అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్యకలాపాల ద్వారా భారత్‌లో విదేశీ కుట్రకు పాల్పడుతోందన్న ఆరోపణలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్‌కు చెందిన ‘పాంచ్‌జన్య’లో అమెజాన్‌ను ‘ఈస్టిండియా కంపెనీ 2.0’తో పోలుస్తూ ఓ కవర్ స్టోరీ ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ కథనానికి అమెజాన్ కౌంటర్ ఇచ్చింది.
‘ఈస్టిండియా కంపెనీ 2.0’ అనే హెడ్డింగ్‌తో అమెజాన్‌కు వ్యతిరేకంగా ఈమధ్య ఓ కథనాన్ని ప్రచురించింది పాంచ్‌జన్య. అందులో.. ‘‘భారత మార్కెట్‌లో పైచేయి కోసం అమెజాన్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నిరకాలు స్వేచ్ఛలను, భారతీయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంది. తమ అనుకూలత కోసం ఓ మెట్టుదిగజారి అవినీతికి సైతం పాల్పడుతోంది. వీటికి తోడు ప్రైమ్ వీడియోల ద్వారా సంప్రదాయాల్ని నాశనం చేస్తోంది. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ ఎలాగైతే భారత్‌ను దోచుకుందో.. ఇప్పుడు అదేవిధంగా జాతి సంపదను కొల్లగొడుతూ అమెజాన్ మరో ఈస్టిండియా కంపెనీని తలపిస్తోంది’’ అని ఆరోపించింది పాంచ్‌జన్య. అయితే ఈ కథనానికి స్పందించిన అమెజాన్.. తమ విక్రయదారుల్లో భారత ఎగుమతిదారులూ ఉన్నారని, వాళ్ల ద్వారా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులనే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నామని తెలిపింది.
లెక్కలతో సహా..
200 దేశాల్లో భారత ఉత్పత్తులను అందిస్తున్నామని స్పష్టం చేసింది అమెజాన్. అంతేకాదు భారత అమ్మకందారులకు అమెజాన్ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తుందో వివరించింది. ‘‘కరోనా టైంలో మూడు లక్షల మంది కొత్త అమ్మకందారులు చేరారు. అందులో 45 ఫ్లస్ నగరాల నుంచి 75 వేలమంది స్థానిక దుకాణదారులే ఉన్నారు. మెట్రోనగరాలు, టైర్-2, టైర్-3, టైర్- స్థాయి పట్టణాల నుంచి కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రొడక్టులను సేకరించి.. 200 దేశాల్లో మా సర్వీసుల ద్వారా అందిస్తున్నాం. పైగా అమెజాన్ ఎక్స్‌పోర్ట్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది భారత్‌కు చెందిన ఎగుమతిదారులే ఉన్నారని, వాళ్లంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే అమ్ముతున్నారని స్పష్టం చేసింది.
చదవండి: భారత్‌లో అమెజాన్ ‘ధన’బలం!
చదవండి: అమెజాన్ లీగల్ ప్రతినిధుల రాంగ్‌రూట్?!
ఇదిలా ఉంటే పాంచ్‌జన్య.. గత కొన్నిరోజులుగా అమెజాన్ మీద ఫోకస్ పెట్టి వరుస కథనాలు ప్రచురిస్తోంది. హిందీ వీక్లీ, ఆరెస్సెస్ అనుబంధ పత్రికా విభాగం అయిన పాంచ్‌జన్య ఇంతకు ముందు ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ను ‘జాతి వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే కదా!. అయితే ఈ కథనంపై ఆరెస్సెస్ ఆల్‌ఇండియా పబ్లిసిటీ ఇన్‌ఛార్జ్ సునీల్ అంబేకర్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. పాంచ్‌జన్య కథనం రాసినవాళ్ల సొంత అభిప్రాయమని, ఆరెస్సెస్‌తో ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Panchjanya is not mouthpiece of the RSS and the said article or opinions expressed in it should not be linked with the RSS. @editorvskbharat
— Sunil Ambekar (@SunilAmbekarM) September 5, 2021
సంఘ్‌కు అవసరమా?
ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ జోక్యానికి కారణమైంది. ఆరెస్సెస్ పాంచ్‌జన్య కథనాన్ని కాంగ్రెస్ పార్టీ అప్రస్తుతమని పేర్కొంది. అవసరం లేని వ్యవహారాల్లో ఆరెస్సెస్ జోక్యం ఎక్కువైందని, అమెజాన్ మీద పాంచ్‌జన్య ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని, ఉపేక్షించదగినవి కావని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ ప్రయోజనాలకే తప్ప.. దేశ ప్రయోజనాలకు ఆ విభాగం(ఆరెస్సెస్) పని చేయదంటూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment