బ్రిటీష్ కు చెందిన ఫరాడైర్ అనే సంస్థ కొత్తగా హైబ్రిడ్ ట్రైప్లేన్‌ను అభివృద్ధి చేస్తున్నది. 2030 నాటికి ప్రయాణికులను తరలించే స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తున్నది. ఈ విమానం ద్వారా స్వల్ప దూరాలకు ప్రయాణికులను, సరుకులను వేగవంతంగా తరలించే అవకాశం ఉంటుంది. 18 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్ధ్యంతో విమానాన్ని రూపొందిస్తున్నారు. హైబ్రిడ్ ట్రైప్లేన్ గరిష్టంగా 5 మెట్రిక్ టన్నులను మోసుకెళ్లే సామర్ధ్యంతో కేవలం 15 నిమిషాల్లో కార్గో విమానంగా మార్చుకునేలా దీనిని సిద్ధం చేస్తున్నారు.
బయో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఎయిర్‌క్రాఫ్ట్(బీఈహెచ్ఏ) అని పిలువబడే ఈ మోడల్ లో ఇంధనంగా పేరుకు తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ - బయో ఫ్యూయల్ ఇంధనాన్ని వాడుతున్నారు. పర్యావరణ అనుకూల విమానాన్ని తయారు చేయడం తమ ఉద్దేశ్యమని సంస్థ పేర్కొంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తక్కువ ఖర్చుతో వేగంగా స్వల్ప దూర బాగా ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. బీఈహెచ్‌ఏలోని రెక్కలు మెరుగైన పనితీరును అందించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇంకా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బ్యాటరీలు అందుబాటులో లేవని వారు పేర్కొన్నారు. జీకేఎన్ ఏరోస్పేస్ అనే సంస్థ ఇప్పటికే 50 మంది ప్రయాణికులను తీసుకొళ్లేలా ఒక కాన్సెప్ట్ సిద్ధం చేస్తుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment