Panchjanya
-
భారత్‌లో ‘కుట్ర’ ఆరోపణలు.. అమెజాన్ రియాక్షన్ ఇది
అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్యకలాపాల ద్వారా భారత్‌లో విదేశీ కుట్రకు పాల్పడుతోందన్న ఆరోపణలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్‌కు చెందిన ‘పాంచ్‌జన్య’లో అమెజాన్‌ను ‘ఈస్టిండియా కంపెనీ 2.0’తో పోలుస్తూ ఓ కవర్ స్టోరీ ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ కథనానికి అమెజాన్ కౌంటర్ ఇచ్చింది. ‘ఈస్టిండియా కంపెనీ 2.0’ అనే హెడ్డింగ్‌తో అమెజాన్‌కు వ్యతిరేకంగా ఈమధ్య ఓ కథనాన్ని ప్రచురించింది పాంచ్‌జన్య. అందులో.. ‘‘భారత మార్కెట్లో పైచేయి కోసం అమెజాన్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నిరకాలు స్వేచ్ఛలను, భారతీయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంది. తమ అనుకూలత కోసం ఓ మెట్టుదిగజారి అవినీతికి సైతం పాల్పడుతోంది. వీటికి తోడు ప్రైమ్ వీడియోల ద్వారా సంప్రదాయాల్ని నాశనం చేస్తోంది. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ ఎలాగైతే భారత్‌ను దోచుకుందో.. ఇప్పుడు అదేవిధంగా జాతి సంపదను కొల్లగొడుతూ అమెజాన్ మరో ఈస్టిండియా కంపెనీని తలపిస్తోంది’’ అని ఆరోపించింది పాంచ్‌జన్య. అయితే ఈ కథనానికి స్పందించిన అమెజాన్.. తమ విక్రయదారుల్లో భారత ఎగుమతిదారులూ ఉన్నారని, వాళ్ల ద్వారా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులనే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నామని తెలిపింది. లెక్కలతో సహా.. 200 దేశాల్లో భారత ఉత్పత్తులను అందిస్తున్నామని స్పష్టం చేసింది అమెజాన్. అంతేకాదు భారత అమ్మకందారులకు అమెజాన్ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తుందో వివరించింది. ‘‘కరోనా టైంలో మూడు లక్షల మంది కొత్త అమ్మకందారులు చేరారు. అందులో 45 ఫ్లస్ నగరాల నుంచి 75 వేలమంది స్థానిక దుకాణదారులే ఉన్నారు. మెట్రోనగరాలు, టైర్-2, టైర్-3, టైర్- స్థాయి పట్టణాల నుంచి కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రొడక్టులను సేకరించి.. 200 దేశాల్లో మా సర్వీసుల ద్వారా అందిస్తున్నాం. పైగా అమెజాన్ ఎక్స్పోర్ట్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది భారత్‌కు చెందిన ఎగుమతిదారులే ఉన్నారని, వాళ్లంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే అమ్ముతున్నారని స్పష్టం చేసింది. చదవండి: భారత్‌లో అమెజాన్ ‘ధన’బలం! చదవండి: అమెజాన్ లీగల్ ప్రతినిధుల రాంగ్‌రూట్?! ఇదిలా ఉంటే పాంచ్‌జన్య.. గత కొన్నిరోజులుగా అమెజాన్ మీద ఫోకస్ పెట్టి వరుస కథనాలు ప్రచురిస్తోంది. హిందీ వీక్లీ, ఆరెస్సెస్ అనుబంధ పత్రికా విభాగం అయిన పాంచ్‌జన్య ఇంతకు ముందు ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ను ‘జాతి వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే కదా!. అయితే ఈ కథనంపై ఆరెస్సెస్ ఆల్ఇండియా పబ్లిసిటీ ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. పాంచ్‌జన్య కథనం రాసినవాళ్ల సొంత అభిప్రాయమని, ఆరెస్సెస్‌తో ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. Panchjanya is not mouthpiece of the RSS and the said article or opinions expressed in it should not be linked with the RSS. @editorvskbharat — Sunil Ambekar (@SunilAmbekarM) September 5, 2021 సంఘ్‌కు అవసరమా? ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ జోక్యానికి కారణమైంది. ఆరెస్సెస్ పాంచ్‌జన్య కథనాన్ని కాంగ్రెస్ పార్టీ అప్రస్తుతమని పేర్కొంది. అవసరం లేని వ్యవహారాల్లో ఆరెస్సెస్ జోక్యం ఎక్కువైందని, అమెజాన్ మీద పాంచ్‌జన్య ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని, ఉపేక్షించదగినవి కావని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ ప్రయోజనాలకే తప్ప.. దేశ ప్రయోజనాలకు ఆ విభాగం(ఆరెస్సెస్) పని చేయదంటూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: అమెజాన్‌కి చెక్ పెట్టే పనిలో టాటా గ్రూపు -
అన్సారీపై ఆర్ఎస్ఎస్ ధ్వజం
అత్యున్నత పదవిలో ఉంటూ లౌకిక ధర్మాన్ని పాటించాల్సింది పోయి ఫక్తు మత నాయకుడిలా మాట్లాడారంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ధ్వజమెత్తింది. ఇటీవల ఆలిండియా ముస్లిమ్ మజ్లిస్-ఏ-ముషావరత్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రసంగించిన అన్సారీ భారత్‌లో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారని వ్యాఖ్యానించడం తెలిసిందే. అన్సారీ అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తూ.. ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు వారి అతివాద ధోరణే కారణమని తెలియజెప్పడంలో అన్సారీ విఫలమయ్యారని ఆర్ఎస్ఎస్ తన అధికారిక పత్రిక 'పాంచజన్య'లో పేర్కొంది. గుర్తింపు, భధ్రత, విద్యావకాశాలు, అభివృద్ధి తదితర విషయాల్లో ముస్లింలు సవాళ్లను ఎదుర్కొంటున్నారంటూ అన్సారీ ఓ మత నాయకుడి మాదిరిగా మాట్లాడారని, అందరి సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఆయన స్థాయికి తగ్గట్లు వ్యవహరించలేదని 'పాంచజన్య' విమర్శించింది. 'ఇస్లాం, నవీన విధానం (మోడర్నిటీ) రైలు పట్టాల్లా ఎప్పటికీ కలవవని ఐఎస్ఐఎస్, తాలిబన్, బొకోహరాం లాంటి ముస్లిం తీవ్రవాద సంస్థలు అంటున్నాయి. ఇస్లాం, మోడర్నిటీలు వేరువేరనే నిజాన్ని అన్సారీ లాంటివాళ్లు చెప్పరు. శతాబ్దాల కిందట ఏర్పరుచుకున్న నియమాలు నూతన విధానాలెలా అవుతాయో ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి' అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు భారత్ అనుసరిస్తున్న లౌకిక విధానానికి ఎలా తూట్లు పొడుస్తున్నాయో అన్సారీ గుర్తెరగాలని, రిజర్వేషన్లు, అభివృద్ధి ఫలాలు మతం ఆధారంగా లభించవనే విషయం అర్థం చేసుకుంటే మంచిదని పేర్కొంది. ముస్లింలకు మదర్సాల ఏర్పాటుకు అనుమతులు, హజ్ యాత్రలకు ఆర్థిక సహాయం అందించడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది.