
కౌలాలంపూర్: సింగపూర్‌లోనే అంత‍్యంత ఎత్తైన, ఖరీదైన మూడు అంతస్తుల భవన పెంటహౌజ్‌ను బ్రిటిష్ బిలియనీర్ జేమ్స్ డైసన్ ఆయన భార్య అమ్మకానికి పెట్టారు. బ్యాగ్‌లెస్ వ్యక్యూమ్ క్లీనర్ ఆవిష్కకర్తే జెమ్స్ డైసన్. అంత్యంత ఖరీదైన భవనానం పెంటహౌజ్‌ను డైసన్ గతేడాది 74 మిలియన్సింపూర్ డాలర్(యుఎస్ డాలర్. 54 మిలియన్)లకు కొనుగొలు చేశారు. అయితే ఈ పెంటహౌజ్‌ను డైసన్ 62 మిలియన్‌ల సింగపూర్ డాలర్‌కు ఆమెరికాకు చెందిన వ్యాపారవేత్తకు అమ్ముతున్నట్లు డైసన్ సంస్థ ప్రతినిధి అక్కడి మీడియాకు వెల్లడించారు. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో)
అయితే దీనిని డైసన్ కొనుగొలు చేసిన దానికంటే 15 శాతం నష్టానికి అమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. ఈ పెంట్‌హౌజ్‌ను ఇండోనేషియాకు చెందిన అమెరికా పౌరుడు లియో కొగువాన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. లియో కొగువాన్ అమెరికా ఇన్పోటెక్ ప్రోవైడర్, ఎస్‌హెచ్‌ఐ ఇంటర్నేషనల్ చైర్మన్, సహా వ్యవస్థాపకుడు. టాంజోంగ్ పగర్ సెంటర్, ఐదు పడక గదులతో సూపర్ పెంట్ హౌజ్‌గా పేదొందిన ఈ భవనం విలువ ఒకప్పుడు 100 మిలియన్ యుఎస్ డాలర్‌గా ఉండేది. ఈ సూపర్ పెంటహౌజ్‌లో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్, జాకుజీతో పాటు విలాసవంతమైన ప్రైవేటు గార్డెన్ ఉంది. (చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్)
Comments
Please login to add a commentAdd a comment