ఇంత దారుణం ఎక్కడా లేదు!
విజయనగరం కంటోన్మెంట్ : రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ బ్రిటిష్ వారసత్వ పోకడలను కొనసాగిస్తున్నారని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ విజయబాబు విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్‌లో సమాచార హక్కు ప్రచార వేదిక ఆధ్వర్యంలో జరిగిన మ హాసభలో ఆయన మాట్లాడారు. దేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమివేయడానికి వందేళ్లు పట్టిందని, ఇప్పుడు మన నాయకులు ఈస్ట్‌ఇండియా లాంటి కంపెనీలకు విద్యుత్, నీ రు, భూములు, ఇతర సౌకర్యాలిస్తామని వారికి రెడ్ కార్పెట్లు పరుస్తున్నారని ఆరోపించారు. అసలివి ప్రజాస్వామ్య ప్రభుత్వాలా? రాచరి కపు ప్రభుత్వాలా అని విమర్శించారు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారికి ప్రభుత్వా లు మర్యాదలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి సమయంలోనే ప్రజల నుంచి ధర్మాగ్రహం పెల్లుబుకుతుందని చెప్పారు.
41బి చట్టంతో పాటు, సెక్షన్ 21సి అమలు కాకపోవడంతో పెద్ద కంపెనీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని తెలిపారు. పీపీపీ, బీఓటీ ఒప్పం దాలతో ఎలాంటి ప్రయోజనం ఉందన్నారు. బీఓటీ ప్రాతిపదికన నిర్మించిన ని ర్మాణాలు ఒక్కటైనా ప్రభుత్వం అమలు చేయగలిగిందా అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో సమాచార హక్కు అమలు చేయడం లేదని, టీటీడీలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ప్ర భుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. రెండున్నరేళ్ల తన పదవీ కాలంలో తాను ఆదేశిం చిన కొన్ని పత్రా లు చెత్తబుట్టల్లో వేస్తున్నారని, దీంతో తాను ఎం దుకు సమాచార హక్కు కమిషనర్‌గా చేరానా అని ఆవేదన చెందిన రోజులున్నాయని చెప్పా రు.
అన్ని రంగాల్లోనూ జవాబుదారీ తనం ఉం డాలని.అందుకు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలుకు ఇబ్బందు లు ఎదురవుతున్నాయన్నారు. చట్టంపై ప్రచారం చేయాల్సిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు కోసం ప్రారంభంలో ఎలా అయితే సంగ్రామం నడిచిందో ఇ ప్పుడు కూడా విదేశీ సంస్థల పాలిట స మాచార హక్కు కోసం మరో సంగ్రామాన్ని నడపాల్సిన బాధ్యత అందరిపై నా ఉందన్నారు. ఇక్కడి నుంచే ఆ సంగ్రామం మొదలు కావాలని అభిలషించారు.
కలెక్టర్ బాధ్యతారాహిత్యం సరికాదు!
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు సమాంతరమైన సమాచార హక్కు కమిషనర్ జిల్లాకు వచ్చినప్పుడు కలెక్టర్ కనీసం స్పందించకపోవడం విచారకరమని విజయబా బు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి అధికారులకు సమాంతర హోదా ఉందని చెప్పుకో వడానికే గాని క్షేత్రస్థాయిలో ఆ హోదాను అమ లు చేయడంలో ఐఏఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.జిల్లాలో తన వా హనం మున్సిపాలిటీ కుక్కల బండి వచ్చినట్టు రావాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. దారి పొడవునా అడ్రస్ కనుక్కుని వచ్చానని చెప్పా రు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడం లేదని, ఒక సమాచార హక్కు కమిషనర్‌కు ఇలాగే ఆహ్వానం పలుకుతారా అని ప్ర శ్నించా రు. కొంతమంది ఉన్నతాధికారులు స్వ చ్ఛంద సంస్థలు, కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్న ఇటువంటి ప్రచార వేదికలకు హాజరుకాకపోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు.
డీఆర్‌ఓకూ చురకలు..
డీఆర్‌ఓ వై. నర్సింహారావుపైనా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అర్ధం వచ్చేలా మాట్లాడడంతో కమిషనర్ మండిపడ్డారు. డీఆర్‌ఓ కలెక్టర్ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని, సమాచార హక్కు చట్టంలో దరఖాస్తుల కు కారణాలుండాలని ఏ కోర్టు చెప్పిందో చెప్పాలని సవాల్ విసిరారు. తొమ్మిదేళ్లుగా ఈ చట్టం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలుపై సమాచారం కోరడానికి కారణాలుండాల ని ఏ కోర్టయినా తీర్పు ఇచ్చిందా?లేక పార్లమెం టులో తీర్మానం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి కోట ప్రసాద్ మాట్లాడుతూ గాంధీ యో నరేంద్రమోదీయో కలలు కంటే గ్రామ స్వరాజ్యం రాదని, గ్రామస్తులు కలలు కంటేనే గ్రామ స్వరాజ్యం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ ఎంబీ అప్పారావు, నాగభూషణం, కృష్ణమూర్తి రాజు, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.