మారుతున్న కాలంలో పోస్టుకార్డులకు ఆదరణ లేకపోవడం బాధాకరంగా ఉంది. నాకు ఉద్యోగం రాకముందు గొళ్లపూడిలో 1983 నుంచి 87 వరకు పోస్టుమాస్టర్‌గా పనిచేశాను. సంక్రాంతి పండగ, రాఖీ, నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు భారీగా పోస్టుకార్డులు వచ్చేవి. వాటిని పంపిణీ చేయించడానికి రెండురోజులు పట్టేది. పోటీ పడి వాటిని తీసుకునేవారు. అంతటి ఆదరణ కలిగిన పోస్టుకార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. -రామశాస్త్రి, ఈఓఆర్డీ, పాల్వంచ నేటి ప్రజలు మరిచిపోయారు.. తక్కువ ఖర్చుతో పోస్టుకార్డు ద్వారా ఎక్కువ సమాచారం అందించవచ్చు. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్‌కు గానీ, కళాశాలల్లోగానీ పోస్టుకార్డు వస్తే నోటీస్ బోర్డులోకి వెళ్లి చూసుకునేది. కార్డుపై రాస్తే అందరికీ కనిపిస్తుందని భయమేసేది. అందరూ చదువుకునేవాళ్లు. అప్పట్లో ఎంతో అదరణ పొందిన పోస్టుకార్డును నేటి ప్రజలు మరిచిపోయారు. డాక్టర్ వై.చిన్నప్ప, ప్రిన్సిపాల్, జీడీసీ పాల్వంచ పోస్టుమెన్ కోసం ఎదురుచూసే వాళ్లం.. సెల్ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఈమెయిళ్లు లేని రోజుల్లో కేవలం పోస్టుకార్డులపై ఆధారపడ్డాం. పోస్టుమెన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ నిరీక్షించేవాళ్లం. పొరుగు ఊరు నుంచి బంధువులు పోస్టుకార్డుపై యోగ క్షేమాలు రాసి పంపేవారు. కార్డులు చదువుకుని తిరిగి మళ్లీకార్డుపై రాసి పంపించాం. డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం.. దూర ప్రాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను కేవలం పోస్టుకార్డుపై రాసి తెలుసుకునేవాళ్లం. నాటికి నేటికి ఎంతో తేడా ఉంది. వెంకటేశ్వర్లు, వ్యాపారి, కొత్తగూడెం -
‘సిద్ధూ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఈస్టిండియా కంపెనీలా వ్యవహరిస్తోందని ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆప్ బహిష్కృత ఎంపీ ధర్మవీర గాంధీ సమర్థించారు. కేజ్రీవాల్, ఆయన బృందం పనితీరును ఈస్టిండియా కంపెనీతో పోల్చడంలో ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీ నుంచి పంజాబ్ రాజకీయాలను శాసించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యహరిస్తున్నారని, స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. కేజ్రీవాల్ గురించి సిద్ధూ చెప్పినదాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని ధర్మవీర అన్నారు. పంజాబ్ రాష్టాన్ని పంజాబ్ కు చెందిన వారే పాలించాలని, బయటి వ్యక్తులను పాలకులుగా అంగీకరించబోమన్నారు. ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీలో చేరతారా అని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. -
వేగేశ్వరపురంలో బయల్పడిన పురాతన నాణేలు
తాళ్లపూడి : మండలంలోని వేగేశ్వరపురం ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం క్రింది భాగంలో అతి పురాతనమైన బ్రిటీష్ కాలం నాటి నాణేలు బయట పడ్డాయి. ధ్వజస్తంభ ప్రతిషా్ఠపన పూజలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ నాణేలు బయటపడగా జాగ్రత్తగా సేకరించారు. 1832 నుంచి 1910 మధ్య కాలానికి చెందిన వెండి, రాగి, ఇత్తడి నాణేలుగా వీటిని స్థానికులు గుర్తించారు. బ్రిటీష్ వారి హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ముద్రించినవిగా తెలుస్తున్నాయి. కింగ్ జార్జి, క్వీన్ విక్టోరియా, ఎడ్వర్డ్ చిత్రాలు వీటిపై ముద్రించి ఉన్నాయి. నాణేలపై ఒన్ క్వార్టర్ రూపి, ఒన్ ఫోర్త్ రూపీ అని కూడా ముద్రించి ఉంది. వీటిని మళ్లీ ధ్వజస్తంభం కింద వేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. -
శ్రీవారి హుండీ...
మీకు తెలుసా? ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ స్వామిని కన్నులారా చూసిన వెంటనే అక్కడే ఉన్న హుండీలో కానుకలను సమర్పించడం పరిపాటి. ఈ హుండీకి ఒక కథ ఉంది. అదేమిటో చూద్దాం... స్వామివారికి శ్రీవారి హుండీ ఆలయంలోని తిరుమామణి మంటపంలో ఉంది. రాగి గంగాళాన్ని శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన వస్త్రం లోపల ఉంచుతారు. ఆ గంగాళాన్ని హుండీ లేదా కొప్పెర అంటారు. ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821, జూలై 25న ఈ హుండీని ఏర్పాటు చేసినట్లు ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్‌కోడ్-12 లో పేర్కొన్నారు. 1958 నవంబర్ 28న, శ్రీవారి ఒక రోజు ఆదాయం మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు దాటింది. ఇప్పుడైతే రోజువారీ హుండీ ఆదాయం కోటిన్నర దాటుతోంది. కానుకలతో కొప్పెర నిండిన ప్రతిసారీ భక్తుల సమక్షంలో సీలువేసి పారుపత్తేదారు కానుకలు లెక్కించే పరకామణికి చేరవేస్తారు. అక్కడ సీల్ తీసి అందులోని నోట్ల కట్టలు, చిల్లర నాణాలు, బంగారు ఆభరణాలను వేర్వేరుగా లెక్కిస్తారు. లెక్కింపునకు టీటీడీ ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తుంది. తిరుమల తిరుపతిలో పనిచేసే టీటీడీ సిబ్బందికి నెలకో రోజు చొప్పున ఈ విధులు కేటాయిస్తారు. లెక్కింపు ప్రక్రియ మొత్తాన్నీ సీసీ కెమెరాలలో చిత్రీకరిస్తారు. పరకామణిలోకి ప్రవేశించే సిబ్బందిని పంచె, బనియన్లతో మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రోజుకు సుమారు 50 మంది రెండు బృందాలుగా ిషిఫ్టుల పద్ధతిలో పరకామణి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు. భద్రత తనిఖీల కారణంగా గతంలో మాదిరిగా కట్టలుకట్టలుగా హుండీలో కానుకలు పడటం లేదు. -
ఇంత దారుణం ఎక్కడా లేదు!
విజయనగరం కంటోన్మెంట్ : రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ బ్రిటిష్ వారసత్వ పోకడలను కొనసాగిస్తున్నారని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ విజయబాబు విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో సమాచార హక్కు ప్రచార వేదిక ఆధ్వర్యంలో జరిగిన మ హాసభలో ఆయన మాట్లాడారు. దేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమివేయడానికి వందేళ్లు పట్టిందని, ఇప్పుడు మన నాయకులు ఈస్ట్ఇండియా లాంటి కంపెనీలకు విద్యుత్, నీ రు, భూములు, ఇతర సౌకర్యాలిస్తామని వారికి రెడ్ కార్పెట్లు పరుస్తున్నారని ఆరోపించారు. అసలివి ప్రజాస్వామ్య ప్రభుత్వాలా? రాచరి కపు ప్రభుత్వాలా అని విమర్శించారు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారికి ప్రభుత్వా లు మర్యాదలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి సమయంలోనే ప్రజల నుంచి ధర్మాగ్రహం పెల్లుబుకుతుందని చెప్పారు. 41బి చట్టంతో పాటు, సెక్షన్ 21సి అమలు కాకపోవడంతో పెద్ద కంపెనీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని తెలిపారు. పీపీపీ, బీఓటీ ఒప్పం దాలతో ఎలాంటి ప్రయోజనం ఉందన్నారు. బీఓటీ ప్రాతిపదికన నిర్మించిన ని ర్మాణాలు ఒక్కటైనా ప్రభుత్వం అమలు చేయగలిగిందా అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో సమాచార హక్కు అమలు చేయడం లేదని, టీటీడీలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ప్ర భుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. రెండున్నరేళ్ల తన పదవీ కాలంలో తాను ఆదేశిం చిన కొన్ని పత్రా లు చెత్తబుట్టల్లో వేస్తున్నారని, దీంతో తాను ఎం దుకు సమాచార హక్కు కమిషనర్‌గా చేరానా అని ఆవేదన చెందిన రోజులున్నాయని చెప్పా రు. అన్ని రంగాల్లోనూ జవాబుదారీ తనం ఉం డాలని.అందుకు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలుకు ఇబ్బందు లు ఎదురవుతున్నాయన్నారు. చట్టంపై ప్రచారం చేయాల్సిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు కోసం ప్రారంభంలో ఎలా అయితే సంగ్రామం నడిచిందో ఇ ప్పుడు కూడా విదేశీ సంస్థల పాలిట స మాచార హక్కు కోసం మరో సంగ్రామాన్ని నడపాల్సిన బాధ్యత అందరిపై నా ఉందన్నారు. ఇక్కడి నుంచే ఆ సంగ్రామం మొదలు కావాలని అభిలషించారు. కలెక్టర్ బాధ్యతారాహిత్యం సరికాదు! రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు సమాంతరమైన సమాచార హక్కు కమిషనర్ జిల్లాకు వచ్చినప్పుడు కలెక్టర్ కనీసం స్పందించకపోవడం విచారకరమని విజయబా బు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి అధికారులకు సమాంతర హోదా ఉందని చెప్పుకో వడానికే గాని క్షేత్రస్థాయిలో ఆ హోదాను అమ లు చేయడంలో ఐఏఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.జిల్లాలో తన వా హనం మున్సిపాలిటీ కుక్కల బండి వచ్చినట్టు రావాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. దారి పొడవునా అడ్రస్ కనుక్కుని వచ్చానని చెప్పా రు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడం లేదని, ఒక సమాచార హక్కు కమిషనర్‌కు ఇలాగే ఆహ్వానం పలుకుతారా అని ప్ర శ్నించా రు. కొంతమంది ఉన్నతాధికారులు స్వ చ్ఛంద సంస్థలు, కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్న ఇటువంటి ప్రచార వేదికలకు హాజరుకాకపోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు. డీఆర్ఓకూ చురకలు.. డీఆర్ఓ వై. నర్సింహారావుపైనా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అర్ధం వచ్చేలా మాట్లాడడంతో కమిషనర్ మండిపడ్డారు. డీఆర్ఓ కలెక్టర్ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని, సమాచార హక్కు చట్టంలో దరఖాస్తుల కు కారణాలుండాలని ఏ కోర్టు చెప్పిందో చెప్పాలని సవాల్ విసిరారు. తొమ్మిదేళ్లుగా ఈ చట్టం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలుపై సమాచారం కోరడానికి కారణాలుండాల ని ఏ కోర్టయినా తీర్పు ఇచ్చిందా?లేక పార్లమెం టులో తీర్మానం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి కోట ప్రసాద్ మాట్లాడుతూ గాంధీ యో నరేంద్రమోదీయో కలలు కంటే గ్రామ స్వరాజ్యం రాదని, గ్రామస్తులు కలలు కంటేనే గ్రామ స్వరాజ్యం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ ఎంబీ అప్పారావు, నాగభూషణం, కృష్ణమూర్తి రాజు, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు?
దేశంలో నిరుపయోగమైన చట్టాలు దాదాపు 1,400 ఉన్నట్టు జైన్ కమిషన్ (1998) నివేదిక తెలిపింది. చట్టాలు చేయడంలో అమితాసక్తి చూపే మనం, కాలం చెల్లిన వాటిని రద్దు చేసుకోవడంలో నత్తనడక నడుస్తాం. బ్రిటిష్ కాలంనాటి 300 చట్టాలు నేటికీ చలామణిలో ఉన్నాయి. కాలం చెల్లిన ఈ చట్టాలు పౌరులకు అక్కరకు రాకున్నా, పౌరుల్ని వేధించే సాధనాలుగా నియంత్రణ వ్యవస్థలకు బాగా పనికొస్తాయి. సమాచార హక్కు చట్టం వచ్చాక ‘అధికారిక రహస్యాల చట్టం-1923’ కొనసాగటం అర్థరహితం. కానీ ఆ చట్టమే పాలనలో పారదర్శకతకు అడ్డుపడే అధికార సైంధవులకు ఊతమవుతోంది. కోల్‌కతాలో మీరు స్థలం అమ్మాలనుకుంటున్నారా? ఎవరికి పడితే వారికి అమ్మలేరు, అమ్మితే గిమ్మితే ‘ఈస్టిండియా కంపెనీ’కి మాత్రమే అమ్మాలి! 150 ఏళ్ల కిందటే ఆ కంపెనీ దేశం వదలి వెళ్లిందంటారా? అయినా, వారికి అమ్మా ల్సిందేనని చెప్పే 1838 నాటి చట్టం ఇంకా మన దేశంలో చలామణిలోనే ఉంది. మీ ఫ్యాక్టరీలో ఎంత అధునాతన సాంకేతిక అగ్నిమాపక వ్యవస్థను ఏర్పా టు చేసుకున్నా సరే... ఎర్ర రంగు వేసిన ఇసుక బకెట్లు, నీళ్ల బకెట్లు ఒకదాని పక్కన ఒకటి వేలాడదీయాల్సిందే. లేదంటే మీ మీద కేసు బుక్ చేయొ చ్చంటుంది 1867 నుంచీ అమల్లో ఉన్న ఇంకో చట్టం. భూమిలో ఏ చిన్న నాణమో, నగో, నట్రో... దొరికితే దాచుకునేరు, దొరికి పోతారు! అది ‘మహారాణి’కి అంటే బ్రిటన్‌లోని ఎలిజబెత్ రాణికే చెందు తుంది! హవ్వ! ఇంకెక్కడి రాణి? బ్రిటిష్‌వాళ్లు మనల్ని వదిలి ఆరు దశాబ్దాలు దాటిందంటారా? నిజమేగానీ, 1878 నాటి ‘ఇండియా ట్రెజర్ ట్రోవ్ చట్టం’ ఇంకా అమల్లోనే ఉంది. దాన్ని మనం వదల్లేదు. ఇదీ దేశంలోని కాలం చెల్లిన చట్టాల కథా కమామిషు! దురదృష్టవశాత్తు ఇలాంటి కొన్ని వందల చట్టాలు ఇంకా అమల్లో ఉన్నాయి. అవి ఉండి ఉద్ధరిం చేదేమీ లేకపోయినా, అధికార యంత్రాంగం సగటు పౌరులతో అప్పుడప్పుడూ ఓ ‘ఆట ఆడేసుకోడానికి’ మాత్రం పనికొస్తున్నాయి. మన ప్రధాని నరేంద్రమోదీ ‘‘కాలం చెల్లిన చట్టాలకు చరమ గీతం పాడతాం. కట్టకట్టి అన్నిటినీ అటకెక్కి స్తాం, కావాలంటే రోజుకొకదానికి చొప్పున చెల్లుచీటీ పాడతాం’’ అని ప్రకటిం చిన తర్వాత ఈ సమస్యపై కొంత కదలిక మొదలైంది. కానీ, ఆశించినంత పక డ్బందీగా ఆ పని జరగట్లేదు. పాత కథే మళ్లీ మొదలవుతోంది. అసంబద్ధ్దమైన, కాలం చెల్లిన చట్టాల్ని పూర్తిగా వదిలించుకోవడమో, తగు రీతిన సవరించుకోవ డమో జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ లోగడ జరిగినట్టే... ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఇదీ అసలు కథ! ఈ వేగం సరిపోతుందా? అనవసరమైన, అమలుకు వీలుకాని, కాలదోషం పట్టిన చట్టాల్ని తొలగించాలని చాలా కాలంగా దేశంలో చర్చ జరుగుతోంది. కొంత కసరత్తు, ఆచరణ కూడా లోగడ జరిగింది. ‘కొన్ని పరిమిత అంశాలు అని కాదు, మొత్తం చట్టమే అమలు యోగ్యం కాని సందర్భాలు కూడా ఈ దేశంలో కొల్లలుగా ఉన్నాయి’ అని ప్రముఖ ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రాయ్ వ్యాఖ్యానించారు. కాలదోషం పట్టిన చట్టం, కొంత కాలం గడిచాక నియంత్రణ వ్యవస్థలు, వ్యక్తులు దురుపయోగం చేయడానికే పనికి వస్తుందని అంటారాయన. మన చట్టాల అసంబద్ధ్దతపై ఒక పుస్తకమే రాసిన దేబ్రాయ్ సలహా మేరకు... గత సార్వత్రిక ఎన్నికల ప్రచా రంలో నరేంద్ర మోదీ ఈ విషయమై నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇటువంటి చట్టాల్ని రద్దు చేస్తామన్న ప్రధాని ఇటీవలి అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ ఈ అంశాన్ని నొక్కిచెప్పారు. కాలం చెల్లిన చట్టాల ‘రద్దు, సవరణల బిల్లు-2014’ కు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెం టు ఆమోదం పొందేందుకు ఏర్పాట్లు జరిగాయి. తొలగించాల్సిన చట్టాలు దాదాపు 300 ఉన్నాయని అగ్రనేతలు ప్రకటిస్తూ వచ్చారు. గత జూన్ నుంచి లోతైన అధ్యయనం కూడా జరిగింది. చివరకు 36 చట్టాలను తొలగించడమో, సవరించడమో చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వాటినే ప్రస్తుత బిల్లులో పొందుపరిచారు. అయితే వీటిలో పూర్తి స్థాయిలో తొలగిస్తున్న చట్టాలు 4 మాత్రమే. ఇండియన్ ఫిషరీస్ యాక్ట్-1897, ఫారిన్ జూరిస్డిక్షన్ యాక్ట్- 1947, ది షుగర్ అండర్‌టేకింగ్ యాక్ట్-1978, ది ఎంప్లాయ్మెంట్ ఆప్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లేట్రిన్స్ యాక్ట్-1993 ఈ తొలగించే చట్టా ల్లో ఉన్నాయి. మరో 30 చట్టాలు నిజానికి పూర్తిస్థాయి చట్టాలు కావు. ఆయా సందర్భాల్లో ప్రధాన చట్టాల్లో సవరణలకు ఉద్దేశించిన బుల్లి చట్టాలు. అవి ఎప్పుడో కాలదోషం పట్టినవి, సహజంగానే వినియోగంలో లేనివి. ఇప్పుడు రద్దవుతున్నాయి. మరో రెండు ముఖ్యమైన చట్టాలు, మరుగుదొడ్ల శుద్ధిలో మనుషుల సేవల్ని నిషేధించి, పునరావాసం కల్పించే చట్టం-2013, విజిల్బ్లో యర్స్ రక్షణ చట్టం- 2011లలో కొన్ని సవరణలు తీసుకురానున్నారు. వచ్చే సమావేశాల్లో మరికొన్ని చట్టాల్ని తొలగించే యోచన ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక తొలి యాభయ్యేళ్లలో నూరు చట్టాల్ని మాత్రం రద్దు చేసుకోగలిగాం. 1998లో జైన్ నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ దేశంలో దాదాపు 1,400 నిరుపయోగమైన చట్టాలున్నట్టు నివేదిక ఇచ్చింది. మొత్తమ్మీద దేశంలో కాలదోషం పట్టి, రద్దయిన చట్టాలు ఇప్పటివరకు 400 కూడా లేవు. బ్రిటిష్ పాలన కాలంలో వచ్చిన చట్టాలే ఇంకా 300 వరకు చలామణిలో ఉన్నాయి. 2001 తర్వాత ఇప్పుడే మళ్లీ ఇటువంటి చట్టాల్ని తొలగించే ప్రక్రియకు పెద్ద ఎత్తున పూనుకున్నారు. చట్టాలు చేయడంలో అమితాసక్తి చూపే మనం, కాలం చెల్లిన వాటిని రద్దు చేసుకోవడంలో మాత్రం నత్తనడక తీరున వ్యవహరిస్తాం. కాలానుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవడంలోనూ మనది ఆచితూచి నడిచే ధోరణే! తిప్పి కొడితే వందసార్లు రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి (2013 వరకు 98 సవరణలు) ఆరు దశాబ్దాల కాలం పట్టింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఫ్రాన్స్ రాజ్యాంగం మీద ఓ మంచి జోక్ ప్రచారంలో ఉంది. పారిస్‌లో ఎవరో ఒక ఔత్సాహికుడు పుస్తక విక్రేత దగ్గరికెళ్లి, ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రతి అడిగాడు. ‘సారీ, మేం పీరియాడికల్స్ విక్రయించం’ అన్నాట్ట! అంటే, ఓ వార పత్రికలాగో, మాస పత్రికలాగో వాళ్ల రాజ్యాంగం తరచూ సవరణలకు గురవుతోందని కవి హృదయం. పనికిరాని చట్టాలతో ప్రమాదం..! విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టం వచ్చాక ఇంకా ‘అధికారిక రహస్యాల చట్టం-1923’ కొనసాగటంలో అర్థమేముంది? నిజానికి ఆ చట్టంలో ‘గోప్యత’ అంటూ పొందుపరచిన అంశాలేవీ చెల్లుబాటు కావని 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. ఎలా అంటే, ‘సమాచారం ఇవ్వటం-నిరాకరించడం’ అన్న వివాదం తలెత్తినపుడు... అధికారిక రహస్యాల చట్టంతో సహా దేశంలోని ఏ చట్టంలో ఏం చెప్పినప్పటికీ, సమాచార హక్కు చట్టంలో పేర్కొన్నదే అంతిమం అనే నిబంధన ఉంది. అలాంటప్పుడు అధికా రిక రహస్యాల చట్టం ఉంటేనేం, లేకుంటేనేం? అనే భావన ఎవరికైనా కలగ వచ్చు. కానీ, ‘గోప్యత’ను అడ్డుపెట్టుకొని పాలనలో పారదర్శకతకు అడ్డుపడే అధికార సైంధవుల భావజాలానికి ఇటు వంటి చట్టాలు ఊతమిస్తాయి. కాబట్టి అవి అసలు చెల్లుబడిలోనే ఉండకూడదు. కాలంచెల్లిన చట్టాలు పౌరులకు ఉపయోగపడకపోగా కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. సాధారణ పౌరులకు అక్కరకురాని చట్టాలు, పౌరుల్ని వేధించే సాధనాలుగా నియంత్రణ వ్యవస్థలకు బాగా పనికొస్తాయి. కాలదోషం పట్టిన చట్టాల్లోని అర్థంపర్థం లేని సెక్షన్లను చూపి వేధించే నియంత్రణ అధికారులు ఎందరో! ఉదాహరణకు: ‘ఒక చోటి నుంచి మరోచోటికి ఉత్తరాల్ని బట్వాడా చేసే అధికారం ఒక్క సమాఖ్య రాజ్యానికే ఉంది’ అని ‘ది ఇండియన్ పోస్టాఫీస్ యాక్ట్-1898’ చెబుతుంది. అదింకా అమల్లోనే ఉంది. ‘ఏయ్! మీరెవరు ఉత్తరాల బట్వాడాకు?’ అనే అధికారుల బెదిరింపులకు జడిసి, ఇప్పుడున్న కొరియర్ సర్వీసు సంస్థలన్నీ ఉత్తరాల్ని ఉత్తరాలు అనకుండా ‘పత్రాలు’ (డాక్యుమెంట్స్) అంటున్నాయి! మరో అంబేద్కర్ రావాలా? ఇలాంటి పనికిమాలిన అంశాల ఆధారంగా సాగించే జులుం ఎంతో! ఈ చట్టాల వల్ల ప్రజలకే కాకుండా ప్రభుత్వాలకూ ఒరిగేదేమీ ఉండదు. 2013-14లో ఉప్పుపై విధించిన సెస్సు ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 32.82 కోట్ల రూపాయలు. ఈ సెస్సు వసూళ్ల కోసం 800 మంది ఉద్యోగులతో ఇండియన్ సాల్ట్ సర్వీస్ పేరిట ఓ విభాగాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు ఆదాయానికి దాదాపు రెట్టింపు. నవ్వొచ్చినా నవ్వకండి! ‘ఉప్పు సెస్సు చట్టం- 1953’ ప్రకారం జరుగుతోందిదే. ‘ఉప్పు సెస్సు వార్షికాదాయం మొత్తంలో సగంకన్నా ఎక్కువ వసూళ్లకే వ్యయమౌతోంది, ఈ సెస్సును ఎత్తివేయండి’ అని 1978లోనే ఓ ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి మరో అంబేద్కర్ రావాలేమో! న్యాయస్థానాల కొరత, ఎన్నటికీ భర్తీ కాని న్యాయమూర్తుల ఖాళీలు, విచారణల్లో అనుచిత జాప్యాలు... ఇలా అనేకానేక కారణాల వల్ల ఈ దేశంలో ఇప్పటికే సకాలంలో న్యాయం లభించడం గగనమౌతోంది. లెక్కకు మిక్కిలిగా ఉన్న చట్టాలే సామాన్యులను అయోమయంలోకి నెడుతున్నాయి. పైగా కాలదోషం పట్టిన చట్టాలు వాటికి తోడై వారికి న్యాయాన్ని అందించడంలో మరింత జాప్యం జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త! న్యాయ జాప్యం, న్యాయ నిరాకరణ కిందే లెక్క! ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ -
సచిన్ బంగారం!
ప్రత్యేక బంగారు నాణేలు విడుదల చేసిన ఈస్టిండియా కంపెనీ లండన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్‌కు కనకాభిషేకం జరిగింది. అతని ఘనతలను గుర్తు చేస్తూ బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీ కొత్తగా ప్రత్యేక బంగారు నాణేలను విడుదల చేసింది. ఈ సంస్థ సచిన్ 24 ఏళ్ల కెరీర్ నేపథ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో చేసిన నాణేలు తయారు చేసింది. సచిన్ టెస్టుల సంఖ్యను సూచించే విధంగా ఒక్కో నాణెం 200 గ్రాముల బరువు ఉంది. ఒక్కోటి 12 వేల పౌండ్లు (దాదాపు రూ. 12 లక్షలు) విలువైన 210 నాణేలు మార్కెట్లో ఇప్పుడు అభిమానుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటికి బ్రిటన్ ప్రభుత్వంనుంచి అధికారిక గుర్తింపు, విలువ ఉన్నాయి. నాణెంలో ఒక వైపు సచిన్ బొమ్మ, అతని టెస్టు జెర్సీ నం 187, మాస్టర్ సంతకంతో కూడిన బ్యాట్, స్వస్థలం ముంబైని సూచించే విధంగా ఇండియా గేట్ బొమ్మ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు అని దానిపై రాసి ఉంది. నాణేనికి మరో వైపు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ బొమ్మ ఉంది. వేర్వేరు కారణాలతో నాణేల విడుదల ఆలస్యమైనా...ఒక దిగ్గజంతో జత కట్టడం సంతోషంగా ఉందని ఈస్టిండియా కంపెనీ సీఈఓ సంజీవ్ మెహతా వెల్లడించారు. -
సచిన్ గౌరవార్ధం అరుదైన నాణెం విడుదల
లండన్: క్రికెట్ రంగానికి సచిన్ అందించిన సేవలకు గుర్తుగా బ్రిటన్ కు చెందిన వ్యాపారస్థంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ అరుదైన బంగారు నాణాన్ని విడుదల చేసింది. సచిన్ గౌరవార్ధం 12 వేల పౌండ్ల స్టెర్లింగ్ విలువ కలిగిన నాణానికి పూర్తి చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటాయని ఈస్ట్ ఇండియా కంపెనీ వెల్లడించింది. 24 ఏళ్ల కెరీర్ లో క్రికెట్ కు అత్యత్తమ సేవలందించినందుకుగాను అరుదైన నాణాన్ని విడుదల చేసామని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అతి తక్కవ మంది మాత్రమే ఇప్పటి వరకు చూసిన 200 గ్రాముల బరువుతో ఉండే 210 బంగారు నాణాలు విడుదల చేశామన్నారు. అందమైన బాక్సులో అమర్చిన నాణెంతోపాటు అధికారిక ధ్రువపత్రంతోపాటు సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్ ను అందిస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ రంగానికి తాను చేసిన సేవలకు గుర్తింపుగా దక్కిన గొప్ప గౌరవం అని సచిన్ టెండూల్కర్ అన్నారు. భారత జట్టుకు ఆడాలని కలలు కనేవాడిని. 24 ఏళ్లపాటు క్రికెట్ రంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టం. క్రికెట్ రంగానికి అందించిన సేవలకు గుర్తుగా అరుదైన బంగారు నాణాన్ని విడుదల చేయడం నాకు లభించిన గొప్ప గౌరవం అని సచిన్ అన్నారు. -
ఖతార్‌లో ఈస్టిండియా కంపెనీ!
దుబాయి: ఈస్టిండియా కంపెనీ.. భారతీయులకు చిరపరిచితమైన పేరు. 1600 సంవత్సరంలో ఇంగ్లండ్‌లో క్వీన్ ఎలిజబెత్ ఇచ్చిన రాయల్ చార్టర్ అనుమతితో ఏర్పడి.. వ్యాపార అవసరాల కోసం మన దేశంలో అడుగుపెట్టి.. దేశాన్నే కొల్లగొట్టిన నేపథ్యం ఆ కంపెనీది. భారత్‌లో జన్మించిన సంజీవ్ మెహతా 2005లో ఆ కంపెనీని కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. లండన్‌లోని మేఫెయిర్‌లో ఆగస్ట్, 2010లో మళ్లీ మొదటి స్టోర్‌ను ఆ కంపెనీ ప్రారంభించింది. అనంతరం ఇంగ్లండ్‌లోనే మరో రెండు దుకాణాలను తెరిచింది. తాజాగా ఖతార్ రాజధాని దోహాలో ఓ స్టోర్‌ను ఈస్టిండియా కంపెనీ ప్రారంభించింది. ఈ కంపెనీకి ఇప్పటికే కువైట్‌లో ఓ స్టోర్ ఉంది. త్వరలోనే సౌదీ అరేబియా, యూఏఈల్లో అమ్మకాలు ప్రారంభించనుంది. ఇంతకీ ఈ కంపెనీ ఏం అమ్ముతుందంటారా? నాణ్యమైన టీ, కాఫీ పొడులు.. నోరూరించే ఖరీదైన చాక్లెట్లు, బిస్కట్లు.. ప్రత్యేకంగా తయారు చేయించిన స్వీట్లు, జామ్‌లు.. మొదలైనవి ఈ కంపెనీ అమ్మకపు శ్రేణి లో ఉన్నాయి. వాటితో పాటు, నిపుణులైన కళాకారులతో తయారు చేయించిన అత్యంత సుందరమైన, నాణ్యమైన పింగాణీ పాత్రలను కూడా అమ్ముతుంది. వాటిపై నిపుణులైన పెయింటర్లు వేసిన పెయింటింగ్‌లు కూడా ఉంటాయి.